‘నేను బతికే ఉన్నా.. కావాలంటే నా చేతి వేళ్లు చూడండి..’
x

‘నేను బతికే ఉన్నా.. కావాలంటే నా చేతి వేళ్లు చూడండి..’

సోషల్ మీడియాలో వైరలవుతున్న ఇజ్రాయిల్ అధ్యక్షుడు నెతన్యాహు కాఫీ షాప్ వీడియో..


Click the Play button to hear this message in audio format

ఇరాన్-ఇజ్రాయిల్, అమెరికా దేశాల మధ్య గత కొన్నిరోజులుగా యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే. క్షిపణుల దాడికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు ఆయన ముఖ్య అనుచర గణం ప్రాణాలు కోల్పోయింది. అయితే తమ ప్రతీకార దాడుల్లో ఇజ్రాయిల్ అధ్యక్షుడు నెతన్యాహు కూడా హతమయ్యాడని ఇరాన్ మీడియా పేర్కొంది. ఇజ్రాయిల్ AIతో చేసిన వీడియోలను చూపుతూ తమ దేశ నాయకుడు నెతన్యాహు ఇంకా బతికే ఉన్నాడని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించింది.


వైరల్ వీడియో..

నెతన్యాహు చనిపోయాడని వైరల్ అయిన వీడియోలో ఆయన చేతికి ఆరు వేళ్లు ఉన్నాయి. తనపై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించేందుకు నెతన్యాహు జెరూసలేం కొండ ప్రాంతంలోని ఒక కేఫ్‌లో కాఫీ తాగుతూ మాట్లాడుతున్న వీడియోను తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఆదివారం (మార్చి 15) పోస్టు చేశారు. ఆ వీడియోలో కాఫీ తాగుతూ హీబ్రూ భాషలో సరదాగా “నేను చనిపోయాను.. కాఫీ కోసం” అంటూ నెతన్యాహు తన చేతికి ఉన్న ఐదువేళ్లను చూయించారు.

ఇజ్రాయెల్ ప్రభుత్వ స్పందన..

నెతన్యాహు మరణ వార్తలు కేవలం పుకార్లేనని ఇజ్రాయిల్ ప్రభుత్వం పేర్కొంది. భద్రతా సమావేశాల్లో పాల్గొనడం వల్లే ఆయన కొన్ని కార్యక్రమాలకు హాజరు కాలేకపోయారని తెలిపింది.

పుకార్లకు కారణమైన మరో అంశం..

నెతన్యాహు కుమారుడు యార్ నెతన్యాహు (Yair Netanyahu) సాధారణంగా సోషల్ మీడియాలో తరచూ పోస్టులు చేస్తుంటారు. అయితే మార్చి 9 తర్వాత ఆయన ఎటువంటి పోస్టులు చేయకపోవడం కూడా పుకార్లకు కారణమైంది.

మొత్తంగా నెతన్యాహు సురక్షితంగానే ఉన్నారని ఇజ్రాయెల్ ప్రభుత్వం పేర్కొంది.

Read More
Next Story