
పశ్చిమాసియాకు కొనసాగుతోన్న విమాన సర్వీసులు
సేవలందిస్తున్న ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ..
అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పశ్చిమాసియా గగనతలం కొంత క్లిష్టంగా మారింది. అయినప్పటికీ భారతీయ విమానయాన సంస్థలు ప్రయాణికుల రాకపోకలు కోసం సర్వీసులను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బుధవారం (మార్చి 12) పశ్చిమాసియా ప్రాంతానికి మొత్తం 58 విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించాయి. గగనతల పరిమితులు, కొన్ని ప్రాంతాల్లో మూసివేతలు ఉన్నా.. కనెక్టివిటీ కొనసాగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి.
జెడ్డా మార్గంలో విమాన సర్వీసులు..
సౌదీ అరేబియాలోని జెడ్డా నగరానికి భారతదేశం నుంచి విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. ఢిల్లీ, ముంబై నుంచి ఒక్కో ట్రిప్ చొప్పున మొత్తం 8 విమానాలను ఎయిర్ ఇండియా నడుపుతోంది. అదే సమయంలో హైదరాబాద్, కోజికోడ్ నుంచి మరో నాలుగు ట్రిప్పులను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నడుపుతోంది.
మస్కట్‌కు ఎక్కువ డిమాండ్..
ఒమాన్ రాజధాని మస్కట్ మార్గంలో కూడా విమానాలు కొనసాగుతున్నాయి. ఈ మార్గంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మొత్తం 14 విమానాలను నడుపుతోంది. ఢిల్లీ, ముంబై, కన్నూర్, తిరువనంతపురం, తిరుచిరాపల్లి నగరాల నుంచి సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే కొచ్చి నుంచి రెండు ట్రిప్పులు నడుస్తున్నాయి. గల్ఫ్ దేశాల్లో ఉన్న కేరళ ప్రజల అధిక సంఖ్య కారణంగా ఈ మార్గంలో డిమాండ్ ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు.
#ImportantUpdate
— Air India (@airindia) March 10, 2026
Air India and Air India Express will together operate a total of 58 scheduled and non-scheduled flights to and from the West Asia region on 11 March 2026.
View the full list here: https://t.co/lIXfE9u6je
యూఏఈకి అదనపు విమానాలు..
ఇదే సమయంలో యునైటెట్ అరబ్ ఎమిరైట్స్‌కు, అక్కడి నుంచి మొత్తం 36 అదనపు తాత్కాలిక (నాన్ షెడ్యూల్) విమానాలను కూడా నడపనున్నారు.

