
చిరాగ్ పాశ్వాన్
బీహార్ ఎన్డీఏ కూటమిలో లుకలుకలకు కారణం చిరాగేనా?
40 సీట్లు డిమాండ్లు చేస్తున్న ఎల్జేపీ ఆర్వీ
ఉబెర్ నక్షాబందీ
కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్ పాశ్వాన్) లేదా ఎల్జేపీ - ఆర్వీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తనను తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విశ్వాసం గల హనుమంతుడిగా చాలాసార్లు ప్రకటించుకున్నారు.
కానీ రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్న రాజకీయ ఎత్తుగడ రాష్ట్రంలోని అధికార నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్(ఎన్డీఏ) సంకీర్ణంలోని ఆయన మిత్రులను, బీజేపీలను కూడా ఇబ్బందుల్లోకి నెట్టేసే అవకాశం కనిపిస్తోంది.
గత ఏడాది లోక్ సభ ఎన్నికల్లో తన పార్టీ రాష్ట్రంలో పోటీ చేసిన ఐదు స్థానాలను చిరాగ్ పార్టీ గెలుచుకుంది. తన పార్టీకి వందశాతం స్ట్రయిక్ రేట్ ఉన్నందున వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీకి కనీసం 40 సీట్లు కేటాయించాలని బలంగా డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో పోటీ చేస్తా...
చిరాగ్ పాశ్వాన్ గత నెల రోజుల నుంచి బీహార్ లో నవ సంకల్ప్ పేరిట ర్యాలీలు తీస్తూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తనకు ఆసక్తి ఉన్నట్లు వెల్లడిస్తున్నారు. జాతీయ రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల్లోకి మారడానికి ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
ఎల్జేపీ- ఆర్వీకి ఎక్కువ సీట్లు కేటాయించాలని చిరాగ్ పట్టుబట్టడం, అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలనే తన కోరిక బయటపెట్టడం అనేవి జేడీ(యూ) ను ఎన్నికలకు ముందు బ్రేక్ వేయడానికి బీజేపీ వేసిన ఒక ఎత్తుగడగా భావిస్తున్నారు.
అయితే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం బరిలో ఉన్న కొన్ని స్థానాలు కూడా ఎల్జేపీ- ఆర్వీ కూడా క్లెయిమ్ చేసుకోవడంతో అభిప్రాయాలు క్రమంగా మారుతున్నట్లు ఎన్డీఏ వర్గాలు ‘ది ఫెడరల్’ కు తెలిపాయి.
ఎన్డీఏ మిత్రపక్షాలపై చిరాగ్..
2020 అసెంబ్లీ ఎన్నికలలో బీహార్ తో ఎన్డీఏ సంబంధాలు తెంచుకుని, జేడీ(యూ) ను దెబ్బ కొట్టడానికి అన్ని స్థానాల్లో పోటీకి దిగాడు. అలాగే లోక్ సభ ఎన్నికలో కూడా మెజారిటీ స్థానాల్లో బరిలోకి దిగాడు.
తన అభ్యర్థులను పోటీ నుంచి తప్పించడానికి నిరాకరించాడు. ఇది బీజేపీలోని ఒక వర్గం ప్రజలతో పాటు కేంద్రమంత్రి, హిందూస్థానీ అవామ్ మోర్చా లేదా హెచ్ఏఎంఎస్ చీఫ్ జితన్ రామ్ మాంఘీని కూడా కలవరపెట్టింది.
బీజేపీ, జేడీయూ ఎల్జేపీ, హెచ్ఎఎంఎస్, ఉపేంద్ర కుష్వాహా రాష్ట్రీయ లోక్ మోర్చా మధ్య సీట్ల పంపకాల ఒప్పందాన్ని పాలక సంకీర్ణం ఖరారు చేయడంలో జాప్యం జరగడానికి చిరాగ్ చేస్తున్న కఠినమైన బేరాసారాలే కారణమని ఎన్డీఏ వర్గాలు చెబుతున్నాయి.
కూటమి మధ్య ఉన్న ప్రతిష్టంభన తొలగించడానికి కూటమి భాగస్వాముల సమావేశం సెప్టెంబర్ 28న జరగబోతోంది. ఈ లోగా ఆమోదయోగ్యమైన మధ్యస్థాన్ని కనుగొనడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు వెల్లడించారు.
