బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడంటే..
x

బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడంటే..

డిసెంబర్ 2025 జూన్ 2026 మధ్య జరుగుతాయని స్పష్టం చేసిన బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్


దేశంలో వీలైనంత త్వరగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని బంగ్లాదేశ్(Bangladesh) తాత్కాలిక ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో.. ఆ దేశ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్(Muhammad Yunus) స్పష్టమైన ప్రకటన చేశారు. డిసెంబర్ 2025 - జూన్ 2026 మధ్య ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) భారీ నిరసన ర్యాలీలు చేపట్టిన తర్వాతి రోజు యూనస్ ఈ విషయం చెప్పారు. తాను టోక్యో పర్యటనకు బయల్దేరుతున్నానని, బంగ్లాదేశ్‌లో ఎన్నికైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాను తన మునుపటి పనికి తిరిగి వస్తానని కూడా చెప్పారు.

బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న ఒత్తిడి, ప్రజల అసంతృప్తి, ఎన్నికల సంస్కరణలపై ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం తేలేకపోవడంతో యూనస్ రాజీనామా చేయడానికి ఆసక్తి చూపుతున్నారన్న వార్తలొచ్చాయి. వీటిని ఖండిస్తూ బంగ్లాదేశ్ ప్రణాళిక సలహాదారు వహీదుద్దీన్ మహమూద్ గత వారం క్లారిటీ ఇచ్చారు. యూనస్ రాజీనామా గురించి ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పారు.

Read More
Next Story