ఐరాసలో తీవ్ర అవమానాల పాలైన పాకిస్తాన్
x
ఆంటోనియో గుటెరస్

ఐరాసలో తీవ్ర అవమానాల పాలైన పాకిస్తాన్

పహల్గామ్ ఘటనను ఖండించిన ఐరాస భద్రతామండలి


పహల్గాం ఉగ్రవాద దాడి విషయంలో ఐరాస లో భారత్ ను కార్నర్ చేయడానికి ప్రయత్నించిన పాకిస్తాన్ కు ఊహించని విధంగా అవమానం ఎదురైంది. అమాయక పర్యటకులను మతం అడిగి చంపడాన్ని భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది.

ఏప్రిల్ 22న బైసారన్ గడ్డి మైదానాల్లో పాక్ కు చెందిన లష్కరే తోయిబా(ఎల్ఈటీ) ప్రమేయం ఉందో లేదో చెప్పాలని కొంతమంది సభ్యులు ఇస్లామాబాద్ ప్రతినిధిని డిమాండ్ చేశారు.
పహల్గామ్ కు ఎల్ఈటీ లింక్?
ఈ ఉగ్రవాద దాడికి తామే బాధ్యులమని మొదట ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. ఇది ఎల్ఈటీకి అనుబంధంగా ఉంది. ‘‘ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్యులు తమ అనధికారిక సమావేశంలో పాకిస్తాన్ కోసం కఠినమైన ప్రశ్నలు లేవనెత్తారు. భారత్ తో ద్వైపాక్షికంగా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు’’ అని భారత వర్గాలు తెలిపాయి.
కౌన్సిల్ లోని పది శాశ్వత సభ్యదేశాలలో పాకిస్తాన్ కూడా ఒకటి. దాని ఇతర సభ్యులలో వీటో సమర్థవంతమైన శాశ్వత ఐదు దేశాలు, అల్జీరియా, డెన్మార్క్, గ్రీస్, గయానా, పనామా, దక్షిణ కొరియా, సియోర్రా లియోన్, స్లోవేనియా, సోమాలియా ఉన్నాయి.
ఊచకోత..
భారత్ పై పాకిస్తానీలు చెప్పే ఉగ్రవాదుల గుంపు 25 మంది పర్యాటకులను వారి మతం అడిగి, గుర్తింపు కార్డులు చూసి, ప్యాంట్లు విప్పి హిందువులని గుర్తించి మరీ చంపారు. ఈ కాల్పుల్లో పహల్గామ్ ముస్లిం అయిన కాశ్మీర్ పోనీ రైడ్ ఆపరేటర్ ను సైతం కాల్చి చంపారు.
ఈ ఘోరకలిపై పాకిస్తాన్ మాటలను ఐరాస భద్రతామండలి సభ్యులు అంగీకరించలేదు. భారత్ తో ఉన్న సమస్యలను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని కోరారు. వారంతా ముక్తకంఠంతో పహల్గామ్ ఊచకోతను ఖండించారు. జవాబుదారీతనం అవసరాన్ని ఎత్తి చూపారు.
అణు ముప్పు..
పాకిస్తాన్ పై దాడి చేస్తే అణ్వాయుధాలతో దాడి చేస్తామని ఆ దేశ మంత్రులు వ్యాఖ్యానించడంపై భద్రతామండలి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పాక్ చేస్తున్న వరుస క్షిపణి పరీక్షలు దక్షిణాసియాలో ఉద్రిక్తతలకు కారణం అవుతుందని అన్నారు.
భద్రతా మండలి సమావేశం తరువాత ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ, పాకిస్తాన్ రాయబారీ ఆసిమ్ ఇప్తికార్ ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ ప్రమేయం లేదని పునరుద్ఘాటించారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత న్యూఢిల్లీ తీసుకున్న ప్రతీకార చర్యల్లో సింధు జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టింది. దేశంలోని ప్రాజెక్ట్ ల నుంచి పాక్ కు నీటిని నిలిపివేశారు. కొత్తగా ఆరు ప్రాజెక్ట్ లను నిర్మించడానికి సిద్దం అయ్యారు.
యూఎన్ చీఫ్ ఏమన్నారంటే..
చర్చలకు ముందు యూఎన్ చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ.. సైనిక పరిష్కారం కాదని అన్నారు. రెండు దేశాలు గరిష్ట సంయమనం పాటించాలని కోరారు. పహల్గామ్ హత్యలను ఆయన కూడా ఖండించారు. ‘‘పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదు. బాధ్యులను విశ్వసనీయమైన,చట్టబద్దమైన మార్గాల ద్వారా న్యాయం చేయాలి’’ అని ఆయన అన్నారు.


Read More
Next Story