Natanz enrichment facility
x
ఇరాన్ లోని ప్రధాన అణు కేంద్రం- నాటాంజ్

ఇరాన్ అణుకేంద్రంపై దాడి జరిగిందా? అయితే విపత్తే..

తమ అణు కేంద్రం- నాటాంజ్ (Natanz enrichment facility)పై అమెరికా-ఇజ్రాయెల్ దాడి చేసినట్టు ఇరాన్ ఆరోపించింది.


ఇరాన్ ప్రధాన అణు కేంద్రం- నాటాంజ్ (Natanz enrichment facility)పై అమెరికా-ఇజ్రాయెల్ దాడి చేశాయా? అవునని ఇరాన్ చెబుతుండగా ఐక్యరాజ్యసమితి అణు నిఘా సంస్థ IAEA (International Atomic Energy Agency) మాత్రం తోసిపుచ్చింది. ఇరాన్ ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యం లేదని తెలిపింది.
ఇరాన్ రాయబారి రెజా నజాఫి IAEA బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మీటింగ్‌లో మాట్లాడుతూ “ఆదివారం మళ్లీ మా శాంతియుత, సురక్షిత అణు సౌకర్యాలపై దాడి జరిగింది. నాటాంజ్‌పై దాడి జరిగింది. ఇది చట్టవిరుద్ధం, నేరపూరిత అనారిక చర్య. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందనేది పూర్తి అబద్ధం” అని ఆరోపించారు. ఇరాన్ అణు సంస్థ అధికారి లేఖ ద్వారా IAEAకు సమాచారం ఇచ్చినట్టు చెప్పారు. కానీ IAEA డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రాస్సీ (Rafael Grossi) స్పష్టంగా తిరస్కరించారు. “ఇరాన్‌లోని ఏ అణు సౌకర్యాల కేంద్రం పైనా (నాటాంజ్ సహా) దాడి జరిగినట్టు ఎలాంటి సంకేతాలు లేవు. ఎలాంటి డ్యామేజ్ లేదు. సరిహద్దు దేశాల్లో రేడియేషన్ స్థాయిలు పెరగలేదు. ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం, కానీ ఇంకా స్పందన రాలేదు” అని తెలిపారు.

అమెరికా, ఇజ్రాయెల్ ఈ ఆరోపణలను ఇంతవరకు ధృవీకరించలేదు గాని తిరస్కరించలేదు. గత జూన్ 2025లో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో నాటాంజ్‌పై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు IAEA డ్యామేజ్ ధృవీకరించింది. కానీ ఇప్పుడు (మార్చి 1-2, 2026) జరిగిన దాడుల్లో అణు సైట్లు లక్ష్యంగా లేవని IAEA అంచనా.
ఈ ఆరోపణలు ఇరాన్ మీద అమెరికా-ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చాయి. ఇరాన్ మరణాల సంఖ్య 555కు చేరిందని ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ తెలిపింది. పరిస్థితి ఇంకా టెన్షన్‌లో ఉంది. IAEA అణు సౌకర్యాలపై దాడులు రేడియో యాక్టివ్ లీక్‌కు దారితీయవచ్చని హెచ్చరించింది.
(సోర్సెస్: Reuters, Al Jazeera, Washington Post, IAEA అధికారిక స్టేట్‌మెంట్స్ — మార్చి 2, 2026 తాజా అప్‌డేట్స్ ఆధారంగా)
దాడి జరిగితే ఏమవుతుందంటే..
నిజంగా నాటాంజ్ (Natanz) వంటి అణు కేంద్రంపై దాడి జరిగి రేడియోయాక్టివ్ లీక్ (radiological release) జరిగితే, దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉండవచ్. IAEA డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రాస్సీ హెచ్చరించినట్టు, ఇది తీవ్ర పరిణామాలకు (grave consequences)కు దారితీస్తుంది.
ప్రధానంగా, యురేనియం హెక్సాఫ్లోరైడ్ (UF6) గ్యాస్, ఎన్‌రిచ్‌డ్ యురేనియం, ఇతర కెమికల్స్ విడుదల అవుతాయి. ఇది రేడియోయాక్టివ్ కంటామినేషన్ (alpha particles నుంచి), కెమికల్ టాక్సిసిటీ (ఫ్లోరైడ్ కాంపౌండ్స్ వల్ల తీవ్రమైన దురద, కళ్లంట నీరు కారడం) కలిగిస్తుంది. ఆ చుట్టుపక్కల ఉన్నవారికి ఊపిరాడకపోవడం తరచూ వస్తుంది. ఊపిరితిత్తులు, కడుపులో పేగులు దెబ్బతిని క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. బయటకు లీక్ అయితే (గాలి ద్వారా లేదా నీటి ద్వారా), పరిసర ప్రాంతాల్లో (కొన్ని కిలోమీటర్లు లేదా మేజర్ సిటీల పరిమాణంలో) ఖాళీ చేయాల్సి ఉంటుంది. రేడియేషన్ ఎక్స్‌పోజర్ వల్ల అనీమియా, ఇమ్యూనిటీ డౌన్, జెనెటిక్ డ్యామేజ్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇది సరిహద్దు దేశాలకు (ఇరాక్, పాకిస్తాన్, గల్ఫ్ దేశాలు) కూడా వ్యాప్తి చెందవచ్చు. పర్యావరణం దెబ్బతింటుంది.
గత దాడుల్లో (2025 జూన్) లీక్ వరకే పరిమితమైంది. బయటకు రాలేదు. కానీ ఈసారి పరిస్థితి చేయి దాటిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది రష్యాలోని చెర్నోబిల్ అణు కేంద్రం లాంటి విస్పోటనం స్థాయికి చేరకపోయినా ప్రాణ నష్టం తీవ్రంగానే ఉండవచ్చు. ఇదెప్పుడూ జరక్కూడదు అని IAEA హెచ్చరిస్తోంది. దాడి జరిగితే స్థానికంగా తక్షణ రిస్క్ ఎంత అనేది ఊహించలేం.

Read More
Next Story