ఓర్పును పరీక్షించొద్దు.. హద్దుమీరితే తగిన బుద్ధి చెబుతాం..
x

ఓర్పును పరీక్షించొద్దు.. హద్దుమీరితే తగిన బుద్ధి చెబుతాం..

పాక్‌కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ వార్నింగ్..


‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) పేరిట బుధవారం తెల్లవారుఝామున భారత సాయుధ దళాలు పాకిస్థాన్(Pakistan), పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులతో దాడులు చేశాయి. ఉగ్రవాద సంస్థలు జైషే మహమ్మద్, లష్కరే తోయిబాను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల్లో సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో గురువారం జరిగిన నేషనల్ క్వాలిటీ కాంక్లేవ్‌–2025లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath) భారత బలగాల ప్రతిభను కొనియాడారు. పౌరులకు ఏ మాత్రం హాని కలగకుండా కేవలం తొమ్మిది ఉగ్ర శిభిరాలను ధ్వంసం చేసిన వైమానిక దళాన్ని ప్రశంసించారు. ఇదే సందర్భంలో పాక్‌కు మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ‘‘భారతదేశం ఎప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. తమ సహనాన్ని పరీక్షించిన వారికి తగిన బుద్ధి చెబుతాం.’’ అని హెచ్చరించారు. రక్షణ రంగంలో స్వావలంబన కోసం ప్రధాని మోదీ కృషి చేశారని, 2014 నుంచి రక్షణ ఉత్పత్తి రంగ సాధికారతకు ఆయన ప్రాధాన్యం ఇచ్చారని గుర్తుచేశారు.

Read More
Next Story