ఇరాన్ పై యుద్ధానికి అమెరికా, ఇజ్రాయెల్ పెట్టిన పేర్లు ఏమిటంటే..
x

ఇరాన్ పై యుద్ధానికి అమెరికా, ఇజ్రాయెల్ పెట్టిన పేర్లు ఏమిటంటే..

ఇరాన్ పాలనను 'ఉగ్రవాద పాలన'గా అభివర్ణిస్తూ, ఆ దేశ పాలకుల మెడలు వంచడం అనే అర్థంలో ఈ పేర్లను ఖరారు చేశారు.


అమెరికా ఇరాన్‌పై చేపట్టిన యుద్ధానికి పెట్టిన పేరు 'ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ' (Operation Epic Fury). ఇజ్రాయెల్ పెట్టుకున్న పేరు 'ఆపరేషన్ రోరింగ్ లయన్. ఈ దాడులకు ప్రతిగా ఇరాన్ 'ఆపరేషన్ ట్రూ ప్రామిస్ IV' పేరుతో ప్రతీకార దాడులు చేపట్టింది. వీటి వెనుక వ్యూహాత్మక ఉద్దేశం, అసలు లక్ష్యాలు ఎలా ఉన్నాయంటే...

ఈ పేరు వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి?
అమెరికా పెట్టిన 'Operation Epic Fury' అంటే 'పిచ్చి కోపం' లేదా 'తీవ్రమైన ప్రతీకారం' అని అర్థం. ఈ పేరు పెట్టడం వెనుక అమెరికా ప్రధానంగా మూడు లక్ష్యాలను కలిగి ఉంది:
ఇరాన్ తన క్షిపణి శక్తితో ప్రపంచాన్ని భయపెట్టాలని చూస్తుంటే, తాము అంతకంటే శక్తివంతమైన 'ఆగ్రహాన్ని' (Fury) ప్రదర్శిస్తామని హెచ్చరించడం.

కేవలం యుద్ధం చేయడమే కాకుండా, ఇరాన్ ఆయుధాలను తయారు చేసే కేంద్రాలను (Production Sites) నేలమట్టం చేయడం.
మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేసి, అమెరికా మిత్రదేశాలకు భద్రత కల్పించడం.
కెల్లీ వివరణలోని కీలక అంశాలు:
అమెరికా ప్రతినిధి కెల్లీ ఈ ఆపరేషన్ గురించి క్లారిటీ ఇస్తూ కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు. 'ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ' ధాటికి ఇరాన్ ప్రతీకార బాలిస్టిక్ క్షిపణి దాడులు 90 శాతం మేర తగ్గాయని ఆమె పేర్కొన్నారు. ఇది అమెరికా సాధించిన అతిపెద్ద రక్షణ విజయంగా అభివర్ణించారు.
ఈ ఆపరేషన్ కేవలం సరిహద్దుల్లో యుద్ధానికే పరిమితం కాలేదని, ఆయుధాలను ప్రయోగించే లేదా ఉత్పత్తి చేసే దేశాల సామర్థ్యాన్ని ఇది అణచివేస్తుందని స్పష్టం చేశారు.
ట్రంప్ పర్యవేక్షణ
అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారని, ఇరాన్ తన పొరుగు దేశాలపై చేస్తున్న దాడులను అరికట్టేందుకు మిత్రదేశాలతో సన్నిహితంగా పనిచేస్తున్నారని తెలిపారు.
ఏమిటి ఈ 'ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ'?
'Epic Fury' అంటే 'పట్టరాని లేని పిచ్చి కోపం' అని అర్థం. ఇరాన్ తన క్షిపణులతో పొరుగు దేశాలను, అమెరికా మిత్రదేశాలను భయపెట్టాలని చూస్తుంటే, దానికి ప్రతిగా అమెరికా తన అపారమైన సైనిక శక్తిని (Fury) ప్రదర్శిస్తోంది.
ఈ పేరును ఎవరు ప్రతిపాదించారు?
అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం అయిన పెంటగాన్ (Pentagon) లోని 'యూఎస్ సెంట్రల్ కమాండ్' (USCENTCOM) ఈ పేరును ప్రతిపాదించింది. మధ్యప్రాచ్యంలో జరిగే సైనిక వ్యవహారాలన్నీ ఈ విభాగం పరిధిలోకి వస్తాయి. ఇరాన్ తన 'ప్రతీకారం' గురించి గొప్పగా చెప్పుకుంటున్న తరుణంలో, అమెరికా అంతకంటే భీకరమైన 'ఆగ్రహాన్ని' (Fury) చూపుతుందని హెచ్చరించడానికి ఈ పేరును ఎంపిక చేశారు.
ఎవరు ఖరారు చేశారు?
ఈ పేరును, దీనికి సంబంధించిన వ్యూహాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఖరారు చేశారు. అమెరికా అధ్యక్షుడే 'కమాండర్-ఇన్-చీఫ్' (అత్యున్నత సర్వసైన్యాధ్యక్షుడు) కాబట్టి, ఇరాన్ వంటి దేశాలపై జరిగే కీలకమైన ఆపరేషన్ పేర్లను వైట్ హౌస్ ఆమోదించాల్సి ఉంటుంది.
పేరు వెనుక ఉన్న 'మెసేజ్':
సాధారణంగా పేర్లు పెట్టేటప్పుడు శత్రువుకు ఒక స్పష్టమైన హెచ్చరిక వెళ్లాలని అమెరికా భావిస్తుంది.
Epic (ఎపిక్): ఇది చిన్నపాటి దాడి కాదు, ఇరాన్ చరిత్రలోనే చూడని భారీ స్థాయి దాడి అని అర్థం.
Fury (ప్యూరీ): ఆయుధాల ఉత్పత్తి కేంద్రాలను, క్షిపణి వ్యవస్థలను పూర్తిగా నాశనం చేసేంత కోపంతో కూడిన చర్య అని అర్థం.
పెంటగాన్ అధికారులు ఈ పేరును సృష్టించగా, అధ్యక్షుడు ట్రంప్ దీనికి ఫైనల్ సీల్ వేశారు. దీని ద్వారా ఇరాన్‌కు "మమ్మల్ని రెచ్చగొడితే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి" అనే సందేశాన్ని ఇచ్చారు.

