
బాంబు దాడులతో దద్దరిల్లు గల్ఫ్, ఇరాన్- అమెరికా యుద్ధం తీవ్రం!
600 దాటిన మరణాలు, బీరూట్ పైన దాడులు
ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం తాజా అప్‌డేట్స్ (మార్చి 3, 2026 ఉదయం నాటికి):
టెహ్రాన్, బీరుట్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. మరణాలు 600 దాటాయి.
ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ రాజధాని టెహ్రాన్, లెబనాన్‌లోని బీరూట్ పై భారీ వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి. ఇరాన్ స్టేట్ బ్రాడ్‌కాస్టర్ (IRIB) భవనంపై కూడా దాడి జరిగింది. ఇరాన్, లెబనాన్‌లలో మొత్తం మరణాలు 600 దాటాయి. (పౌరులు, సైనికులు కలిపి) టెహ్రాన్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా భారీ పేలుళ్లు వినిపిస్తున్నాయి. ఇరాన్ ఎక్స్‌పెడియన్సీ కౌన్సిల్ భవనం, పోలీస్ స్టేషన్లు, ఇతర ముఖ్యమైన కేంద్రాలు దెబ్బతిన్నాయి.
యుద్ధం 4 వారాలకు పైగానే కొనసాగవచ్చు- ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లో మాట్లాడుతూ – ఇరాన్‌పై సైనిక కార్యాచరణ 4 నుంచి 5 వారాలు పట్టవచ్చనన్నారు. "అవసరమైతే ఇంకా ఎక్కువ కాలం కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు" అని చెప్పారు. ఇరాన్ మిసైల్ సామర్థ్యం, నావల్ ఫోర్స్‌లను నాశనం చేయడం, న్యూక్లియర్ ప్రోగ్రాం ఆపడం, బయటి గ్రూపులకు సపోర్ట్ ఆపడం తమ ప్రధాన లక్ష్యాలు అని పేర్కొన్నారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియో "ఇంకా హార్డెస్ట్ హిట్స్ వచ్చేవే" అని హెచ్చరించారు. గ్రౌండ్ ట్రూప్స్ పంపే ఆలోచన కూడా ఉందన్నారు.
ఇరాన్ ప్రతీకార దాడులు..
గల్ఫ్‌లో ఎనర్జీ ఇన్‌ఫ్రా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) – స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ను "క్లోజ్డ్" అని ప్రకటించింది. ప్రపంచ ఆయిల్ 20% దీని గుండా పాస్ అవుతుంది. ఏ నౌక వచ్చినా దాడి చేస్తామని హెచ్చరించింది. షిప్పింగ్ ట్రాఫిక్ భారీగా తగ్గింది. గల్ఫ్ దేశాల్లో ఎనర్జీ ఇన్‌ఫ్రా (కతార్ LNG ఫెసిలిటీలు, UAE, సౌదీలో టార్గెట్లు)పై దాడులు చేసింది. కతార్ LNG ప్రొడక్షన్ పూర్తిగా సస్పెండ్ అయింది. గ్లోబల్ ఆయిల్, గ్యాస్ ధరలు షార్ప్‌గా పెరిగాయి.
ఇతర ముఖ్య అప్‌డేట్స్
ఇరాన్ దాడులు: ఇజ్రాయెల్‌లో వెస్ట్ జెరూసలెం, టెల్ అవీవ్, ఏలట్ పై మిసైల్స్ దాడులు చేసింది.
గల్ఫ్‌లో: దుబాయ్‌లోని అమెరికా ఫోర్సెస్, కువైట్ అరిఫ్జాన్ బేస్‌పై డ్రోన్, మిసైల్ దాడులు జరిగాయి.
సౌదీ అరేబియా: రియాద్‌లోని US ఎంబసీపై డ్రోన్ దాడి. పరిమిత కాల్పులు, స్వల్పనష్టం. అమెరికన్లు షెల్టర్ జోన్ కి వెళ్లిపోవాలని ఆదేశం.
అమెరికా: మిడిల్ ఈస్ట్‌లోని 15కి పైగా దేశాల నుంచి US సిటిజన్స్‌ను "తక్షణమే వెళ్లిపోవాలి" అని ఆర్జెంట్ అడ్వైజరీ ఇచ్చింది. మరిన్ని రిఫ్యూలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్, ఫైటర్ జెట్స్ మిడిల్ ఈస్ట్‌కు వెళ్లాయి.
యునైటెడ్ నేషన్స్: ఇరాన్ ప్రైమరీ స్కూల్ పై బాంబు దాడిని "మానవతా చట్టం ఉల్లంఘన" అని UNESCO అప్‌డేట్ ఇచ్చింది. గోలెస్తాన్ ప్యాలెస్ (UNESCO హెరిటేజ్) డ్యామేజ్‌పై ఆందోళన వ్యక్తం చేసింది.
ఇజ్రాయెల్ సొసైటీ: షెల్టర్లలో ఎక్కువ సమయం గడపాల్సి రావడంతో ప్రజల మధ్య గొడవలు మొదలయ్యాయి. హెజ్బుల్లా దళాలు పూర్తిగా ప్రవేశించాయి.
యుద్ధం మూడో రోజుకు చేరుకుంది. ఇరాన్ ప్రతిఘటన తీవ్రమవుతోంది. గల్ఫ్ నుంచి ఇంధన సరఫరా దెబ్బతింటోంది. గ్లోబల్ ఇంపాక్ట్ పెరుగుతోంది. ట్రంప్ ప్రకారం ఇది ఇంకా మొదలే కాని ముగింపు కాదు. పరిస్థితి రోజుకో తీరున మారుతోంది. శాంతి చర్చల ప్రస్తావన ఎక్కడా కనిపించడం లేదు.
Next Story

