అమెరికాకు ‘బిగ్ బ్యూటీఫుల్’ ఎఫెక్టే కాబోతుందా?
x
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

అమెరికాకు ‘బిగ్ బ్యూటీఫుల్’ ఎఫెక్టే కాబోతుందా?

రాబోయే పది సంవత్సరాలలో 4.5 ట్రిలియన్ డాలర్ల పన్నులోటు, సామాజిక సంక్షేమ పథకాల్లో కోతలు


అమెరికా అధ్యక్షుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘ది వన్ బిగ్, బ్యూటీఫుల్ బిల్’’ ను తీసుకొచ్చారు. ఈ చట్టంలో పన్ను మినహాయింపు, ఖర్చు తగ్గింపు వంటి కీలక అంశాలున్నాయి. పన్ను కోత వల్ల అమెరికా ఆదాయంలో రాబోయే పది సంవత్సరాలలో దాదాపు 4.5 ట్రిలియన్ డాలర్ల లోటు ఉండబోతోందని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ట్రంప్ మానస పుత్రిక పిలుస్తున్నఈ చట్టంలో అనేక అంశాలు ఉన్నాయి. తాను స్వయంగా విధించుకున్న జూలై నాలుగో తేదీనే కాంగ్రెస్ ఆమోదించిన బిల్లుపై సంతకం చేసి చట్టంగా మార్చారు.

887 పేజీలతో ఈ చట్టం చాలా విస్తృతంగా ఉంది. ఈ చట్టాన్ని చివరి క్షణం వరకూ నిలుపుదల చేయడానికి డెమొక్రాట్లు ప్రయత్నించినప్పటికీ, రిపబ్లికన్లు మాత్రం ఐక్యంగా నిలబడి ప్రతిపక్షం చేసిన అన్ని ప్రయత్నాలను అడ్డుకున్నారు.

సెనెట్ మంగళవారం ఈ బిల్లును ఆమోదించింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ టై బ్రేకింగ్ వేసి బిల్లు ఆమోదంలో కీలక పాత్ర పోషించారు. ఇది గురువారం 218-214 తేడాతో తుది వెర్షన్ బిల్లును ఆమోదించింది.

