
భూకంపం కారణంగా రష్యాలో దెబ్బతిన్న ఇల్లు
రష్యాలో భారీ భూకంపం, ఉత్తర పసిఫిక్ లో సునామీ
ఉత్తర పసిఫిక్ లో 8.8 తీవ్రతో భారీ భూకంపం, న్యూజిలాండ్, ఫిలిఫ్పీన్స్, న్యూజిలాండ్, అమెరికాకు సునామీ హెచ్చరికలు
ఈ రోజు తెల్లవారుజామున రష్యాలోని ఫార్ ఈస్ట్ లో బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 8.8 తీవ్రత గా నమోదు అయింది. ఈ భూకంపం ఉత్తర పసిఫిక్ లో లో తీవ్రమైన సునామీకి దారితీసింది.
అలస్కా, హవాయి, న్యూజిలాండ్ లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అనేక ప్రదేశాల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. హవాయి రాజధాని అయిన హోనలూలో కార్లు అన్నీ ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి.
ప్రజలంతా ఎత్తైన ప్రదేశాలకు చేరుకోవాలని హెచ్చరిస్తూ సైరన్లు మోగాయి. హవాయి లోని పాఠశాలలు, ఆఫీస్ లు తమ కార్యకలాపాలను రద్దు చేశాయి.
ఉత్తర జపాన్ లోని ఇషినోమాకి ఓడరేవు వద్ద 1.6 అడుగుల ఎత్తులో సునామీ సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. ఉత్తర జపాన్ చుట్టూ ఉన్న ప్రదేశాలలో ఇప్పటి వరకూ ఎక్కువ ఎత్తులో వచ్చిన అల ఇదేననీ జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.
కమ్చట్కా ద్వీపకల్పంలో భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్న రష్యన్ ప్రాంతాలు అక్కడ జరిగిన నష్టం, ప్రజల తరలింపులను వార్తలు ప్రసారం చేశాయి. ఎక్కడ ప్రాణ నష్టం సంభవించినట్లు తెలియరాలేదు.
హవాయి, ఒరెగాన్ ప్రాంతాల హెచ్చరిక..
భూకంపం కారణంగా సునామీ ఏర్పడిందని, ఇది హవాయి దీవుల తీర ప్రాంతాల్లో నష్టాన్ని కలిగించవచ్చని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ‘‘ప్రాణాలను, ఆస్తులను కాపాడటానికి తక్షణ చర్యలు తీసుకోవాలి’’ అని హెచ్చరికలో పేర్కొన్నారు.
ఒరెగాన్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ అధికారి ఫేస్ బుక్ లో మాట్లాడుతూ.. స్థానిక ప్రకారం.. రాత్రి 11.40 గంటల ప్రాంతంలో తీరం వెంబడి చిన్న సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని, అలల ఎత్తు 1 నుంచి 2 అడుగుల ఎత్తు మధ్య ఉంటుందని తెలిపింది. ప్రజలు బీచ్ లకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
‘‘ఇది పెద్ద సునామీ కాదు. కానీ ప్రమాదకరమైన ప్రవాహాలు, బలమైన అలలు నీటికి దగ్గరగా ఉన్న వారికి ప్రమాదాన్ని కలిగిస్తాయి’’ అని విభాగం తెలిపింది.
రష్యాలో భూకంపం..
జపాన్ కాలమానం ప్రకారం ఉదయం 8.25 గంటలకు సంభవించిన భూకంపం కారణంగా 8.0 తీవ్రతతో నమోదైందని జపాన్, అమెరికా భూకంప శాస్త్రవేత్తలు తెలిపారు. తరువాత అమెరికా జియోలాజికల్ సర్వే దాని తీవ్రతను 8.8 గా అప్ డేట్ చేసింది. 20.7 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని యూఎస్జీఎస్ తెలిపింది.
ఈ భూకంపం రష్యాలోని పెట్రో పావ్లోన్స్క్ - కామ్ చాట్స్కీ నగరానికి తూర్పు- ఆగ్నేయంగా 119 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ నగరంలో 18 వేల మంది నివసిస్తున్నారు. రష్యాలోని కురిల్ దీవులను తొలి సునామీ అల తాకిందని గవర్నర్ వాలెరీ లిమారెంకో తెలిపారు.
