మాదక ద్రవ్యాల ఉత్పత్తి దేశంగా భారత్: ట్రంప్
x
అమెరికా అధ్యక్షుడు ట్రంప్

మాదక ద్రవ్యాల ఉత్పత్తి దేశంగా భారత్: ట్రంప్

ప్రపంచ వ్యాప్తంగా 23 దేశాలు అక్రమంగా డ్రగ్స్ ను ఉత్పత్తి చేస్తున్నాయని కాంగ్రెస్ కు నివేదిక


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ సహ పాక్, చైనా, ఆప్ఘనిస్తాన్ లాంటి 23 దేశాలను మాదక ద్రవ్యాల( డ్రగ్స్) రవాణా, ప్రధాన అక్రమ మాదక ద్రవ్యాల ఉత్పత్తి దేశాలని పేర్కొన్నారు.

ఇది అక్రమంగా రసాయనాలు, మొదలైన వాటితో డ్రగ్స్ తయారు చేస్తూ అమెరికా, దాని పౌరులకు ముప్పు కలిగిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ కు సోమవారం సమర్పించిన అధ్యక్ష నిర్ణయంలో ట్రంప్ ఈ జాబితాలో 23 దేశాలను ప్రధాన మాదక ద్రవ్యాల ఉత్త్పత్తి దేశాలుగా అభివర్ణించారు.

ఆఫ్ఘనిస్తాన్, బహమాస్, బెలిజ్, బొలివియా, బర్మా, చైనా, కొలంబియా, కోస్టారికా, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వేడార్, ఎల్ సాల్వడార్, గ్వాటేమలా, హైతీ, హోండూరాస్, ఇండియా, జమైకా, లావోస్, మెక్సికో, నికరాగ్వా పాకిస్తాన్, పనామా, పెరు, వెనిజువెలా ఉన్నాయి. ట్రంప్ ఈ దేశాల జాబితాను కాంగ్రెస్ కు అందజేసి అమెరికాలోకి అక్రమ మాదకద్రవ్యాల సోర్సింగ్ , రవాణా చేయడానికి బాధ్యత వహిస్తున్నాయని వైట్ హౌజ్ తెలిపింది.
ఈ 23 దేశాల జాబితాలో అధ్యక్షుడి నిర్ణయాన్ని అమెరికా విదేశాంగ వెల్లడించింది. ఇందులో ఐదు దేశాలు ఆఫ్ఘనిస్తాన్, బొలివియా, బర్మా, కొలంబియా, వెనిజువెలా వీటిని అరికట్టడంలో విఫలం అయ్యాయని పేర్కొంది.
అక్రమ మాదక ద్రవ్యాలను అమెరికాకు సరఫరా చేయడం వలన అమెరికా భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే జాబితాలో దేశం ఉండటం ఆ దేశం మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రయత్నాలను లేదా అమెరికాతో సహకార స్థాయిని ప్రతిబింబించదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
గత ఏడాదిలో ఆఫ్ఘనిస్తాన్, బొలివియా, బర్మా, కొలంబియా, వెనిజువెలా దేశాలు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక ఒప్పందాల ప్రకారం తమ బాధ్యతలను పాటించడంలో విఫలం అయ్యాయని ట్రంప్ ఆరోపించారు.
అతిపెద్ద వనరు చైనానే..
అక్రమ ఫెంటానిల్ ఉత్పత్తికి ఆజ్యం పోసే రసాయనాలకు ప్రపంచం కేంద్రంగా చైనా మారిందని ట్రంప్ అన్నారు. నైటాజిన్లు, మెథాంపెటమైన్ వంటి ఇతర సింథటిక్ మాదక ద్రవ్యాలకు చైనా ప్రధాన సరఫరాదారు అని కూడా ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘చైనా నాయకులు ఈ రసాయనాల ప్రవాహాలను తగ్గించడానికి, వాటికి దోహదపడే మాదక ద్రవ్యాల నేరస్థులను విచారించడానికి బలమైన, నిరంతర చర్య తీసుకోవాలి’’ అని ట్రంప్ డిమాండ్ చేశారు.
తాలిబన్లు అక్రమ మాదక ద్రవ్యాలపై నిషేధం ప్రకటించినప్పటికీ మాదక ద్రవ్యాల నిల్వలు, కొనసాగుతున్న ఉత్పత్తి-మెథాంఫెటమన్ ఉత్పత్తిని విస్తరించడం సహ అంతర్జాతీయ మార్కెట్లకు మాదక ద్రవ్యాల ప్రవాహాన్ని కొనసాగించాయని ట్రంప్ అన్నారు.
‘‘ఈ మాదక ద్రవ్యాల వ్యాపారం నుంచి వచ్చే ఆదాయం అంతర్జాతీయ నేర గ్రూపులకు నిధులు సమకూరుస్తున్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తుంది. తాలిబన్ లోని కొంతమంది సభ్యులు ఈ వ్యాపారం నుంచి లాభం పొందడం కొనసాగించారు.
యునైటైడ్ స్టేట్స్ ప్రయోజనాలక, అంతర్జాతీయ భద్రతకకు తీవ్రమైన ముప్పులు ఉన్నందున ఆఫ్ఘనిస్తాన్ తన మాదక ద్రవ్యాల నియంత్రణ బాధ్యతలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని నేను మరోసారి చెబుతున్నాను’’ అని ట్రంప్ అన్నారు.
అంతర్జాతీయ వ్యవస్థీకృత ముఠాలు ఫెంటానిల్ వంటి నిషేధిత మాదక ద్రవ్యాలను అమెరికాలోకి రవాణా చేయడం వల్ల జాతీయ అత్యవసర పరిస్థితి ఏర్పడిందని 18 నుంచి 44 సంవత్సరాల వయస్సు గల అమెరికన్లకు ప్రజా ఆరోగ్య సంక్షోభం ఏర్పడిందని ఆయన అన్నారు.


Read More
Next Story