ఇజ్రాయెల్ 'ఆపరేషన్ రోరింగ్ లయన్'..

ఆపరేషన్ రోరింగ్ లయన్ (ఇజ్రాయెల్ వ్యూహం)
ఇజ్రాయెల్ తన ఉనికిని కాపాడుకోవడానికి ఈ 'ముందస్తు దాడి' (Pre-emptive Strike) చేపట్టింది. ఇజ్రాయెల్ చరిత్రలోనే అతిపెద్ద వాయు విన్యాసం ఇది. దాదాపు 1,600 పైగా సర్వీసులు (Sorties) నిర్వహించి, 4,000 కంటే ఎక్కువ బాంబులను ఇరాన్ సైనిక స్థావరాలపై కురిపించింది.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కాంపౌండ్ పై జరిగిన దాడిలో ఆయన మరణించారు. ఇరాన్ రహస్యంగా నిర్వహిస్తున్న 'మిన్‌జాదేహి' (Min-Zadaei) వంటి అణు పరిశోధనా కేంద్రాలను ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేశాయి.
ఉమ్మడి ఆపరేషన్ ప్రత్యేకతలు
అమెరికా క్షిపణి వ్యవస్థలను, లాజిస్టిక్స్‌ను చూసుకుంటుంటే.. ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్ లోని కీలక వ్యక్తులను, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది.
F-35I అడార్ ఫైటర్ జెట్లు ఇరాన్ రాడార్లకు చిక్కకుండా లోపలికి వెళ్లి దాడులు చేశాయి.
ఇరాన్ ఆపరేషన్ పేరు 'ఆపరేషన్ ట్రూ ప్రామిస్ IV'
ఈ దాడులకు ప్రతిగా ఇరాన్ 'ఆపరేషన్ ట్రూ ప్రామిస్ IV' పేరుతో ప్రతీకార దాడులు చేపట్టింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్ పై క్షిపణులను ప్రయోగించింది. అయితే అమెరికా 'ఎపిక్ ప్యూరీ' ధాటికి వీటి తీవ్రత 90% తగ్గిందని పెంటగాన్ చెప్తోంది.
ఫిబ్రవరి 28, 2026న ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడంతో ఇరాన్ తన ప్రతీకార చర్యలను తీవ్రం చేసింది. గతంలో ఇజ్రాయెల్‌పై జరిగిన దాడుల (True Promise I, II, III) కంటే ఇది మరింత శక్తివంతమైనదని ఇరాన్ ప్రకటించింది.
ఇరాన్ తన రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ద్వారా అనేక దఫాలుగా (Waves) క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాకుండా, అమెరికా సైనిక స్థావరాలు ఉన్న జోర్డాన్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, యూఏఈ, ఇరాక్ వంటి దేశాలపై ఇరాన్ దాడులు చేసింది.
ముఖ్య లక్ష్యాలు..
బహ్రెయిన్‌లోని అమెరికా 5వ ఫ్లీట్ (5th Fleet) ప్రధాన కార్యాలయం. ఖతార్‌లోని అల్ ఉదైద్ (Al Udeid) ఎయిర్ బేస్. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్, హైఫా నగరాల్లోని సైనిక, రక్షణ శాఖ భవనాలు.

ఈ ఆపరేషన్‌లో ఇరాన్ తన అధునాతన 'ఖైబర్' (Kheybar), 'ఖొర్రంషహర్-4' బాలిస్టిక్ క్షిపణులను, అలాగే హైపర్ సోనిక్ క్షిపణులను, 'షాహెద్' డ్రోన్లను వినియోగించింది.
పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో అమెరికా నౌకలపై ఇరాన్ దాడులకు దిగింది. అయితే, అమెరికా సమాధానంగా ఇరాన్ నౌకాదళానికి చెందిన 17 నౌకలను ముంచేసినట్లు ప్రకటించింది.
ఆపరేషన్ ట్రూ ప్రామిస్ IV' అనేది ఇరాన్ తన ఉనికి కోసం చేస్తున్న ఒక చావో రేవో పోరాటం. దీనివల్ల మధ్యప్రాచ్యం అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
Read More
Next Story