జేఎం, ఎల్ఈటీ ఉగ్రవాదుల అంత్యక్రియల చిత్రాలు విడుదల
x
ఆపరేషన్ సింధూర్ కు ముందు ఉన్న ఉగ్రవాద స్థావరాలు

జేఎం, ఎల్ఈటీ ఉగ్రవాదుల అంత్యక్రియల చిత్రాలు విడుదల

ఆపరేషన్ సింధూర్ తరువాత జరిగిన నష్టాన్ని వివరిస్తున్న పలు పోస్టులు


(మూలం.. రాజేశ్ అహుజా)

పాక్, పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేసిన 14 గంటల తరువాత వందలాది మంది లష్కర్ ఏ తోయిబా మద్దతుదారులు మరణించిన వారి సహచరులకు చివరి నివాళులు అర్పించడానికి గుమిగూడారు.

1943 లో ఉర్దూ కవి అస్గర్ సౌదౌ రూపొందించిన ‘‘పాకిస్తాన్ కా మతలబ్ క్యా, లా ఇలాహ ఇల్లల్లా’’ (పాకిస్తాన్ అంటే ఏమిటీ, అల్లా తప్ప దేవుడు లేడు) అనే నినాదాన్ని వారు చేస్తున్నట్లు వీడియో క్లిప్ లలో చూపించారు. ఈ నినాదం ఆ కాలంలో తరువాత రాజకీయ ర్యాలీలుగా మారి పాకిస్తాన్ ఏర్పాటుకు దారి తీసింది.
మురిడ్కేలో అంత్యక్రియలు..
ఎల్ఈటీ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ స్థాపించిన రాజకీయ పార్టీ పాకిస్తాన్ మర్కాజీ ముస్లిం లీగ్ సమాచార కార్యదర్శిగా చెప్పుకునే ముహమ్మాద్ అబ్దుల్లా సామాజిక మాధ్యమం ఎక్స్ లో అంత్యక్రియల వీడియోను పోస్ట్ చేశాడు. ఇందులో చనిపోయిన ఉగ్రవాదులను అమరవీరులుగా చిత్రించడం విశేషం.
అక్కడ భారత్ ఉగ్రవాద స్థావరాలు, వారి మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడిందని ఈ చిత్రాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
ఇక్కడ జరుగుతున్న అంత్యక్రియల్లో ‘‘మురిద్కే అమరవీరుడి అంత్యక్రియలలో సబిలునా అల్ జెహాద్(జీహాద్ మా మార్గం) ప్రతిధ్వని’’ అని ఉర్ధూలో చదవడం వినిపించింది.
భారత్ దాడి చేసిన తొమ్మిది ఉగ్రవాద కర్మగారాలలో ఒకటి పాకిస్తాన్ పంజాబ్ రాజధాని అయిన లాహోర్ శివార్లలోని మురిడ్కే లష్కర్ ఏ తోయిబా ప్రధాన కార్యాలయం ఉంది.
భారత్ కు హెచ్చరిక..
బహవల్ పూర్ లోని జరిగిన ఒక అంత్యక్రియల వీడియోను అబ్దుల్లా ఎక్స్ లో పోస్ట్ చేశారు. అక్కడ మరొక ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహ్మద్ (జేఎం) ప్రధాన కార్యాలయం భారత్ ను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్రణాళిక, శిక్షణ అందిస్తుంది.
అతని ట్వీట్ ను ఉర్దూ నుంచి ఎక్స్ నుంచి ఆంగ్లంలోకి అనువదించారు. దాని ప్రకారం.. ‘‘బహవల్ పూర్ అమరవీరుల అంత్యక్రియల ప్రార్థనలు కూడా సైనిక గౌరవాలతో జరిగాయి. దేవుడు కోరుకుంటే, అమాయకు పువ్వుల బలిదానానికి భారత్ మూల్యం చెల్లించుకుంటుంది’’ అని హెచ్చరికలు జారీ చేశారు. ఇది ఉగ్రవాదులకు జరిగిన అతిపెద్ద నష్టాన్ని సూచిస్తుంది.
ప్రతి స్పందన కోసం..
ఇది అబ్దుల్లా భారత్ కు జారీ చేసిన మొదటి హెచ్చరిక కాదు. తెల్లవారుజామున 1.28 గంటలకు దాడులు జరిగిన వెంటనే అతను ఎక్స్ లో ఇలాంటి ట్వీట్ చేశారు. అతని వ్యాఖ్య వచ్చింది.
ఇతర పోస్టులలో భారత దాడులు మసీదులకు లక్ష్యంగా చేసుకున్నాయని, ఫలితంగా 26 మంది పాకిస్తానీయులు బలిదానం చేశారని ఆయన పేర్కొన్నారు.
యాధృచ్చికంగా పహల్గామ్ లో కూడా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది అమాయకులను కాల్చి చంపారు. పిన్ పాయింట్ టార్గెట్ తో ఏకంగా తొమ్మిది స్థానాలపై మిస్సైల్ల తో దాడులు చేసింది.
లక్ష్యాలను ఎలా ఎంచుకున్నారు?
రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(ఆర్ అండ్ ఏ డబ్ల్యూ) నుంచి వచ్చిన నిఘా సమాచారం అంచనా వేయడం, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఓవర్ హెడ్ ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ, సైన్యం నుంచి వచ్చిన ఇన్ పుట్ లతో లక్ష్యాలను ఎంచుకుందని చెబుతున్నాయి.
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడి తరువాత పాకిస్తాన్ అనేక ఉగ్రవాద కర్మాగారాలను మభ్యపెట్టడానికి జాగ్రత్తలు తీసుకుందని ప్రాథమిక నివేదికలు సూచించాయి. ఉగ్రవాద నియమాకాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కూడా నివేదికలు అందాయి. కానీ అన్నింటిని ధృవీకరించుకున్న భారత సైన్యం దాడులు చేసి పదుల సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టింది.


Read More
Next Story