
ఇరాన్ సుప్రీంలీడర్ గా ఎంపికైన అయతుల్లా ఖమేనీ రెండో కుమారుడు మొజ్తాబా (ఫోటో కర్టసీ గోర్క్)
IRAN: తండ్రిని మించిన వాడు ఇరాన్ సుప్రీం మొజ్తాబా ఖమేనీ
'తెర వెనుక రాజు' తెర మీదకు వచ్చారు!
ఊహించిందే జరిగింది. ఇరాన్ సర్వోన్నత నాయకునిగా అయతుల్లా ఖమేనీ కుమారుడు మోజ్తాబా ఖమేనీ ఎన్నికయ్యారు. ఇరాన్ సైనిక, రాజకీయ నాయకునిగా మొజ్తాబా ఖమేనీ విధేయత ప్రతిజ్ఞ చేశారు. ఆయన తన తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీ స్థానంలో దేశ కొత్త సుప్రీం నాయకుడిగా నియమితులైన తర్వాత ఆయన ఈ ప్రతిజ్ఞ చేశారు.
మొజ్తబా ఖమేనీ ఎవరు?
మొజ్తబా ఇరాన్ మాజీ సర్వోన్నత నాయకుడు (సుప్రీమ్ లీడర్) అయతుల్లా అలీ ఖమేనీ రెండవ కుమారుడు. మతపరమైన ప్రముఖ నాయకుడు (క్లెరిక్). ఇరాన్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారు. తండ్రి పాలనలో తెర వెనుక ఉండి ప్రభావవంతమైన పాత్ర పోషించాడు. ఇస్లామిక్ రిపబ్లిక్‌లోని బలమైన సంస్థలైన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), ఇతర రహస్య సేవలతో కీలకపాత్ర పోషించారు. ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకునే వారు.
పుట్టుపూర్వోత్తరాలు
మొజ్తబా ఖమేనీ 1969 సెప్టెంబర్ 8న ఇరాన్‌లోని మాష్హద్ నగరంలో జన్మించాడు. ఇది ఇస్లామిక్ రిపబ్లిక్ స్థాపనకు కొన్నేళ్ల ముందు (1979 ఇస్లామిక్ విప్లవానికి ముందు) పుట్టారు. ప్రస్తుత వయసు 56 ఏళ్లు. మొజ్తబా ఖమేనీ కుటుంబం ఇరాన్ రాజకీయాల్లో చాలా ప్రభావవంతమైనది.
ఆయన తండ్రి అయతోల్లా అలీ ఖమేనీ (1939–2026). ఇరాన్ మాజీ సర్వోన్నత నాయకుడు. తల్లి మన్సౌరెఖ్ ఖోజస్తెహ్ బాగర్జాదెఖ్, (Mansoureh Khojasteh Bagherzadeh), అలీ ఖమేనీ భార్య (1947–2026). అయతుల్లా అలీ ఖమేనీకి మొత్తం సంతానం 6. వారిలో నలుగురు మగపిల్లలు, ఇద్దరు కుమార్తెలు. మొజ్తాబా పెద్ద సోదరుడు మోస్తఫా ఖమేనీ (Mostafa Khamenei). రాజకీయాల్లో చురుకుగా ఉన్నాడు. రెండో వారు మొజ్తాబా ఖమైనీ. ఇప్పుడు సర్వోన్నత నాయకుడు. చిన్న సోదరులు మసౌద్ ఖమేనీ (Masoud Khamenei), మేయ్సామ్ ఖమేనీ (Meysam Khamenei). సోదరీ మణులు బోష్రా ఖమేనీ (Boshra Khamenei), హోదా ఖమేనీ (Hoda Khamenei). భార్య ఝారా హద్దాద్ అదెల్ (Zahra Haddad Adel). పిల్లలు ముగ్గురు.
ఎక్కడ చదువుకున్నారు?
మొజ్తబా ఖమేనీ ప్రధానంగా మతపరమైన విద్యాభ్యాసం చేసి, ఇస్లామిక్ థియాలజీ (ఇస్లామిక్ థియాలజీ), షియా ఇస్లాం సంబంధిత విషయాల్లో నైపుణ్యం సంపాదించాడు. అయితే అయతుల్లా ర్యాంక్ పొందలేదు. కన్జర్వేటివ్ షియా స్కాలర్ల కింద చదువుకున్నాడు. ఇరాన్‌లోని షియా ఇస్లాం ప్రధాన కేంద్రం కోమ్ (Qom)లో ఫిక్ (Fiqh - ఇస్లామిక్ లా), షియా ఇస్లాం థియాలజీ, తఫ్సీర్ (Tafsir - కురాన్ వివరణ) చదివారు.
ఇరాన్-ఇరాక్ యుద్ధంలో (1980లు) పాల్గొన్నాడు. ఇది అతని రాజకీయ శిక్షణకు బాగా పనికి వచ్చిందని చెబుతారు. యూనివర్సిటీ డిగ్రీలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, మతపరమైన సెమినరీలపై దృష్టి పెట్టాడు.
విదేశీ సంస్కృతి పట్ల ఆసక్తి ఉందా?
