ట్రంపూ..ఇప్పటికైనా మా దెబ్బేమిటో తెల్సిందా: ఇరాన్
x
యుద్ధం 36వ రోజుకు చేరింది.. అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చింది!

ట్రంపూ..ఇప్పటికైనా మా దెబ్బేమిటో తెల్సిందా: ఇరాన్

36రోజుల్లో రూ.25వేల కోట్ల విలువైన అమెరికా యుద్ధ విమానాల కూల్చివేత


ఇరాన్- అమెరికా యుద్ధం మొదలై ఇవాళ్టికి 36వ రోజుకు చేరింది. ఓపక్క మాటల తూటాలు పేలుతూనే మరోపక్క యుద్ధం తీవ్రస్థాయికే చేరినట్టు కనిపిస్తోంది. ఇరాన్ నిన్న ఒక్కరోజే అమెరికాకు చెందిన 2 యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ప్రకటించింది. వీటితో ఇప్పటి వరకు ఈ 5 వారాల్లోనే అమెరికా సుమారు $3 బిలియన్ల (దాదాపు ₹25,000 కోట్లు) విలువైన విమానాలు, డ్రోన్లను కోల్పోయిందని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ వంటి దేశం ఇంత ఖరీదైన ఆయుధాలను నేలకూల్చడం ఆర్థికంగా కూడా అమెరికాకు పెద్ద దెబ్బే. ఇప్పటికే ఎఫ్-35లాంటి అతిపెద్ద యుద్ధవిమానాన్ని కూల్చివేసిన ఇరాన్ నిన్న- నైరుతి ఇరాన్‌లోని కోహ్గిలుయే - బోయర్ అహ్మద్ ప్రావిన్స్‌లో కూలివేసింది. రెండోదాన్ని పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో కూల్చింది. ఈ ఘటనల్లో ఇద్దరు అమెరికన్ సిబ్బందిని రక్షించగా, మరొకరు ఏమయ్యారో కూడా తెలియరాలేదు.

అమెరికాకు ఆర్థికంగా భారీ నష్టం...

ఈ యుద్ధ విమానాల కూల్చివేత అమెరికాకు కేవలం సైనికపరంగానే కాకుండా ఆర్థికంగానూ పెద్ద దెబ్బ.
ఒక్కో F-15E విమానం ఖరీదు సుమారు $100 మిలియన్లు (దాదాపు ₹830 కోట్లు).
ఒకవేళ ఇరాన్ వాదన నిజమై F-35 విమానం కూలి ఉంటే, దాని ధర $109 మిలియన్ల (సుమారు ₹915 కోట్లు) వరకు ఉంటుంది.
ఈ 36 రోజుల్లో అమెరికా కోల్పోయిన ఆయుధ సంపద విలువ దాదాపు $3 బిలియన్ల (₹25,000 కోట్లు) పైమాటేనని నిపుణుల అంచనా.

శుక్రవారం తెల్లవారుజామున కూల్చివేసిన ఈ విమాన పైలట్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక ప్రజలు కూడా ఈ సెర్చ్ ఆపరేషన్‌లో సహకరించాలని అధికారులు కోరారు.
స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ సమీపంలో కూలిన ఈ విమానం A-10 వార్‌హాగ్ రకానికి చెందినదని, దీన్ని కూడా తామే కూల్చామని ఇరాన్ సైన్యం ధృవీకరించింది.

ఇరాన్‌లో సంబరాలు ఎందుకు...

అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొనే సత్తా తమకు ఉందని నిరూపించినట్టు ఇరాన్ సైన్యం పేర్కొంది. ఈ విజయంతో టెహ్రాన్ వీధుల్లో ప్రజలు భారీగా సంబరాలు చేసుకుంటున్నారు. మరిన్ని ఆశ్చర్యకరమైన దాడులు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది.
అమెరికా వంటి అగ్రరాజ్యానికి చెందిన అత్యాధునిక F-15E స్ట్రైక్ ఈగిల్, A-10 వార్‌హాగ్ విమానాలను తమ స్వదేశీ రక్షణ వ్యవస్థలతో కూల్చివేయడం ఇరాన్ సైనిక పటిమకు నిదర్శనమని అక్కడి ప్రజలు భావిస్తున్నారు.
గత ఐదు వారాలుగా అమెరికా దాడులతో సతమతమవుతున్న ఇరాన్ సైన్యానికి, ఈ విజయం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.
ఇరాన్ ప్రభుత్వ మద్దతు...
ఇరాన్ రాజధాని టెహ్రాన్ వీధుల్లో ప్రజలు జెండాలతో భారీగా తరలివచ్చి నినాదాలు చేస్తున్నారు. "తాము మొదటి నుంచి చెబుతున్నట్లుగా అమెరికాకు ఆశ్చర్యకరమైన దాడులు (Surprises) రుచి చూపిస్తాం" అని ఇరాన్ అధికారులు పేర్కొంటున్నారు.
పైలట్ల కోసం గాలింపు: విమానాలు కూలిన ప్రాంతాల్లో అమెరికన్ పైలట్లను పట్టుకోవడానికి ఇరాన్ సైన్యం గాలిస్తోంది. పైలట్‌ను పట్టుకున్న వారికి భారీ బహుమతులు కూడా ప్రకటిస్తామని స్థానిక అధికారులు చెప్పడం ప్రజల్లో మరింత ఆసక్తిని పెంచింది.
మొత్తానికి, ఇన్ని రోజులుగా రక్షణలో ఉన్న ఇరాన్, ఇప్పుడు ఎదురుదాడి చేసి అమెరికా విమానాలను నేలకూల్చడం వల్ల అక్కడి ప్రజలు దీన్ని ఒక గొప్ప విజయంగా చూస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.
ఇరాన్ ప్రభుత్వం నిన్న అధికారికంగా ఒక ప్రకటన చేస్తూ, తమ కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా అమెరికాకు చెందిన రెండవ ఎఫ్-35 విమానాన్ని కూల్చివేసినట్లు పేర్కొంది. సెంట్రల్ ఇరాన్ ఆకాశంలో ఇది భారీ పేలుడుతో కూలిపోయిందని, పైలట్ ప్రాణాలతో ఉండే అవకాశం లేదని ఇరాన్ మీడియా (Mehr News) తెలిపింది.
గతంలో అంటే మార్చి 19న కూడా ఒక ఎఫ్-35 విమానాన్ని కూల్చామని ఇరాన్ ప్రకటించింది. అయితే, అప్పట్లో అమెరికా దాన్ని ఖండించింది. ఆ విమానం కూలిపోలేదని, సాంకేతిక కారణాల వల్ల అత్యవసరంగా ల్యాండింగ్ (Emergency Landing) అయిందని, పైలట్ సురక్షితంగా ఉన్నాడని అమెరికా సెంట్రల్ కమాండ్ వివరణ ఇచ్చింది.

తాజా గందరగోళం...

నిన్న కూలిన విమానం విషయంలో కొంచెం గందరగోళం నెలకొంది. ఇరాన్ అది ఎఫ్-35 అని చెబుతుంటే, అమెరికా మీడియా, నిపుణులు (CNN, Washington Post) అది F-15E Strike Eagle అని అంటున్నారు. ఎందుకంటే ఎఫ్-35లో ఒక్కరే పైలట్ ఉంటారు, కానీ నిన్నటి ఘటనలో ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు (ఒకరు బయటపడ్డారు, మరొకరు అదృశ్యం) వార్తలు వస్తున్నాయి.

ఇరాన్ వాదన ప్రకారం అయితే ఇప్పటివరకు రెండు ఎఫ్-35 విమానాలను వారు కూల్చివేసినట్లు లెక్క. కానీ అమెరికా మాత్రం వీటిని అధికారికంగా ధృవీకరించలేదు. ఏదేమైనా, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనవిగా భావించే అమెరికా స్టీల్త్ విమానాలను ఇరాన్ లక్ష్యం చేసుకోవడం ఈ యుద్ధంలో ఒక కీలక మలుపు.

అమెరికాలో రాజకీయ దుమారం

అమెరికా కాంగ్రెస్ అధికారికంగా 'యుద్ధ ప్రకటన' (Declaration of War) చేస్తే తప్ప, సైనిక కార్యకలాపాలకు నిధులు ఇచ్చేది లేదని రిపబ్లికన్ సెనేటర్ జాన్ కర్టిస్ స్పష్టం చేశారు. ట్రంప్ తీసుకుంటున్న చర్యలకు మద్దతు ఉన్నప్పటికీ, రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ ఆమోదం ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇజ్రాయెల్ ఎదురుదాడి...
ఇరాన్ జరిపిన దాడుల వల్ల దక్షిణ నెగెవ్ ప్రాంతంలోని ఒక పారిశ్రామిక కేంద్రంలో మంటలు చెలరేగాయి. అలాగే రోష్ హాయిన్, పెటా టిక్వా ప్రాంతాల్లోని భవనాలు దెబ్బతిన్నాయి.
లెబనాన్‌లో విధ్వంసం: ఇజ్రాయెల్ తన హెచ్చరికలను అమలు చేస్తూ లెబనాన్‌లోని లిటానీ నదిపై ఉన్న రెండు కీలక వంతెనలను పేల్చివేసింది. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ దళాలు తమ పట్టును మరింత పెంచాయి.
Read More
Next Story