పీఎన్బీ బ్యాంకును మోసం చేసిన ‘మెహుల్ చోక్సి’ అరెస్ట్
x
మెహుల్ చోక్సి

పీఎన్బీ బ్యాంకును మోసం చేసిన ‘మెహుల్ చోక్సి’ అరెస్ట్

భారత్ విజ్ఞప్తి మేరకు అదుపులోకి తీసుకున్న బెల్జియం పోలీసులు


పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ. 13 వేల కోట్ల రుణం తీసుకుని మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సిని బెల్జియంలో భారత దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

ఈ వజ్రాల వ్యాపారి నకిలీ పత్రాలతో పీఎన్బీ బ్యాంకును మోసం చేశాడు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నట్లు సమాచారం. చోక్సి వయస్సు ప్రస్తుతం 65 సంవత్సరాలు.

చోక్సి కోసం ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీస్ తొలగించిన తరువాత భారత ఏజెన్సీలు, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అతడిని బెల్జియం నుంచి అప్పగించాలని కోరినట్లు వర్గాలు తెలిపాయి.
2018-2021 ముంబైలోని ఒక కోర్టు మెహుల్ చోక్సిపై జారీ చేసిన రెండు ఓపెన్ ఎండ్ అరెస్ట్ వారెంట్లను పోలీసులు అతడిని అరెస్ట్ చేస్తున్నప్పుడూ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం చోక్సికి బెల్జియం లో నివాసం ఉండటానికి అవసరమైన కార్డు మంజూరు అయింది. 2023 లో నవంబర్ లో దేశంలో ఉండటానికి రెసిడెన్సీ కార్డు పొందిన తరువాత బెల్జియం పౌరురాలు అయిన తన భార్య ప్రితీతో కలిసి బెల్జియంలోని ఆంట్వెర్ప్ లో నివసిస్తున్నట్లు సమాచారం.
కరేబియన్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. చోక్సి భారతదేశానికి అప్పగించకుండా ఉండటానికి అలాగే, నివాస కార్డులు పొందడానికి బెల్జియం అధికారులకు తప్పుడు సమాచారం, పత్రాలు అందించారు.
చోక్సిని భారత్ కు అప్పగించే ప్రక్రియను ప్రారంభించాలని భారత అధికారులు బెల్జియం ప్రభుత్వాన్ని అభ్యర్థించారని అసోసియేటెడ్ టైమ్స్ మార్చిలోనే కథనాలు ప్రసారం చేసింది.
బ్యాంకులను మోసం చేసిన తరువాత చోక్సి వెస్టీండీస్ లోని ఒక ద్వీప దేశమైన ఆంటిగ్వా, బార్బుడా పౌరసత్వం పొందాడు. క్యాన్సర్ చికిత్స కోసం తరువాత డొమెనికన్ రిపబ్లిక్ కు వెళ్లాడు.
2018 లో కేసు నమోదు..
ముంబైలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాడీ హౌజ్ బ్రాంచ్ లో రుణ మోసానికి పాల్పడినందుకు చోక్సి, ఆయన మేనల్లుడు నీరవ్ మోదీపై కేసు నమోదు అయింది. ఈ కేసులో వారి కుటుంబ సభ్యులు, ఉద్యోగులు, బ్యాంకు అధికారులు, ఇంకా కొంతమంది వ్యక్తులపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కుంభకోణం వెలుగులోకి రావడానికి కంటే ముందు మెహుల్ చోక్సి, నీరవ్ మోదీ ఇద్దరు దేశం విడిచి పరారయ్యారు.
చోక్సి కి చెందిన ‘గీతాంజలి జెమ్స్’ కేంద్రంగా ఈ మోసానికి పాల్పడ్డారు. కొంతమంది బ్యాంకు అధికారులతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేయడానికి అండర్ టేకింగ్ లెటర్లు( ఎల్ ఓయూలు) జారీ చేసి బ్యాంకు నుంచి విదేశీ క్రెడిట్ లెటర్లు(ఫెరోయిన్ లెటర్ ఆఫ్ క్రెడిట్) జారీ చేశారని బ్యాంకుకు వేల కోట్ల నష్టం కలిగించారని ఈడీ ఆరోపించింది.
ఇప్పటి వరకూ ఈ కేసులో మూడు చార్జీషీట్లు దాఖలు చేయగా, సీబీఐ కూడా మరో చార్జీషీట్ దాఖలు చేసింది. ప్రస్తుతం చోక్సి నుంచి 2,565 కోట్లు విలువైన ఆస్తులను ఆధీనంలోకి తీసుకుని విక్రయించామని డిసెంబర్ 2024 లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ కు తెలియజేశారు.
చోక్సిని భారత్ కు తీసుకువస్తే ప్రభుత్వం సాధించిన రెండో అతిపెద్ద విజయం అవుతుంది. ఇంతకుముందు రెండు రోజుల క్రితమే ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి తహవ్వుర్ రాణాను అమెరికా నుంచి భారత్ కు రప్పించిన సంగతి తెలిసిందే.
అయితే పీఎన్బీ కేసులో ప్రధాన నిందితుడు అయిన నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ లో ఉన్నాడు. అలాగే మరో ఆర్థిక నేరగాడు అయిన విజయ్ మాల్యా సైతం లండన్ లోనే ఆశ్రయం పొందుతున్నాడు. వీరిద్దరు తమకు భారత్ కు అప్పగించడానికి వీలులేదని అక్కడి కోర్టులో పిటిషన్ లు దాఖలు చేసి రక్షణ పొందుతున్నారు.


Read More
Next Story