ప్రపంచంలోనే అతి శక్తివంతమైన భూకంపాలలో ఒకటి..
మార్చి 2011 లో ఈశాన్య జపాన్ లో సంభవించిన 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపం తరువాత ప్రపంచంలోనే అత్యంత బలమైన భూకంపం ఇదేనని తెలుస్తోంది. ఈ భూకంపం అణు విద్యుత్ కేంద్రంలో భారీ సునామీని సృష్టించింది. సునామీ హెచ్చరిక కారణంగా జపాన్ రవాణాకు అంతరాయం కలిగింది.
జపాన్ లోని హోన్షు ద్వీపం ఉత్తర చివరలోని హెక్కైడ్, అమెరిలను కలిపే పడవలను నిలిపివేశారు. కొన్ని రైళ్ల కార్యకలాపాలను సైతం రద్దు చేశారు. సెండాయ్ విమానాశ్రయం తాత్కాలికంగా దాని రన్ వేను మూసివేసింది.
జపాన్ లో ఎవరికి..
జపాన్ అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సంస్థ ఇప్పటి వరకూ ఎటువంటి గాయాలు లేదా నష్టాలు సంభవించలేదని తెలిపింది. సునామీ హెచ్చరికలు వచ్చిన వెంటనే హక్కైడో నుంచి ఒకినావా వరకూ 133 మునిసిపాలిటీలోని 9 లక్షల కంటే ఎక్కువ మంది నివాసితులకు ఆ సంస్థ ఖాళీ చేయమని ఆదేశించింది. జపాన్ అణు విద్యుత్ ప్లాంట్లు అన్ని సురక్షితంగా ఉన్నాయని ఎత్తైన ప్రదేశాలలో 4 వేల కార్మికుల ఆశ్రయం పొందుతున్నారని అధికారులు తెలిపారు.
ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్ కు హెచ్చరికలు..
ఫిలిప్పీన్స్ దేశం పసిఫిక్ మహా సముద్రంలో ఉండటంతో ఇక్కడ దాదాపు ఒక మీటర్ కంటే ఎక్కువ స్థాయిలో సునామీ అలలు వస్తాయని అధికారులు హెచ్చరించారు. ‘‘అతిపెద్ద అలలు రాకపోవచ్చు. కానీ నీటికి దగ్గరగా ఉన్న వారికి ప్రమాదం కలిగిస్తాయి.’’ అని ఫిలిప్పీన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్ని పర్వత శాస్త్రం, భూకంప శాస్త్రానికి చెందిన టెరెసిటో బాకో ల్కోల్ అసోసియేట్ ప్రెస్ తో అన్నారు. న్యూజిలాండ్ లో కు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇది భూకంప కేంద్రం నుంచి ఈ దేశం 9,600 కిలోమీటర్ల దూరంలో ఉంది.
1952 తరువాత కమ్చట్కాలో బలమైన భూకంపం..
రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్స్ జియోఫిజికల్ సర్వే స్థానిక శాఖ ప్రకారం.. 1952 తరువాత కమ్చట్కా ద్వీపకల్పంలో సంభవించిన భూకంపం ఇదే. పరిస్థితి ఇప్పటికి బాగానే ఉన్నప్పటికీ నెల రోజుల వరకూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
జూలై ప్రారంభంలోనే కమ్చట్కా సమీపంలోని సముద్రంలో ఐదు శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. వాటిలో అతిపెద్దది 7.4 తీవ్రతతో సంభవించింది.
నవంబర్ 4, 1952 లో కమ్చట్కాలో 9.0 తీవ్రతతో భారీ భూకంపం సంభవించి భారీ నష్టాన్ని కలిగించింది. ఈ భూకంపం కారణంగా హావాయిలో 9.1 మీటర్ల ఎత్తుతో సునామీ అలలు ఎగసిపడ్డాయి. కానీ జనసాంద్రత తక్కువ కారణంగా ఎటువంటి మరణాలు సంభవించలేదు.
Next Story