
నేపాల్ ఎన్నికల్లో ఆర్ఎస్పీ (RSP) ఘన విజయం..
98 స్థానాల్లో ఆధిక్యం..
నేపాల్‌లో ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఈ పార్టీ 98 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బలేంద్ర షా స్థాపించిన ఆర్ఎస్పీ భారీ విజయాన్ని నమోదు చేసింది. సంప్రదాయ రాజకీయ పార్టీల ఆధిపత్యాన్ని ఓటర్లు తిరస్కరించారు.
సత్సంబంధాల కోసం..
ఈ ఫలితాలను భారత్ నిషితంగా గమనిస్తుంది. ఎందుకంటే నేపాల్‌లో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే, రెండు దేశాల మధ్య అభివృద్ధి, సహకారం కొనసాగుతుందని భారత్ ఆశిస్తోంది. కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో కలిసి పనిచేసి, ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలను ఏర్పర్చుకోవాలని భారత ప్రభుత్వ యోచన.
ప్రధాన పార్టీల ఫలితాలు..
నేపాలీ కాంగ్రెస్: 4 స్థానాలు గెలిచి, 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
CPN-UML: 1 స్థానం గెలిచి, 1 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
నేపాల్ కమ్యూనిస్టు పార్టీ: 2 స్థానాలు గెలిచి, 10 స్థానాల్లో ముందంజలో ఉంది. శ్రామ్ సంస్కృతి పార్టీ: ప్రస్తుతం 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
నేపాల్ పార్లమెంట్..
నేపాల్ పార్లమెంట్‌లో మొత్తం 275 సభ్యులు ఉంటారు. వీటిలో 165 సభ్యులు నేరుగా ప్రజల ఓట్ల ద్వారా ఎన్నికవుతారు, 110 సభ్యులు ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నికవుతారు. ఈ ఎన్నికల్లో 1.89 కోట్ల మంది ఓటర్లు పాల్గొని, 60% ఓటు వేసారు.
యువత నిరసనలు..
గత సంవత్సరం సెప్టెంబర్ 8,9 తేదీల్లో, యువత తీవ్ర నిరసనల కారణంగా అప్పటి ప్రధాని ఓలి ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తరువాత అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ పార్లమెంట్‌ను రద్దు చేసి, సుశీల కార్కిని తాత్కాలిక ప్రధానిగా నియమించారు.
ప్రధాన సమస్యలు..
నేపాల్‌లో అవినీతి పెరిగిపోతున్నదని, యువత ఆందోళన వ్యక్తం చేసింది. సుపరిపాలన కోరుకున్న యువత.. బంధుప్రీతికి ముగింపు పలకాలని, రాజకీయ నాయకత్వంలో మార్పులు రావాలని కోరుకుంది.

