
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ప్రతి పౌరుడికి రెండు వేల డాలర్ల లాభం చేకూరింది: ట్రంప్
సుంకాల విధింపును సమర్థించుకున్న డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన విధానాలను మరోసారి గట్టిగా సమర్థించుకున్నారు. ప్రపంచ దేశాలపై ఏకపక్షంగా చేసిన టారిఫ్ లతో అమెరికా ప్రపంచంలోనే అత్యంత ధనిక, గౌరవనీయమైన దేశంగా మార్చాయని చెప్పుకున్నారు.
తనను, తన విధానాలను విమర్శించిన వారిని ట్రంప్ మూర్ఖులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పరిపాలనలో సేకరించిన సుంకాల ఆదాయం నుంచి ధనవంతులు తప్ప ప్రతి అమెరికన్ త్వరలో కనీసం రెండు వేల డాలర్లు లాభం పొందుతారని పేర్కొన్నారు.
సుంకాలు, అప్పులు, డివిడెండ్లు..
ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావాలను చూపుతున్న సుంకాల విధానం వల్ల నష్టం జరుగుతోందని ఆరోపిస్తూ కొంతమంది ఉదారవాద, లెప్టిస్ట్ వాదులు అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు సుంకాల విధింపు చట్టబద్దతను ప్రశ్నించిన తరువాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘సుంకాలు వ్యతిరేకించే వారు మూర్ఖులు. ఇప్పుడు మనం ప్రపంచంలోనే అత్యంత ధనిక శక్తి. గౌరవనీయమైన దేశంగా ఉన్నాము. ద్రవ్యోల్భణం లేదు. రికార్డ్ స్ఠాయిలో స్టాక్ మార్కెట్లు పెరుగుతున్నాయి.
401 కే లు ఎప్పుడూ దాటలేదు. అమెరికా ట్రిలియన్ డాలర్లను తీసుకుంటోంది. త్వరంలో దేశ రుణమైన 37 ట్రిలియన్ డాలర్లను చెల్లించడం ప్రారంభిస్తాము’’ అని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో ట్వీట్ చేశారు.
దేశంలో పెట్టుబడుల ప్రవాహాం కొనసాగుతోందని, ఫ్యాక్టరీలు పెరుగుతున్నాయని ట్రంప్ చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్క అమెరికన్ కి(ధనవంతులు కాదు) రెండు వేల డాలర్ల డివిడెంట్ చెల్లించే ప్రణాళికలు ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. దేశంలోకి పెట్టుబడులు వెల్లువలా రావడానికి తన సుంకాల విధానమే అని సొంతంగా మరోసారి క్రెడిట్ ఇచ్చుకున్నారు.
కొనసాగింపు..
ప్రపంచ వాణిజ్యాన్ని ట్రంప్ దెబ్బతీస్తున్నారని అంతర్జాతీయ స్థాయిలో అనేక విమర్శలు వెల్లువెత్తినప్పటికీ ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ వివాదాస్పద విధానాలను సమర్ధించుకుంటున్నారు. సుంకాలు విధించే అధికార పరిధి ఆయన లేనప్పటికీ దొడ్డిదారిలో వాటిని విధిస్తున్నారు. వీటిపై విమర్శలు చేస్తున్న వారిపై ఆయన ఎదురుదాడికి దిగుతున్నారు.
‘‘యూఎస్ అధ్యక్షుడికి విదేశాలతో అన్ని వ్యాపారాలు ఆపడానికి అధికారం ఉంది. ఒక విదేశానికి లైసెన్స్ ఇవ్వడానికి , కానీ జాతీయ భద్రత ప్రయోజనాల కోసం కూడా ఒక విదేశంపై సాధారణ సుంకం విధించడానికి అనుమతి ఉండదు’’ అని ఆయన రాశారు.
కొన్ని దేశాలు మన దేశంపై సుంకాలు విధించవచ్చు కానీ మనం మాత్రం విధించడానికి వీలులేదా? సుంకాల కారణంగానే అమెరికాలోకి వ్యాపారాలు వెల్లువలా వస్తున్నాయని అన్నారు. యుఎస్ తన దేశ సుప్రీంకోర్టుకు ఇది చెప్పలేదా? అసలు ఏం జరుగుతోంది అని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతవారం అమెరికా అధ్యక్షుడు విధించిన సుంకాలు రాజ్యాంగబద్దమైనవా కాదా అని దాఖలైన కేసులను సుప్రీంకోర్టు విచారించింది. మాజీ అధ్యక్షుడు తన రాజ్యాంగ అధికారాన్ని అధిగమించి, విధులు నిర్వర్తించడానికి 1977 అత్యవసర చట్టాన్ని అమలు చేయడం ద్వారా కాంగ్రెస్ అధికారాలను ఉల్లంఘించారా? అనే విషయంలో కోర్టు పరిశీలిస్తోంది.
Next Story

