
భారత్‌కు రష్యా ఇంధన హామీ..
పశ్చిమాసియాలో కొనసాగుతోన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చమురు, ఎల్‌ఎన్‌జీ సరఫరా పెంచుతామన్న రష్యా
పశ్చిమాసియాలో సంఘర్షణ ప్రపంచ ఇంధన రంగాన్ని కుదిపేస్తున్న వేళ.. భారత్‌కు చమురు, ఎల్‌ఎన్‌జీ (Liquefied Natural Gas) సరఫరాను పెంచేందుకు రష్యా ముందుకొచ్చింది. ఇంధనానికి తీవ్ర ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో, రష్యా ప్రతిపాదన కీలక పరిణామంగా చెప్పుకోవాలి. రష్యా మొదటి ఉప ప్రధాని డెనిస్ మాంటురోవ్ న్యూఢిల్లీలో జరిగిన సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆయన అజిత్ దోవల్, ఎస్ జైశంకర్‌తో సమావేశమై ద్వైపాక్షిక ఇంధన సహకారంపై చర్చించారు. భారత్‌కు చమురు, ద్రవీకృత సహజ వాయువు (LNG) సరఫరాను క్రమంగా పెంచే సామర్థ్యం తమ కంపెనీలకు ఉందని మాంటురోవ్ స్పష్టం చేశారు.
అతి తక్కువగా ఇంధన రవాణా..
ఇక పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు పరిస్థితిని మరింత క్లిష్టం చేశాయి. హోర్ముజ్ జలసంధి వద్ద అంతరాయాలు ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్య ఉన్న ఈ ముఖ్య నౌకా మార్గం ద్వారా ప్రపంచ చమురు, ఎల్‌ఎన్‌జీలో సుమారు 20 శాతం రవాణా జరుగుతుంది.
పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్య ఉన్న హోర్ముజ్ నౌకా మార్గం ద్వారా ప్రపంచ చమురు, ఎల్‌ఎన్‌జీలో సుమారు 20 శాతం రవాణా జరుగుతుంది. ఇరాన్, అమెరికా - ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ జలసంధి దిగ్బంధానికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రపంచ చమురు, గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. భారత్ వంటి దేశాలకు ఇది పెద్ద సవాల్‌గా నిలిచింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రష్యా భారత్‌గా అండగా నిలిచింది. ఇంధన రంగంతో పాటు, వాణిజ్యం, పెట్టుబడులు, పరిశ్రమ, ఎరువులు, టెక్నాలజీ వంటి రంగాల్లో కూడా భారత్-రష్యా సహకారం పెంపుపై చర్చలు జరిగినట్లు సమాచారం. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇక రష్యా ఇప్పటికే భారతదేశానికి ఎరువుల సరఫరాను పెంచినట్లు తెలిపింది. 2025 చివరి నాటికి ఎరువుల సరఫరా 40 శాతం పెరిగిందని, భవిష్యత్తులో కూడా ఈ సరఫరాను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.
పౌర అణుశక్తి రంగంలో కూడా సహకారం పెంచాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఈ రంగంలో భారతదేశంతో భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు రష్యా ఆసక్తి చూపుతోంది.
మొత్తంగా, పశ్చిమ ఆసియా సంక్షోభం మధ్య రష్యా చేసిన ఈ ప్రతిపాదన భారత్‌కు ఇంధన భద్రత పరంగా ఒక కీలక అవకాశంగా నిలుస్తోంది. అంతర్జాతీయ పరిణామాల మధ్య, ఈ సహకారం భవిష్యత్తులో మరింత ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉంది.

