
పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్
‘‘ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాక్ ను దేవుడే కాపాడాడు’’
నిజం ఒప్పుకున్న పాక్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్
చాలాకాలం తరువాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ నోటివెంట నిజం భయటకు వచ్చింది. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా తమ దేశాన్ని దైవమే కాపాడిందని మునీర్ అన్నారు. సరిహద్దు దాటి పాకిస్తాన్ లోకి చొరబడుతున్న ఉగ్రవాదుల్లో ఎక్కువ మంది ఆఫ్ఘన్ జాతీయులేనని విమర్శించారు. పాకిస్తాన్ లేదా టీటీపీ ఎవరూ కావాలో తేల్చుకోవాలని ఆఫ్ఘన్ తాలిబన్ పాలకులను హెచ్చరించాడు.
ఏప్రిల్ లో జమ్మూకశ్మీర్ లోని పహల్గాం బైసరన్ గడ్డి మైదానాల్లో సేద తీరుతున్న పర్యాటకుల్లో హిందువులను గుర్తించి వారి భార్యల ముందే భర్తలను కాల్చిచంపారు. దీనికి ప్రతీకారంగా భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్ ను ప్రారంభించింది.
పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ సహ పాకిస్తాన్ ప్రధాన భూభాగంలోని తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై భారీ దాడులు చేసింది. ఇందులో కనీసం వందమంది ఉగ్రవాదులు మరణించారు. దీనితో పాక్- భారత్ మధ్య సైనిక వివాదం ప్రారంభం అయింది.
ఈ సమయంలో క్షిపణులు, డ్రోన్ లతో భారత సైనిక మౌలిక, ప్రజలే లక్ష్యంగా పాక్ దాడులకు దిగింది. కానీ భారత వైమానిక దళం ఈ దాడులను విజయవంతంగా తిప్పికొట్టింది.
ఇక్కడితో ఆగకుండా పాక్ కీలకమైన వైమానిక స్థావరాలు, రాడార్ కేంద్రాలపై దాడి చేసింది. సర్గోటా లోని పాక్ న్యూక్లియర్ కేంద్రాలపై కూడా బ్రహ్మోస్ క్షిపణులతో విరుచుకుపడింది. రెండు దేశాల మధ్య మే10 న కాల్పుల విరమణ కుదిరింది.
పాకిస్తాన్ లేదా టీటీపీ నా?
ఆప్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వారే పాక్ లో ఉగ్రవాదం ప్రబలుతోందని మునీర్ ఆరోపించారు. టీటీపీ కార్యకలాపాల్లో 70 శాతం ఆఫ్ఘన్లు ఉన్నారని విమర్శించారు. ‘‘ఆప్ఘనిస్తాన్ మన పాకిస్తానీ పిల్లల రక్తాన్ని చిందించలేదా?’’ అని మునీర్ అన్నారు.
ఇస్లామిక్ రాజ్యంలో వాళ్లు తప్ప మరెవరూ జిహాద్ ప్రకటించకూడదని అన్నారు. ‘‘ అధికారం ఉన్నవారి ఆదేశం, అనుమతి, సంకల్పం లేకుండా ఎవరూ జిహాద్ కోసం ఫత్వా జారీ చేయలేరు’’ అని మునీర్ అన్నారు.
పాక్ సైన్యం సిద్దంగా ఉంది
అంతకుముందు పాకిస్తాన్ రక్షణ దళాలు బాహ్య, అంతర్జాతీయ సరిహద్దు నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని మునీర్ అన్నారు. శత్రు హైబ్రిడ్ యుద్ధం, తీవ్రవాద కథనాలు, జాతీయ సమైక్యతను లక్ష్యంగా చేసుకుని అస్థిరపరిచే శక్తులు అంతర్గత, బాహ్య సవాళ్లను పరిష్కరించడంపై సైన్యం దృష్టి సారించిందని ఆయన పునరుద్ఘాటించారు.
అధికారులు, తమ దళాల ధైర్యాన్ని, వృత్తి నైపుణ్యాన్ని ప్రశంసించారు. ఫీల్డ్ వ్యాయామం, సిమ్యూలేటర్ ఆధారిత శిక్షణను పరిశీలించారు. సమకాలీన యుద్ధానికి సాంకేతిక అనుకూలత, వేగం, కచ్చితత్వం, సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యమని ఆయన అన్నారు.
Next Story