జేడీ(యూ) డిమాండ్..
బీజేపీ స్థాయిలో కాకపోయినా, అన్ని సీట్లు ఎక్కువగా పోటీ చేయాలని జేడీ(యూ) పట్టుబట్టడం పాలక సంకీర్ణానికి మరో ముఖ్యమైన అడ్డంకిగా మారింది’’ అని తెలిసింది. ముఖ్యమంత్రి పదవిని చేపట్టకపోయినా బీహార్ అసెంబ్లీలో తన శాసన సభ బలం ప్రకారం కూటమిలో సీనియర్ భాగస్వామిగా ఉన్న జేడీ(యూ) ఈ ఎన్నికల్లో పోటీ చేయనుంది.
బీజేపీ- జేడీ(యూ) చెరో వంద సీట్లలో పోటీ చేయడానికి ‘విస్తృతంగా అంగీకరించాయి’’ మిగిలిన 43 సీట్లను ఎల్జేపీ- ఆర్వీ హెచ్ఎఎంఎస్, ఆర్ఎల్ఎమ్ మధ్య పంచబడాలి.
చిన్న మిత్రులు కూడా గౌరవనీయమైన..
చిరాగ్ వైఖరి అందరిని కలవరపెడుతోంది. అంతేకాకుండా మాంఝీ, కుష్వాహా కూడా ఇప్పుడు తమ పార్టీలకు సీపీలో గౌరవప్రదమైన వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. చిరాగ్ కు 40 సీట్లు కేటాయిస్తే తనకు కనీసం 10 సీట్లు కూడా కేటాయించకపోవడంపై మాంఝీ కూడా అసంతృప్తితో ఉన్నట్లు హెచ్ఏఎంఎస్ వర్గాలు తెలిపాయి.
‘‘2020 లో కూటమిలో భాగంగా మేము ఏడు సీట్లలో పోటీ చేయడానికి అంగీకరించాము. వాటిలో నాలుగు సీట్లు గెలిచాము. గత ఐదు సంవత్సరాలలో మా బలం పెరిగింది.
మాంఝీ కూడా జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అది జరగాలంటే పార్టీ మొదట బీహార్ లో విస్తరించాలి’’ ని హెచ్ఏఎంఎస్ సికింద్రా ఎమ్మెల్యే ప్రపుల్ మాంఝీ అన్నారు.
చిరాగ్ ను పరోక్షంగా విమర్శిస్తూ.. ‘‘నేడు తమను తాము ప్రధాని నరేంద్ర మోదీకి హనుమంతుడిగా చెప్పుకునే వారు 2020 లో ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులను ఓడించడానికి ప్రయత్నించారు.
నా నియోజకవర్గంలో కూడా అభ్యర్థిని నిలబెట్టారు. కానీ అతనికి డిపాజిట్ కూడా దక్కలేదు. ఈ పరిణామం దళితులపై తమకు గుత్తాధిపత్యం లేదనే విషయాన్ని వారు గ్రహించాలి’’ అని ఆయన చెప్పారు.
ఎల్జేపీ పరిస్థితి ఎలా ఉందంటే..
చిరాగ్ ఎన్డీఏ నుంచి ఎక్కువ సీట్లు ఆశించడానికి కూడా కారణాలు చెబుతున్నారు. ‘‘మా పార్టీకి అట్టడుగు వర్గాల నుంచి పట్టు ఉంది. మా సంస్థాగత బలం, పార్టీకి, చిరాగ్ నాయకత్వానికి ప్రజలకు నమ్మకం పెరుగుతోంది.
అలాంటి పార్టీని పరిమిత సీట్లకే సర్దుబాటు చేయడం తప్పు. రాబోయే ఎన్నికలలో ఎల్జేపీ ఆర్వీ నిర్ణయాత్మక పాత్రను పోషిస్తుంది. కూటమిలో మాకు గౌరవ ప్రదమైన స్థానం లభిస్తుందని మేము విశ్వసిస్తున్నాము’’ అని చిరాగ్ బావమరిది, జమూయ్ ఎంపీ అరుణ్ భారతి అన్నారు.