మొజ్తబా ఖమేనీకి విదేశీ (ముఖ్యంగా పాశ్చాత్య/వెస్టర్న్) సంస్కృతి పట్ల ఆసక్తి లేదు. తీవ్ర వ్యతిరేకత ఉంది. అతడు అమెరికా, పాశ్చాత్య దేశాలపై తీవ్ర అవిశ్వాసాన్ని చూపుతాడు. "రెసిస్టెన్స్" డాక్ట్రిన్ (ప్రతిఘటనా సిద్ధాంతం) ప్రకారం వాటిని వ్యతిరేకిస్తాడు. తండ్రి అలీ ఖమేనీ లాగానే, పాశ్చాత్య సంస్కృతిని "కరప్ట్", "సావేజ్"గా (అవినీతికరమైన బానిసత్వంగా) విమర్శిస్తాడు. ఉదాహరణకు, కోవిడ్ మహమ్మారి సమయంలో పాశ్చాత్య సమాజాన్ని విమర్శించాడు. అతడు ఇస్లామిక్ విలువలను మాత్రమే ప్రోత్సహిస్తాడు, విదేశీ సంస్కృతులపై ఏమాత్రం ఆసక్తి లేదని అంచనా.
మతపరమైన ఛాందసం ఉందా?
ఉందనే చెప్పాలి. మొజ్తబా ఖమేనీని మతపరమైన "హార్డ్‌లైనర్". "రెలిజియస్ ఫ్యానటిక్"గా వర్ణిస్తారు. అతడు రిఫార్మిస్ట్ (సంస్కరణవాది) కాదు. 2009 ప్రొటెస్టర్లపై క్రాక్‌డౌన్‌లో కీలక పాత్ర పోషించాడు. అమెరికా వంటి దేశాలు ఇరాన్‌ను "రెలిజియస్ ఫ్యానటిక్ లూనటిక్స్"గా పిలుస్తూ, అతడిని మరింత రాడికల్‌గా చూస్తాయి. మతపరమైన కఠినత్వం అతడి రాజకీయాలకు మూలం. మానవ హక్కులంటే పెద్దగా ఆసక్తి లేదు. థియోక్రటిక్ రూల్ (మతపాలిత పాలన)ను ప్రోత్సహిస్తాడు. తన తండ్రి కంటే మరింత ఛాందసంగా ఉంటాడని విమర్శకులు అంటారు.
బయటి ప్రపంచం ఆయన్ను ఎలా అర్థం చేసుకోవాలి?
బయటి ప్రపంచం మొజ్తబా ఖమేనీని "షాడో ప్రిన్స్" (తెర వెనుక రాజు) లేదా "రీక్లూసివ్ హార్డ్‌లైనర్" (కనిపించని మతతత్వ వాది)గా చూస్తుంది. అతడు దశాబ్దాలుగా గుప్తంగా IRGC (రెవల్యూషనరీ గార్డ్స్), ఇంటెలిజెన్స్‌ను నియంత్రించి, ఇస్లామిక్ రిపబ్లిక్ "ప్యాథాలజీలు" (theocratic rule, human rights abuses, anti-Western stance)లకు అనుకూల సంకేతాలు ఇచ్చారు. అలీ ఖమేనీ మరణం తర్వాత సప్రీమ్ లీడర్ అయినందున ఇప్పుడు ఎలా ఉంటారనేది ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికైతే ఆయన్ను "ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి"గా పిలుస్తున్నారు. పాలస్తీనా మద్దతుదారు. కానీ పాశ్చాత్య దేశాలు అతడిని మరింత రాడికల్, వారసత్వ పాలన (dynastic rule)కు సంకేతంగా భావిస్తాయి. మార్పుకు వ్యతిరేకి అని బయటిప్రపంచం ముద్ర వేసినా తాను నమ్మిన సిద్ధాంతానికి, స్థిరత్వానికి కట్టుబడి ఉండే వ్యక్తిగా ఇస్లాం క్లెరిక్స్ చెబుతారు.
సర్వోన్నత లీడర్ గా రాణించగలరా?
మొజ్తబా ఖమేనీ తండ్రి అలీ ఖమేనీ మరణం (2026 ఫిబ్రవరి 28) తర్వాత ఇరాన్ సర్వోన్నత నాయకుడిగా (Supreme Leader) ఎదిగారు. ఇక ఈయన చెప్పిందే వేదం కావొచ్చు. అతడు దశాబ్దాలుగా తండ్రి చాటు బిడ్డగా చాలా కీలక నిర్ణయాల్లో పాలుపంచుకున్నారు. "షాడో లీడర్"గా పిలుస్తుంటారు. ఇరాన్‌లోని ఎక్స్‌పర్ట్ అసెంబ్లీ (Assembly of Experts) చివరికి ఆయనకే మొగ్గు చూపింది. కొంతమంది వ్యతిరేకులు మాత్రం అతడి పాలనను "వారసత్వ రాజ్యం"గా చూస్తున్నారు. ఇరాన్ సంప్రదాయాలకు ఇది విరుద్ధం అని చెబుతున్నారు.
Next Story

