
ఇరాన్ గాంధీ ఆస్పత్రిపై ఇజ్రాయిల్ దాడి, ఆస్పత్రి ధ్వంసం
రోగుల హాహాకారాలు, ఆస్పత్రి నుంచి పేషెంట్ల తరలింపు
Live Updates
- 2 March 2026 1:10 PM IST
ఇజ్రాయెల్ దాడుల్లో 31 మంది మృతి
ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ లెబనాన్‌పై జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 31 మంది మరణించినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ కలిసి వైమానిక దాడుల నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ దాడుల్లో మరో 149 మంది గాయపడినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు కువైట్‌లో కొనసాగుతున్న దాడుల నేపథ్యంలో అక్కడున్న అమెరికన్లు వెంటనే ఆశ్రయం తీసుకుని ఇండ్లలోనే ఉండాలని అమెరికా అత్యవసర హెచ్చరిక జారీ చేసింది.
- 2 March 2026 1:04 PM IST
ఖమేనీ పోయినా దిగిరాని ఇరాన్: ఇరాన్ మత నేత ఖమేనీ హత్య తర్వాత అమెరికా అనుకున్నట్లు ఇరాన్ లొంగిరాలేదు. బతికి ఉన్న ఉన్నతస్థాయి నాయకులంతా విబేధాలు మర్చిపోయి చేతులు కలపి ధిక్కార వినిపిస్తున్నారు. అమెరికా పై దాడులు సాగుతాయని ప్రకటిస్తున్నారు. మధ్య ప్రాచ్యంలోని అమెరికా మిత్ర దేశాలపై క్షిపణులను ప్రయోగిస్తూ నే ఉన్నారు. దీనితోో టెహరాన్ మీద అమెరికా బాంబుల వర్షం కురుస్తూనే ఉంది. కొత్త పాలక వర్గం పనిలోకి దూకుతుందని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజస్కియాన్ ప్రకటించారు.
- 2 March 2026 12:53 PM IST
అమెరికా సైనిక విమానం కూలిపోయింది: కొద్ది సేపటి కిందట కువైట్‌లోని అల్ జహ్రా సమీపంలో అమెరకి వైమానిక దళ F-15E స్ట్రైక్ ఈగిల్ కూలిపోయింది, ఆన్ లైన్ వీడియో ఫుటేజ్ ప్రకారం పైలట్ తో మరొక మిలిటరీ అధికారి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదానికి కారణం, యాంత్రిక లోపం లేదా ఎవరైనా దీనిని కూల్చేశారా అనేది ఇంకా తెలియదు. ఈ సంఘటనకు సంబంధించి అమెరికా లేదా కువైట్ అధికారులు ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
- 2 March 2026 12:46 PM IST
• వాషింగ్టన్‌తో అణు చర్చల ప్రతిపాదన చేయలేదు: శాంతి చర్చలు ప్రారంభించడానికి తాను ప్రయత్నం చేసినట్లు అమెరికా మీడియా లో వచ్చిన వార్తలను ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజాని ఖండించారు.
• లెబనాన్ లోని హిజ్బుల్లా మిలిషియా మీద ఇజ్రేల్ యుద్ధం ప్రకటించింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇప్పటివరకు కనీసం 31 మంది మరణించగా, 149 మంది గాయపడ్డారని లెబనీస్ అధికారులు చెబుతున్నారు. ఇరాన్ కు మద్దతుగా హిజ్బుల్లా ఇజ్రేల్ మీద క్షిపణులను ప్రయోగిస్తున్నది.
• హిబ్జుల్లా మిలిషియా ఉత్తర ఇజ్రేల మీద క్షిపణులతో దాడులు చేస్తున్నది. ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఈ దాడులు ప్రారంభించింది. హిజ్బుల్లాకు ఇరాన్ ఇంతవరకు అండగా ఉండింది.
- 2 March 2026 12:29 PM IST
ట్రంపు యుద్ధం అమెరికా న్యాయ సమ్మతమేనా: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ మీద చేస్తున్న యుద్ధానికి అమెరికా పార్లమెంటు ఆమోదం లేదని, అది రాజ్యాంగ సూత్రాలను వ్యతిరేకం అని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వ్యాఖ్యానించింది.

