యుద్ధం తరువాత తొలిసారి కనిపించిన ఖమేనీ
x
ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ

యుద్ధం తరువాత తొలిసారి కనిపించిన ఖమేనీ

మొహార్రం సంతాప దినాల సందర్భంగా ప్రజలకు అభివాదం చేసిన ఇరాన్ సుప్రీం లీడర్


ఇరాన్ సుప్రీం లీడర్, షియాల ఆధ్యాత్మిక మత గురువు అయతుల్లా అలీ ఖమేనీ బహిరంగంగా కనిపించారు. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య 12 రోజుల యుద్ధం సమయంలో ఆయన రహస్య ప్రదేశంలో ఉన్న బంకర్ లోకి వెళ్లినట్లు సమాచారం. ఇరాన్ కు సంబంధించిన అన్ని కీలక నిర్ణయాలను ఆయనే తీసుకుంటారు. యుద్దం ప్రారంభం కాగానే ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్లారు.

షియాలకు పవిత్రమైన మొహర్రం సంతాప దినాల సందర్భంగా ఆయన కనిపించారు. అషౌరా సంతాప కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇరాన్ స్టేట్ టీవీలో ఖమేనీ కూర్చుని తన మద్దతుదారులకు చేయి ఊపుతూ కనిపించారు.
మరణించిన వందలాది మంది..
ఇజ్రాయెల్ తో జరిగిన యుద్ధంలో దాదాపుగా 900 మంది మరణించారని ఇరాన్ అధికారికంగా అంగీకరించింది. వేలాది మంది ప్రజలు గాయపడ్డారని, భారీ స్థాయిలో ఆస్థి నష్టం సంభవించినట్లు తెలిపింది. చనిపోయిన వారిలో అత్యధికులు సైనిక జనరల్లు ఉన్నారు.
వీరిలో కీలకమైన ఖుద్ ఫోర్స్ కు చెందిన నాయకులే ఉన్నారు. ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో వీరంత హతం అయ్యారు. అంతే కాకుండా అణు శాస్త్రవేత్తలను హత్య చేసింది. దాని రక్షణ వ్యవస్థను నాశనం చేశారు. ఈ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ 550 కి పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో 28 మంది యూదులు మరణించారు.
అంతేకాకుండా అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసింది. అమెరికా ఇస్ఫహాన్, ఫోర్డో, నతాంజ్ లోకి అణు కేంద్రాలపై దాడులు చేసిన తరువాత టెహ్రన్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ అణు పరీశీలన సంఘానికి తన అణు కేంద్రాలలోకి ప్రవేశాన్ని నిరాకరించింది.
మత కార్యక్రమాలు..
రాజధాని టెహ్రాన్ లోని ఆయన కార్యాలయం, నివాసం పక్కన ఉన్న మసీద్ లో 7 శతాబ్ధంలో ప్రవక్త మహ్మద్ మనవడు హుస్సేన్ బలిదానం జ్ఞాపకార్థం ఆయన ఒక కార్యక్రమం నిర్వహించారు. దీనికి పార్లమెంట్ స్పీకర్, ఇతర నాయకులు హజరయ్యారు. ఇది భారీ భద్రత మధ్య నిర్వహించారు.
ప్రపంచంలో 180 కోట్ల ముస్లింలు ఉన్నారు. ఇందులో షియా ముస్లింలు పది శాతం దాకా ఉంటారు. వీరికి హుస్సేన్ ను మహ్మద్ ప్రవక్త నిజమైన వారసుడిగా భావిస్తారు. బాగ్థాద్ కు దక్షిణంగా ఉన్న కర్బాల మైదానంలో సున్నీలతో జరిగిన యుద్దంలో హుస్సేన్ మరణించారు.
ఇది ఇస్లాంలో చీలికను సృష్టించింది. షియాల గుర్తింపులో మొహర్రం కీలకపాత్ర పోషిస్తుంది. షియాలు ఎక్కువగా నివసించే ఇరాన్ లో ఎర్రజెండాలు హుస్సేన్ రక్తాన్ని, నల్లటి అంత్యక్రియల గుడారాలు, బట్టల శోకాన్ని సూచిస్తాయి.
షియాలు ఛాతీ కొట్టుకుంటూ తమను తాము గాయపరుచుకుంటూ ఊరేగింపులు చేసుకుంటారు. కొందరు తీవ్ర దు:ఖంతో ఉండగా వారిపై మతాధికారులు నీల్లు చల్లారు.
ఇరాన్ లో అధికారిక మార్పిడి చేస్తామని ఇజ్రాయెల్ బలంగా ప్రయత్నించినప్పటికీ చివరకు యుద్ధం విరామం ప్రకటించింది. ఇరాన్ అణు కార్యక్రమం చాలా కాలం వెనక్కి నెట్టామని ప్రకటించింది.


Read More
Next Story