బీహార్ లో ఎన్డీఏ ప్రచారానికి సీఎం నితీశ్ కుమార్ నాయకత్వం వహిస్తారని ఇప్పటికే కూటమి స్పష్టం చేసినప్పటికీ భారతి మాత్రం ఇలా అన్నారు. ‘‘ ఈ ఎన్నికలు బీహార్ భవిష్యత్ కు పునాది వేస్తాయి. బీహరీ ఫస్ట్ అనే లక్ష్యం వైపు రాష్ట్ర నవ సంకల్పం మహాసభల సందేశం కొనసాగుతోంది. నవ నైత్రిత్వ(కొత్త నాయకత్వం) తో ఈ నవ సంకల్ప్(కొత్త సంకల్పం) వైపు మనం కలిసి పనిచేయాలి’’ అన్నారు.
తమ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలని అనుకుంటుందో వెల్లడించడానికి భారతి నిరాకరించారు. చిరాగ్ కు సన్నిహితుడిగా భావిస్తున్న ఎల్జేపీ నాయకుడు ది ఫెడరల్ తో మాట్లాడుతూ.. .‘‘జేడీయూకు లోక్ సభలో 12 మంది ఎంపీలు ఉన్నారు. వారు వంద సీట్లను డిమాండ్ చేస్తున్నారు. వారి స్వంత తర్కం ప్రకారం.. మాకు ఐదుగురు ఎంపీలు ఉన్నందున కనీసం 50 సీట్లు కేటాయించాలి’’ అన్నారు.
లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల లెక్కలు..
లోక్ సభలో బెంచ్ బలం ఆధారంగా అసెంబ్లీ ఎన్నికల సీట్లను తమలో తాము విభజించుకోవడం సాధ్యంకాదని ఆయన అంగీకరిస్తున్నారు. ఉదాహారణకు కుష్వాహా ఆర్ఎల్మ్ పార్టీకి లోక్ సభలో ఎంపీలే లేరు కానీ. కుల కారణంగా రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు అవకాశం కల్పించాల్సి వచ్చిందని కూటమి నాయకులు అంటున్నారు.
అదే విధంగా రాష్ట్రానికి చెందిన ఒక సీనియర్ బీజేపీ ఎంపీ ది ఫెడరల్ తో మాట్లాడారు. ‘‘లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీకి ఈ విభాగాల్లో ఆధిక్యంలో ఉంది కాబట్టి కొన్ని పార్టీలు ప్రస్తుతం ఆక్రమించిన లోక్ సభ స్థానాల్లోకి వచ్చే అసెంబ్లీ సీట్లలో ఎక్కువ భాగం అడగటం అసంబద్దం.
అసెంబ్లీ ఎన్నికలలో ఈ స్థానాలలో ఈ పార్టీలు ఎలా పనిచేశాయో మనం చూడాలి. ఎల్జేపీ ఆర్వీ, హెచ్ఏఎంఎస్ ఆధిక్యంలో ఉన్న అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కానీ అసెంబ్లీ ఎన్నికలలో వారు ఈ నియోజకవర్గాలలో రెండోస్థానంలో కూడా నిలిచారని చెప్పారు.
బీజేపీ తన సొంత కోటా నుంచి చిరాగ్, కుష్వాహాకు సీట్లు ఇవ్వడానికి సిద్దంగా ఉంది. మాంఝీ హెచ్ఏఎంఎస్ కు సొంతంగా కోటా ఇవ్వడానికి జేడీయూ సిద్దంగా ఉందని ఒక నాయకుడు తెలిపారు.
అయితే జేడీయూ ప్రతిపాదన బీజేపీకి ఎందుకు ఆమోద యోగ్యం కాదు. బీహర్ ప్రభుత్వంలో ఒక సీనియర్ బీజేపీ మంత్రి మాట్లాడుతూ.. ‘‘నితీశ్ మా కూటమిలోకి తిరిగి వచ్చినప్పుడూ మేము పెద్ద పార్టీగా ఉన్నాము.
కానీ మేము ఇప్పటికే ముఖ్యమంత్రి పదవిని ఇచ్చాము. ఆయన నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తున్నాము. నితిష్, జేడీయూ పది సంవత్సరాల క్రితం ఉన్నట్లు లేవు. అయినప్పటికీ మేము పోటీ చేస్తున్న సీట్లను అతనికి ఇవ్వడానికి మేము సిద్దంగా ఉన్నాము.
