
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
ఉషాను మతం మార్చే ఉద్దేశం లేదు: జేడీ వాన్స్
తన భార్య క్రిస్టియన్ కాదన్నా అమెరికా ఉపాధ్యక్షుడు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ మతం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సెకండ్ లేడీగా ఉన్న ఉషా వాన్స్ కు క్రైస్తవ మతంలోకి మారే ఆలోచన లేదని అన్నారు. అయితే ఏదో ఒక రోజు నేను చూసే విధంగా క్రిస్టియానిటినీ చూస్తుందని అన్నారు.
హిందూ కుటుంబంలో పుట్టి, పెరిగిన ఉషా, క్రిస్టియన్ అయిన జేడీ వాన్స్ ను వివాహం చేసుకున్నారు. ‘‘నేను చర్చిలో చేరిన దానితో ఎలా కదిలిపోయానో అదే విధంగా కూడా ఉషా కదిలిపోతుంది’’. ఆయన వ్యాఖ్యలు కన్వర్షన్ గా ఉన్నాయని విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన వెంటనే సోషల్ మీడియాలో వివరణ ఇచ్చుకున్నారు.
తన భార్యకు మతం మారే ఉద్దేశం లేదని, అయితే ప్రతి విషయాన్ని తన భార్యతో చర్చిస్తానని, ప్రజాప్రతినిధి కావడంతో ప్రజలంతా తన వ్యాఖ్యల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
‘‘సువార్త సత్యమని, మానవులకు అది మంచిదని చెబుతుంది. నా భార్య నాకు జీవితంలో లభించిన గొప్ప ఆశీర్వాదం, చాలా సంవత్సరాల క్రితమే తను నన్ను నా విశ్వాసంలో పాల్గొనమని ప్రొత్సహించింది’’ అన్నారు.
‘‘ఆమె(ఉషా) క్రైస్తవురాలు కాదు. మతం మారే ప్రణాళికలు కూడా లేవు. కానీ మతాంతర వివాహాంలో ఉన్న చాలామంది వ్యక్తుల లాగానే మతాంతర సంబంధాలలో నా లాగే తను కూడా ఒకరోజు నాలా నా విశ్వాసాన్ని చూస్తుందని ఆశిస్తున్నాను.
ఏది ఏమైనా నేను ఆమెను ప్రేమిస్తూనే ఉంటాను. మద్దతు ఇస్తాను. విశ్వాసం, జీవితం, మిగతా అంశాలపై నేను ఆమెతో మాట్లాడతాను. ఎందుకంటే తను నా భార్య’’ అన్నారు.
బుధవారం మిస్సిస్సిప్పి విశ్వవిద్యాలయంలో జరిగిన టర్నింగ్ పాయింట్ కార్యక్రమంలో వాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. మతాంతర వివాహం గురించి భారత ఉపఖండానికి చెందిన ఒక మహిళ వాన్స్ ను అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానం చెప్పారు.
‘‘నేను ఆమెకు చెప్పాను. బహిరంగంగా చెప్పాను. పదివేల మంది ఉన్నప్పుడు చెప్తాను. నన్ను కదిలించిన చర్చి ఆమెను కూడా కదిలిస్తుంది. నేను నిజాయితీగా అలా కోరుకున్నాను. ఎందుకంటే నేను క్రైస్తవ సువార్తను నమ్ముతున్నాను. నా భార్య కూడా అదే విధంగా చూస్తుందని నేను ఆశిస్తున్నాను’’ అని అతను చెప్పాడు.
‘‘క్రైస్తవులకు నమ్మకాలు ఉంటాయి. ఆ నమ్మకాలకు అనేక పరిణామాలు ఉంటాయి. వాటిలో ఒకటి మనం వాటిని ఇతరులతో పంచుకోవాలనుకుంటున్నాము. అది పూర్తిగా సాధారణ విషయం. మీకు భిన్నంగా చెప్పే ఎవరికైనా ఒక ఎజెండా ఉంటుంది’’ అని ఆయన అన్నారు.
Next Story

