దేశ ఆర్థిక సంస్థలపై పాక్ గురి పెట్టిందా?
x
పాకిస్తాన్ జనరల్ అసిమ్ మునీర్

దేశ ఆర్థిక సంస్థలపై పాక్ గురి పెట్టిందా?

యూఎస్ లో మునీర్ వ్యాఖ్యల వెనక ఉన్న అర్థమేమిటీ?


పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ నిన్న ఫ్లోరిడాలో ప్రవాస పాకిస్తాన్ తో మాట్లాడుతూ.. భారత్ కు అణు హెచ్చరికలతో పాటు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానినీ కూడా టార్గెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

భవిష్యత్ లో భారత్ తో సైనిక సంఘర్షణ తలెత్తితే గుజరాత్ లో ఉన్న జామ్ నగర్ రిఫైనరీని తమ లక్ష్యంగా చేసుకుంటామని బెదిరించినట్లు తెలిసింది. ఇది దేశంలో ఉన్న ఆర్థిక ఆస్తులను దెబ్బతీసే వ్యూహంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ముఖేష్ అంబానీకి బెదిరింపులు..
ఫ్లోరిడాలోని టంపాలో జరిగిన క్లోజ్డ్ డోర్ డిన్నర్ లో హజరైన వారిని ఉద్దేశిస్తూ మునీర్ మాట్లాడారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఫోటోతో పాటు ఖురాన్ సురా ఉన్న సోషల్ మీడియా పోస్టును ప్రస్తావించారు.
భారత్ తో ఈ సారి సైనిక ఘర్షణ తలెత్తితే దానిని నాశనం చేస్తామని పరోక్షంగా హెచ్చరించారు. ‘‘మేము తదుపరిసారి ఏమి చేస్తామో వారికి చూపించడానికి నేను అధికారం చేపట్టాను’’ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ సైట్ శుద్ది కర్మాగారం అయిన జామ్ నగర్, దేశంపు ఆర్థిక బలం, శుద్ది సామర్థ్యాన్ని తెలియజేస్తోంది.
ఆర్థిక బలంపై దృష్టి..
తన ప్రసంగంలో భారత్ పై అణు హెచ్చరికలు సైతం చేశారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు ఇంతకుముందు ఇదే వ్యూహాన్ని అమలు చేశాయి. 2008 లో దేశ ఆర్థిక రాజధాని ముంబై పై లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడి చేశారు.
ఇప్పుడు ఇదే మాట పాకిస్తాన్ సైనిక జనరల్ నోటీ వెంట వచ్చింది. భవిష్యత్ లో భారత్ కు సంబంధించిన ఆర్థిక ఆస్తులపై ముఖ్యంగా చమురు స్థావరాలను లక్ష్యంగా చేసుకోవాలనే పాకిస్తాన్ ఉద్దేశ్యాన్ని మొదటిసారిగా బయటపెట్టింది.
పాక్ కేంద్రంగా పనిచేస్తున్న పలు ఉగ్రవాద సంస్థలు ఇటువంటి ఆర్థిక ఆస్తులను తమ లక్ష్యంగా చేసుకున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. మునీర్ ప్రస్తుతం అంబానినీ లక్ష్యంగా చేసుకోవడం, భారత ఆర్థిక శక్తి, వృద్ధితో బిలియనీర్ కు ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది.
జామ్ నగర్ నుంచి ఏటా 33 మిలియన్ టన్నుల ముడి చమురును ప్రాసెస్ చేస్తుంది. ఇద భారత మొత్తం శుద్ధి సామర్థ్యంలో దాదాపు 12 శాతానికి సమానం. ఇక్కడ నుంచి పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి.
సూట్ లో ఒసామా..
మునీర్ వ్యాఖ్యలకు ముఖ్యంగా అతని అణ్వాయుధ బెదిరింపును మాజీ పెంటగాన్ విశ్లేషకుడు మైఖేల్ రూబిన్ తీవ్రంగా స్పందించారు. మునీర్ ను సూట్ లో ఉన్న ఒసామా బిన్ లాడెన్ అని ముద్ర వేశారు. ఇటువంటి అణు బెదిరింపులు పాకిస్తాన్ ఒక దేశంగా తన చట్టబద్దత హక్కు కోల్పోయిందని నిరూపిస్తున్నాయని ఆయన అన్నారు.
‘‘పాకిస్తాన్ క్షీణిస్తే అది సగం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది’’ అని మునీర్ హెచ్చరించాడని రూబిన్ ఆరోపించారు. ఈ వైఖరి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద మూక మాట్లాడే భాషల ఉందని అన్నారు. నాటోయేతర ప్రధాన మిత్రదేశంగా పాకిస్తాన్ కు ఉన్న హోదాను తొలగించడం, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశంగా దానిని ప్రకటించడం, మునీర్ ను నాన్ గ్రేటాగా ప్రకటించడం వంటి తక్షణ దౌత్యపరమైన పరిణామాలు అమెరికా తీసుకోవాలని రూబిన్ డిమాండ్ చేశాడు.
ఈ కార్యక్రమంపై అమెరికా నుంచి సత్వర స్పందన లేకపోవడాన్ని కూడా ఆయన విమర్శించారు. మునీర్ ను నిమిషాల్లోనే బయటకు తీసుకెళ్లి పాకిస్తాన్ కు తిరిగి విమానంలో పంపించి ఉండాల్సిందని ఆయన అన్నారు.


Read More
Next Story