వైట్ హౌజ్ అధికారిక ఖాతాలో ట్రంప్ బిల్లుపై సంతకం చేస్తున్న ఓ చిన్న క్లిప్ ను షేర్ చేసింది. ఈ వీడియో కింద ‘‘ సంతకం చేశారు. సీలు వేశారు. డెలీవరీ అయింది. అధ్యక్షుడు ట్రంప్ కలల ప్రాజెక్ట్ అయిన బిగ్ బ్యూటీఫుల్ బిల్లు ఇప్పుడు చట్టంగా మారింది. ఇక స్వర్ణయుగం కనిపిస్తుంది’’ అని క్యాప్షన్ ఇచ్చింది.
లోపల ఏముందంటే..
ఈ బిల్లులో వ్యాపారాలకు తగ్గింపులు, కొత్త పన్ను మినహాయింపులు ఉన్నాయి. ట్రంప్ మొదటి పదవీకాలం నుంచి పన్ను మినహయింపు గురించి మాట్లాడుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ తరువాత భారీ పన్ను పెరుగుదల ఉంటుంది. కాబట్టి ఈ బిల్లు చాలా కీలకమని రిపబ్లికన్లు వాదన. ఈ చట్టంలో దాదాపు 4.5 ట్రిలియన్ల పన్ను కోతలు ఉన్నాయి.
ట్రంప్ మొదటి పదవీకాలంలో ఆమోదించబడిన పన్ను కోతలను పటిష్టం చేస్తూ ప్రస్తుత పన్ను రేట్లు, మినహయింపులు శాశ్వతంగా మారబోతున్నాయి. ఇది తాత్కాలికంగా టిప్, ఓవర్ టైం, ఆటో రుణాలపై కొత్త పన్ను మినహయింపు ప్రతిపాదించింది.
సామాజిక భద్రతా ప్రయోజనాలపై ఇక ముందు టాక్స్ పేయర్ల సొమ్మును ఉపయోగించబోమని ట్రంప్ పదే పదే చెబుతున్నారు. ఇప్పుడు దీనిని అమలులోకి తెచ్చారు. ఈ చట్టం ప్రకారం సంవత్సరానికి 75 వేల డాలర్ల కంటే ఎక్కువ సంపాదించని వృద్దులకు 6 వేల డాలర్ల మినహయింపు ఉంటుంది. తక్కువ ఆదాయ స్థాయిలలో ఉన్న మిలియన్ల కుటుంబాలకు పూర్తి క్రెడిట్ లభించదు.
స్థానిక తగ్గింపులు..
రాష్ట్ర, స్థానిక తగ్గింపులపై అనే పరిమితి ఎస్ఏఎల్టీ అనే పరిమితి ఐదు సంవత్సరాలకు నాలుగు రెట్లు పెరిగి 40 వేల డాలర్లకు చేరుకుంటుంది. అత్యధికంగా పన్నులు వసూలు చేసే న్యూయార్క్ వంటి రాష్ట్రాలకు ముఖ్యమైన నిబంధనలు దాదాపు 10 సంవత్సరాలు కొనసాగాలని హౌజ్ కోరుకుంది.
అమెరికాలో మునుపెన్నడూ లేని విధంగా పన్ను కోతలు కూడా ఉండబోతున్నాయి. వాటిలో వ్యాపార పరికరాలు, పరిశోధన ఖర్చులో 100 శాతం పన్ను మినహయింపు ఉంటుంది. ఇది ఆర్థిక వృద్దిని పెంచుతుందని విశ్లేషకులు అంటున్నారు.
ఈ బిల్లు వల్ల సంపన్న కుటుంబాలకు 12 వేల డాలర్ల అదనపు ఆదాయం లభించగా, పేద ప్రజలకు సంవత్సరానికి 1600 డాలర్ల ఖర్చు పెంచబోతోంది. ఇవన్నీ మెడికేర్, ఆహర రంగంలో ఉంటాయని తెలుస్తోంది.
జాతీయవాదానికి మద్దతు..
ఈ బిల్లు మెక్సికో నుంచి వచ్చే వలసదారులను నిరోధించడానికి గోడ నిర్మించేందుకు భారీ మొత్తంలో నిధులు అందించబోతోంది. అలాగే అక్రమ వలసదారులను దేశం నుంచి తరలించేందుకు కూడా మద్దతు ఇస్తుంది. సంవత్సరానికి కనీసం పది లక్షల మందిని తిప్పి పంపాలని ట్రంప్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.
పదివేల మంది అక్రమ వలసదారులకు ఉపయోగపడేలా నిర్భంధ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు కూడా వీలు కల్పిస్తుంది. పది వేల మంది కొత్త ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులను నియమించడానికి డబ్బు అందిస్తుంది.
సరిహద్దులో సైనికుల సంఖ్య పెంచుతారు. కవచ్ క్షిపణ రక్షణ వ్యవస్థకు అవసరమైన మొత్తాలను కూడా వినియోగించవచ్చు. ఈ అంశాలకు దాదాపు 350 బిలియన్ డాలర్ల నిధులు సమకూర్చబోతున్నారు.
అలాగే పెంటగాన్ కు కూడా నూతన నౌకల యుద్ధ నిర్మాణం, ఆయుధ వ్యవస్థలు, సైనికులు, మహిళల జీవన ప్రమాణాల కోసం బిలియన్ డాలర్ల నిధులు అందిస్తుంది.
గోల్డెన్ డోమ్ క్షిపణీ రక్షణ వ్యవస్థ అభివృద్ధికి 25 బిలియన్లను ఇస్తారు. సరిహద్దు భద్రత కోసం రక్షణ శాఖకు 1 బిలియన్ డాలర్లు కేటాయించబోతున్నారు. ముఖ్యంగా టెక్సాస్ సరిహద్దులో పటిష్టమైన భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేయబోతున్నారు.
మెడికేర్ లో కోతలు..
ఈ బిల్లు వల్ల మెడికేర్ సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రొగ్రామ్(ఎస్ఎన్ఏపీ) బిల్ పన్ను మినహయింపులు, ఖర్చులకు నిధులు సమకూర్చడానికి భారీ స్థాయిలో కోతలు ఉండబోతున్నాయి.
పన్ను మినహయింపుల వల్ల భారీ స్థాయిలో ఆదాయ లోటు ఉండబోతోంది. అయితే దీనిని భర్తీ చేయడానికి ప్రభుత్వం అమలు చేసే సామాజిక సంక్షేమ పథకాల్లో కోతలు పెట్టబోతున్నారు.
గర్భిణీ స్త్రీలు, వికలాంగులు, పిల్లలకు అందిస్తున్న భద్రతా కార్యక్రమాల్లో వృథాను అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తామని, వాటిని సమర్థవంతంగా అమలు చేస్తామని రిపబ్లికన్లు వాదిస్తున్నారు.