కాకపోతే అహం, వ్యక్తిగత ఆశయాలను పక్కనపెట్టి కూటమికి ప్రయోజనకరమైన ఫార్మూలాను అంగీకరించడం అందరికి మంచిది’’ అన్నారు.
బీజేపీ సీట్లపై...
బీహర్ లోని బీజేపీ నాయకులలో కూడా ఒక వర్గం కోపంగా ఉంది. బీజేపీ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలు కూడా చిరాగ్ కావాలని పట్టుబట్టడటమే ఇందుకు కారణం.
ఉదాహారణకు తూర్పు చంపారన్ లోని గోవింద్ గంజ్ స్థానాన్ని బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు తివారీకి ఇవ్వాలని చిరాగ్ పట్టుబడుతున్నాడు. ఆయన 2015 లో ఈ స్థానంలో విజయం సాధించాడు. కానీ 2020 లో మూడోస్థానంలో నిలిచారు. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే సునీల్ మణి తివారీ సిట్టింగ్.
అలాగే పూర్నియా, కతిహార్, బక్సార్, సివాన్, రోహ్తాస్, ఔరంగాబాద్, నలంద, భోజ్ పూర్ జిల్లాలోని తొమ్మిది సీట్లలో ఎల్జేపీ రెండో స్థానంలో నిలిచింది. చిరాగ్ వాటిని తమకు కేటాయించాలని కోరుతున్నారు.
అలాగే గత ఎన్నికలలో జేడీయూ ఓటమి పాలవ్వడానికి కారణమైన 30 సీట్లను కూడా చిరాగ్ తిరిగి తమకు కేటాయించాలని డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తోంది. గత సంవత్సరం జరిగిన లోక్ సభ ఎన్నికలలో తమ పార్టీ గెలిచిన ఐదు లోక్ సభ స్థానాలలోని కొన్ని స్థానాలను అయినా తమకు కేటాయించాలని ఆయన పార్టీ కోరే అవకాశం ఉంది.
ఇప్పటికే చిరాగ్ అభ్యర్థులను ఎంపిక చేశాడా?
పాట్నాలో సమావేశమైన ఎల్జేపీ- ఆర్వీ పార్లమెంటరీ బోర్డు పార్టీ పోటీ చేయడానికి నిశ్చయించుకున్న స్థానాలకు సంభావ్య అభ్యర్థుల జాబితాను ఇప్పటికే ఖరారు చేసిందని చిరాగ్ సన్నిహితత వర్గాలు ది ఫెడరల్ తో తెలిపాయి. అయితే రాబయో ఎన్నికల్లో పోటీ చేస్తానని తన వాదనను సవ్యంగా అమలు చేస్తే చిరాగ్ ఏ స్థానం నుంచి పోటీ చేయాలో సమావేశంలో మాత్రం నిర్ణయం తీసుకోలేదు.
‘‘మా పార్టీ కార్యకర్తలు చిరాగ్ పోటీ చేయాలని కోరుకుంటున్నారు’’ అని ఎల్జేపీ ఆర్వీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు ది ఫెడరల్ తో అన్నారు. చిరాగ్ రిజర్వ్ స్థానం నుంచి పోటీ చేయాలా లేదా జనరల్ కేటగిరి సీటును ఎంచుకోవాలా అనేదానిపై పార్టీలోనే చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన అన్నారు.
లోతుగా పాతుకుపోయిన కుల అను సంబంధాలను పేరుగాంచిన రాష్ట్రంలోని వివిధ వర్గాల ఓటర్లలో తన ఆమోదయోగ్యతను నిరూపించడానికి ఇది సాధ్యమే. జమూయ్, వైశాలి, హాజీపూర్, అర్రా, జీతన్ రామ్, మాంఘీ స్వస్థలమైన గయాలోని వివిధ నియోజకవర్గాలను చిరాగ్ అసెంబ్లీ ఎన్నికల తొలి ప్రదర్శన కోసం గుర్తించినట్లు వర్గాలు తెలిపాయి. న్యూఢిల్లీ నుంచి చిరాగ్ చేయాలనుకుంటున్న రాష్ట్రం వైపు జంప్ అతడిని పాట్నా అధికార కారిడార్ లోకి తీసుకువస్తుందా లేదా అనేది సమాధానం లేని పెద్ద ప్రశ్న.
Next Story