న్యూయార్క్: బైబిల్ పై కాకుండా ఖురాన్ పై ప్రమాణం చేసిన మమ్ధానీ
x
ప్రమాణ స్వీకారం చేస్తున్న మమ్ధానీ

న్యూయార్క్: బైబిల్ పై కాకుండా ఖురాన్ పై ప్రమాణం చేసిన మమ్ధానీ

న్యూయార్క్ తొలి ముస్లిం మేయర్ గా బాధ్యతల స్వీకరణ


న్యూయార్క్ మేయర్ గా గురువారం అర్థరాత్రి దాటిన తరువాత జోహ్రాన్ మమ్ధాని ప్రమాణ స్వీకారం చేశారు. మాన్ హట్టన్ లోని చారిత్రాత్మకమైన, మూసివేసిన సబ్ వే స్టేషన్ లో ఆయన ఈ కార్యక్రమం నిర్వహించారు.

అమెరికాలోని అతిపెద్ద నగరానికి తొలి ముస్లిం నాయకుడిగా డెమోక్రాట్ పార్టీ తరఫున గెలిచిన మమ్ధాని ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అమెరికా సంప్రదాయం ప్రకారం బైబిల్ పై చేయాల్సిన ప్రమాణ స్వీకారం ఆయన ఖురాన్ మీద చేయి ఉంచి చేశారు. ఇది జీవితకాలంలో లభించే అరుదైన గౌరవం, ప్రత్యేకత అని మమ్ధానీ అన్నారు.

రాజకీయ మిత్రుడు, అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ నిర్వహించిన ఈ వేడుక అద్భుతమైన పైకప్పులకు ప్రసిద్ధి చెందిన నగరంలో సబ్ వేలో ఒకటైన పాత సిటీ హల్ స్టేషన్ లో జరిగింది. అమెరికా మీడియా ప్రకారం.. మమ్దాని శతాబ్ధాల కాలం నాటి ఖురాన్ పై ప్రమాణ స్వీకారం చేశారు.
న్యూయార్క్ నగర మేయర్ ప్రమాణ స్వీకారం చేయడానికి మొదటిసారి ఇస్లాం పవిత్ర గ్రంథాన్ని ఆయన ఉపయోగించారు. 34 ఏళ్ల డెమోక్రాట్ ఆ పదవిని చేపట్టిన మొదటి ముస్లిం, మొదటి దక్షిణాసియా,మొదటి ఆఫ్రికాలో జన్మించిన వ్యక్తి. మమ్థాని కంటే ముందు న్యూయార్క్ మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసిన వారంతా బైబిల్ మీద ప్రమాణ స్వీకారం చేశారు.
తన ప్రచారంలో ఆర్థిక స్థోమత సమస్యపై ఎక్కువగా దృష్టి సారించినప్పటికీ బహిరంగంగా ముస్లిం విశ్వాసాలపై మాట్లాడేవాడు. దక్షిణాసియా, ముస్లిం ఓటర్లలో మొదటిసారిగా వచ్చిన అనేక మందితో తరుచుగా అతను మసీద్ లలో కనిపించేవాడు.
మమ్ధాని ఉపయోగించిన ఖురాన్..
సబ్ వే వేడుకలో మమ్ధానీ తన చేతిని రెండు ఖురాన్ లపై ఉంచినట్లు తెలుస్తోంది. ఒక ఖురాన్ 18 లేదా 19 శతాబ్ధపు చెందిన పాకెట్ సైజుది, ఇది న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీలోని స్కోంబర్గ్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ బ్లాక్ కల్చర్ లో ఓ భాగం. ఈ ఖురాన్ కాపీ నగర ముస్లింలు వైవిధ్యం, పరిధిని సూచిస్తుందని మిడిల్ ఈస్టర్న్, ఇస్లామిక్ స్టడీస్ కోసం లైబ్రరీ క్యూరేటర్ హిబా అబిద్ చెప్పినట్లు అమెరికా మీడియా పేర్కొంది.
తదుపరి సిటీ హాల్ లో జరిగే ప్రమాణస్వీకారానికి మమ్ధానీ తన తాత, అమ్మమ్మ ఖురాన్ లను ఉపయోగిస్తారు. ఎన్నికల ప్రచారంలో తన మతం గురించి మాట్లాడిన ఆయన.. నేను గర్వంగా పాటించే విశ్వాసాన్ని నేను మార్చుకోను అని ప్రకటించాడు.
ప్రమాణ స్వీకారంలో ఖురాన్ చేయాలనే నిర్ణయాన్ని అమెరికా సంప్రదాయవాదులు విమర్శలు గుప్పించారు. మమ్ధాని ప్రమాణ స్వీకారం గురించి గురించి యూఎస్ సెనెటర్ టామీ ట్యూబర్ విల్లే సోషల్ మీడియాలో శత్రువు ద్వారాల లోపల ఉన్నాడని రాసుకొచ్చాడు.
ఇంతకుముందు కీత్ ఎల్లిసన్ కూడా సెనెట్ కు ఎన్నికయియనప్పుడూ తన ప్రమాణ స్వీకారానికి ఖురాన్ ఉపయోగించినప్పుడూ సంప్రదాయవాదుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు.


Read More
Next Story