65 సంవత్సరాల వయస్సు ఉండి ప్రభుత్వం నుంచి మెడికైడ్, ఆహారం పొందుతున్న చాలా మందికి నెలకు 80 గంటలకు తక్కువ కాకుండా పని అవసరాలు తీర్చాలని కూడా చట్టంలో నిబంధనలు ఉన్నాయి. మెడికైడ్ పొందే రోగులు కచ్చితంగా 335 డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది.
ఒబామా అఫర్డబుల్ కేర్ యాక్ట్ కింద మెడికైడ్ సేవలపై 71 మిలియన్లకు పైగా ప్రజలు ఆధారపడుతున్నారు. 40 మిలియన్ల మంది సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రొగ్రామ్ ను ఉపయోగించుకుంటున్నారు. అయితే విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం వారిలో ఎక్కువ మంది పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందుతున్నారు.
ఈ బిల్లు చట్టంగా మారిన నేపథ్యంలో 2034 నాటికి 11.8 మిలియన్ల మంది అమెరికన్లు బీమా లేకుండా ఉంటారని, 3 మిలియన్ల మంది ఆహార సేవలకు అర్హత పొందలేరని కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం అంచనా వేసింది. వీటిని అమెరికాలో ఎస్ఎన్ఏపీ ప్రయోజనాలు అని కూడా పిలుస్తారు.
ఈ ప్రయోజనాల్లో రాష్ట్రాలు కూడా కొంత భరించాలని రిపబ్లికన్లు కోరుతున్నారు. ప్రస్తుతం ఫెడరల్ ప్రభుత్వం అన్ని ఖర్చులకు నిధులు సమకూరుస్తుంది. బిల్లు ప్రకారం.. 2028 నుంచి రాష్ట్రాలు వారి చెల్లింపులో 6 శాతం మించి చేస్తే ఈ ఖర్చులో నిర్ణీత మొత్తాన్ని అందించాల్సి ఉంటుంది. అయితే ఈ బిల్లులో అలస్కాకు మినహాయింపు ఇవ్వాలని సెనేటర్ లిసా ముర్కోవ్స్కీ పోరాటం చేశారు.
పన్ను మినహాయింపు వెనక్కి..
శక్తి, పవనశక్తి వంటి పునరుత్పాదక ఇంధన వనరులకు ఇస్తున్న పన్ను మినహాయింపులను వెనక్కి తీసుకోవాలని రిపబ్లికన్లు ఆలోచిస్తున్నారు. డెమొక్రాటిక్ ఒరేగాన్ సెనెటర్ ఈ విషయం పై మాట్లాడుతూ.. అమెరికా పవన, సౌర పరిశ్రమలకు ఈ బిల్లు మరణ శిక్ష విధించిందని ఆరోపించారు.
ఎలక్ట్రిక్ వాహానాలు కొనుగోలు చేసే వ్యక్తులకు పన్ను మినహయింపులు తొలగించారు. ఇంతకుముందున్న చట్టాల ప్రకారం ఇది 2032 వరకు వర్తించేది. ఇప్పుడు ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 తో ముగుస్తుంది. కీలక పదార్థాల ఉత్పత్తికి ఉపయోగపడే మెటలర్జికల్ బొగ్గుకు ఉన్న మినహయింపులను సైతం తొలగించబోతున్నారు.
ట్రంప్ అకౌంట్స్..
18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వ్యక్తుల పన్ను ప్రయోజనాల కోసం ట్రంప్ అకౌంట్స్ అనబడే కొత్త పథకం ప్రవేశపెట్టారు. దీనికి సంవత్సరానికి 5 వేల డాలర్ల వరకు జమ చేసుకోవచ్చు. వీటిని విద్య సంబంధిత ఖర్చులు, చిన్న వ్యాపారం, మొదటి సారిగా ఇల్లు కొనుగోలు చేసే వ్యక్తుల కోసం ఉపయోగించుకోవచ్చు.
2025-29 మధ్య జన్మించే వారి కోసం ప్రభుత్వం వేయి డాలర్లను డిపాజిట్ చేస్తుంది. అలాగే ట్రంప్ చాలాకాలంగా కోరుకుంటున్న ‘‘నేషనల్ గార్డెన్ ఆఫ్ అమెరికన్ హీరోస్’’ను స్థాపించడానికి సెనెట్ 40 మిలియన్ డాలర్లను అందించింది.
చెల్లింపుల పన్ను..
విశ్వవిద్యాలయాలు విదేశాలకు అందించే సాయంపైన, అమెరికా ప్రజలు విదేశాలకు పంపే చెల్లింపులపై కూడా పన్ను విధిస్తారు. ఇది ఒక శాతంగా ఉండబోతోంది. తుపాకీ సైలెన్సర్లు, షార్ట్ బారెల్డ్ రైఫిల్స్, షాట్ గన్ లపై ప్రస్తుతం ఉన్న 2 వందల డాలర్ల పన్నును తొలగించారు.
ఏఐ నిబంధనల తొలగింపు..
రాష్ట్రాలు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను నియంత్రించడానికి తీసుకొచ్చిన ప్రతిపాదనను సెనెట్ వ్యతిరేకించింది. దేశ వ్యాప్తంగా ఉన్న రిపబ్లిక గవర్నర్లు తాత్కాలిక నిషేధాన్ని తొలగించాలని కోరడంతో సెనెట్ 99-1 తో ఆమోదించింది.
ఇది గ్రామీణ ఆసుపత్రులకు ఐదు సంవత్సరాల పాటు 10 బిలియన్లు లేదా 50 బిలియన్లను అందిస్తుంది. సెనెట్ మొదట వీటికి 25 బిలియన్లు మాత్రమే అందించడానికి సిద్ధమైంది.
కానీ రిపబ్లికన్లు చివరకు ఈ మొత్తాన్ని పెంచారు. చైనా నుంచి దిగుమతి చేసుకునే సౌర విద్యుత్ పలకాలపై కూడా పన్ను మినహయింపు ప్రకటించారు. ఈ బిల్లు వల్ల రాబోయే పది సంవత్సరాలలో పన్ను లోటు 3.3 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.


Read More
Next Story