పస లేని ట్రంప్ ప్రసంగం, ఉసూరన్న అమెరికా జనం!
x

పస లేని ట్రంప్ ప్రసంగం, ఉసూరన్న అమెరికా జనం!

"ఈ యుద్ధాన్ని సాగనివ్వను..అది నాకే సాధ్యం, అంతులేని యుద్ధాలకు కాలం చెల్లింది": ట్రంప్


ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఎదురుచూసినంత సేపు పట్టలేదు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగం ముచ్చట... కేవలం 20 నిమిషాల్లో తన ప్రసంగాన్ని ముగించారు. ఈ సందేశం కోసమేనా 24 గంటల పాటు.. అదిగో ట్రంప్ మాట్లాడతారు, ఇదిగో ట్రంప్ మాట్లాడతారు- అని ఊదరగొట్టారు అని నెటిజన్లు అప్పుడే సెటైర్లు వేస్తున్నారు.

అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాధినేతలు వీళ్లే..

ఏదైనా మంచి శుభవార్తో, ఘాటైన హెచ్చరికో వస్తుందనుకున్న వాళ్లకు ఇది నిరాశ మిగిల్చిందనే వ్యాఖ్యలూ వినపడుతున్నాయి. అమెరికాలో వెల్లువెత్తుతున్న నిరసనకారులను శాంతింపజేసేందుకు చేసిన ప్రయత్నంగా కనిపించింది.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ మేఘాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ ప్రజలను ఉద్దేశించి కొద్దిసేపటి కిందట (ఏప్రిల్ 2 ఉదయం 6.30 గంటలకు) ఆయన ప్రసంగించారు. ప్రస్తుత అస్థిరతకు ముగింపు పలికే బాధ్యత తనదేనని ప్రకటించారు. ముఖ్యంగా ఇరాన్ ప్రమేయంతో సాగుతున్న ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ.. "అంతులేని యుద్ధాల కాలం చెల్లింది" అని ఆయన స్పష్టం చేశారు.
ట్రంప్ తన ప్రసంగంలో ప్రధానంగా మూడు అంశాలను నొక్కి చెప్పారు. మొదటిది, యుద్ధాన్ని సాగదీయకుండా రెండు మూడు వారాల్లోనే ఒక కొలిక్కి తీసుకురావడం. రెండోది, ఇరాన్ వంటి దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ద్వారా ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా చేయడం. మూడోది, అమెరికన్ల రక్తం, సంపద పరాయి దేశాల గడ్డపై వృధా కాకూడదని గట్టిగా ప్రతిజ్ఞ చేయడం.
గతంలో ఇరాన్ సంబంధిత ఉద్రిక్తతలు 33 రోజుల్లోనే సద్దుమణిగిన దాఖలాలను ఉదాహరిస్తూ, సరైన నాయకత్వం ఉంటే ఏదైనా సాధ్యమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

డొనాల్డ్ ట్రంప్ పూర్తి ప్రసంగ పాఠం..

"నా ప్రియమైన అమెరికన్ ప్రజలారా..
ఈ రోజు మన ప్రపంచం అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉంది. బలహీనమైన నాయకత్వం వల్ల మనం మూడవ ప్రపంచ యుద్ధం అంచున నిలబడ్డాం. కానీ నేను మీకు ఒక మాట ఇస్తున్నాను.. ఈ యుద్ధాన్ని నేను సాగనివ్వను. నా ఆధ్వర్యంలో, నా నాయకత్వంలో ఈ రక్తపాతం అతి త్వరలోనే ముగిసిపోతుంది.
చరిత్రను ఒక్కసారి చూడండి. మిగతా యుద్ధాలు దశాబ్దాల పాటు సాగితే, ఇరాన్ ఉద్రిక్తతలు గతంలో కేవలం 33 రోజుల్లోనే ఒక కొలిక్కి వచ్చాయి. ఎందుకంటే అప్పుడు నాయకత్వానికి ఏం చేయాలో తెలుసు. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరాన్ దగ్గర చిల్లిగవ్వ లేదు. వారు హమాస్‌కు గానీ, హెజ్బొల్లాకు గానీ ఒక్క డాలర్ కూడా పంపలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే మనం వారిపై 'తట్టుకోలేని స్థాయిలో ఒత్తిడి'ని ప్రయోగించాం.
కానీ ఈ రోజు పరిస్థితి దారుణంగా ఉంది. మన ప్రస్తుత ప్రభుత్వం వారికి బిలియన్ల కొద్దీ డాలర్లను ధారపోసింది. ఆ డబ్బే ఇప్పుడు బాంబులుగా మారి అమాయకులపై పడుతోంది. నేను మీకు ఇస్తున్న వాగ్దానం ఇదే.. నేను అధికారంలోకి వచ్చిన రెండు మూడు వారాల్లోనే ఈ యుద్ధ వాతావరణాన్ని తుడిచిపెట్టేస్తాను. ఇది నా నుంచి మీకు అందుతున్న గ్యారెంటీ.
మనం మళ్ళీ అమెరికాను శక్తివంతంగా మార్చాలి. మన సరిహద్దులను రక్షించుకోవాలి. పరాయి దేశాల గొడవల కోసం మన ప్రజల సంపదను తగలేయడం ఇకపై జరగదు. శాంతి అనేది శక్తి ద్వారానే వస్తుంది, బలహీనత ద్వారా కాదు. మనం మళ్ళీ గెలుస్తాం, ప్రపంచంలో శాంతిని నెలకొల్పుతాం.
ధన్యవాదాలు.
దేవుడు అమెరికాను దీవించుగాక!"
ఈ ప్రసంగంలో ట్రంప్ తన పాత వ్యూహమైన "America First" విధానాన్ని మరోసారి ప్రజల ముందుకు తెచ్చారు. యుద్ధాన్ని ముగించడానికి ఆయన చెబుతున్న 'రెండు మూడు వారాల' గడువు ఒక రకమైన రాజకీయ వ్యూహం. యుద్ధం వల్ల అలసిపోయిన సామాన్య అమెరికన్లను ఆకట్టుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. కొత్త విషయాలు లేకపోయినా, "నేను వస్తేనే శాంతి" అనే సందేశాన్ని ఆయన ప్రజల్లోకి పంపగలిగారు.
Read More
Next Story