
ఇరాన్ మహామేధావిగా చెప్పే ఖమేదీని ఇజ్రాయెల్ చంపేసింది!
ఎవరీ ఇరాన్ మహామేధావీ, ఇజ్రాయెల్ ఎందుకు చంపిందీ?
పాక్ శాంతిచర్చల ప్రతిపాదనకు విఘాతం, ప్రతీకారం తప్పదన్న ఇరాన్
ఇరాన్- అమెరికా యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్న వేళ ఇరాన్ కీలక సైనిక నాయకత్వంపై కోలుకోలేని దెబ్బ పడింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గడువు విధిస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన కొన్ని గంటల్లోనే, ఇరాన్ సైనిక విభాగం IRGC (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) ఇంటెలిజెన్స్ చీఫ్ మేజర్ జనరల్ మజీద్ ఖదేమీ వైమానిక దాడిలో మరణించారు.
అర్ధరాత్రి దాడి.. లక్ష్యం ఖదేమీ
2026 ఏప్రిల్ 6 తెల్లవారుజామున టెహ్రాన్‌లోని వ్యూహాత్మక ప్రాంతాలపై ఇజ్రాయెల్, అమెరికా ఉమ్మడిగా వైమానిక దాడులు జరిపాయి. ఈ 'సర్జికల్ స్ట్రైక్'లో మేజర్ జనరల్ ఖదేమీ ఉన్న భవనాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. 2025లో ఇస్రాయేల్ దాడిలో చనిపోయిన మొహమ్మద్ కజమీ స్థానంలో బాధ్యతలు చేపట్టిన ఖదేమీ, కేవలం ఏడాది లోపే అదే తరహా దాడిలో ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.
ఆయనతో పాటు మరో సీనియర్ కమాండర్ 'యజ్దాన్ మీర్' కూడా మరణించినట్లు ఐఆర్జీసీ ధృవీకరించింది. పాకిస్తాన్ నుంచి శాంతిచర్చలు, 45 రోజుల కాల్పుల విరమణకు ప్రతిపాదనలు అందిన సమయంలో కజమీ ని హత్య చేయడం ఇరాన్ కు ఏమాత్రం మింగుడు పడని విషయం. దీంతో ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించింది.
ఇంతకీ ఎవరీ ఖదేమీ?
మేజర్ జనరల్ సయ్యద్ మజీద్ ఖదేమీ (Majid Khademi) ఇరాన్ సైనిక, గూఢచారి విభాగాల్లో అత్యంత కీలకమైన వ్యక్తి. ఆయన మరణించడం ఇరాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ. ఇరాన్ సైనిక వ్యవస్థలో చాలా కీలకమైన వ్యక్తి. అనేక మెళకువలు, రహస్య సమాచారం తెలిసిన అధికారి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆయన నేపథ్యం ఇలా ఉంది.
ఆయన ఇరాన్లో జన్మించారు (ఖచ్చితమైన నగరం లేదా గ్రామం వివరాలు భద్రతా కారణాల దృష్ట్యా బయటపెట్టలేదు.) ఆయన ఒక సంప్రదాయ ఇరానియన్ కుటుంబం నుంచి వచ్చారు. 1979 ఇరాన్ విప్లవం తర్వాత ఏర్పడిన 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' (IRGC)లో ఆయన అతి చిన్న వయసులోనే చేరారు. దాదాపు 50 ఏళ్ల పాటు ఆయన సైనిక, గూఢచారి సేవల్లో కొనసాగారు.
ఖదేమీ అత్యున్నత విద్యావంతుడు. కేవలం యుద్ధ తంత్రాలు తెలిసిన అధికారి మాత్రమే కాదు, రెండు రంగాలలో పీహెచ్డీ చేశారు. నేషనల్ సెక్యూరిటీ (జాతీయ భద్రత), స్ట్రాటజిక్ డిఫెన్స్ సైన్సెస్ (వ్యూహాత్మక రక్షణ శాస్త్రం)లో ఆయన దిట్ట. ఆయన ఇరాన్‌లోని ప్రతిష్టాత్మక సైనిక విశ్వవిద్యాలయాలైన సుప్రీం నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ (SNDU) వంటి సంస్థల్లో చదువుకున్నట్లు సమాచారం.
కుటుంబ వివరాలు..
ఆయన కుటుంబ వివరాలు (భార్య, పిల్లలు) బయటి ప్రపంచానికి తెలియవు. ఇరాన్ ఉన్నతాధికారులపై ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ 'మొసాద్' నిఘా ఉంటుందనే భయంతో వారి కుటుంబాలను అత్యంత రహస్య ప్రాంతాల్లో ఉంచుతారు. ఆయన మరణం తర్వాత ఇరాన్ మీడియా ఆయనను "మహా మేధావి, శక్తివంతమైన అధికారి" అని అభివర్ణించింది.
2018-2022 మధ్య ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖలో కీలక బాధ్యతలు చేపట్టారు. 2022లో IRGC ఇంటెలిజెన్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ అధిపతిగా నియమితులయ్యారు. 2025లో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకుని, నేడు తన విధి నిర్వహణలో మరణించారు. ఆయనను కేవలం ఒక సైనికుడిగా కాకుండా, ఇరాన్ రక్షణ వ్యవస్థకు ఒక "మేధో సంపత్తి" (Intellectual Asset) గా అక్కడి ప్రభుత్వం భావిస్తుంది.
IRGC ఇంటెలిజెన్స్ చీఫ్..
ఖదేమీ ఇరాన్ అత్యంత శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) లోని 'ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్' (గూఢచారి విభాగం)కు అధిపతిగా ఉండేవారు. ఆయన గతంలో రక్షణ మంత్రిత్వ శాఖలో 'ఇంటెలిజెన్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్'కు కూడా నాయకత్వం వహించారు. విదేశీ గూఢచారుల (ముఖ్యంగా మొసాద్, CIA) చర్యలను అడ్డుకోవడంలో ఆయన నిపుణుడిగా పేరుపొందారు.
ఆయన ఈ పదవిలోకి రావడం కూడా ఒక విషాదకరమైన పరిస్థితుల్లోనే జరిగింది. జూన్ 2025లో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ మొహమ్మద్ కజమీ ఇస్రాయేల్ దాడిలో చనిపోవడంతో, ఆయన స్థానంలో మజీద్ ఖదేమీ బాధ్యతలు చేపట్టారు. ఏప్రిల్ 6న టెహ్రాన్‌పై అమెరికా-ఇస్రాయేల్ జరిపిన ఉమ్మడి వైమానిక దాడుల్లో ఆయన చనిపోయారు.
2026 ఫిబ్రవరిలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన తర్వాత, ఇరాన్ సైనిక వ్యవస్థను సమన్వయం చేస్తున్న అతికొద్ది మంది సీనియర్ అధికారులలో ఖదేమీ ఒకరు.
Next Story

