
తైవాన్
తైవాన్ కు అతి దగ్గరగా చైనా సైనిక విన్యాసాలు
జస్టిస్ మిషన్ -2025 పేరిట దుందుడుకు చర్యలు
చైనా మరోసారి తైవాన్ ను రెచ్చగొట్టే విధంగా సైనిక విన్యాసాలు ప్రారంభించింది. రెండు దేశాల మధ్య సైనిక వివాదం తలెత్తితే బాహ్య ప్రపంచం నుంచి దానికి అందే సైనిక సాయం అందకుండా చేసే లక్ష్యంతో కమ్యూనిస్టు దేశం ఈ సైనిక విన్యాసాలు చేస్తోంది.
పీపుల్ లిబరేషన్ ఆర్మీ తూర్పు థియోటర్ కమాండ్, తైవాన్ ను చుట్టుముట్టడానికి ప్రత్యక్ష కాల్పులు జరపడానికి, భూమి, సముద్రంపై ఉన్న వస్తువులను లక్ష్యంగా చేసుకోవడానికి, ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించబడే ద్వీపంలో ప్రధాన ఓడరేవులను దిగ్భందించడానికి ప్రత్యేకంగా కసరత్తులు చేస్తున్నారు.
దీనికే ‘జస్టిస్ మిషన్-2025’ అని పేరు పెట్టారు. ఈ సైనిక వ్యాయమాల కోసం యుద్ధనౌకలు, ఫిరంగులు, యుద్ధ విమానాల వంటి బలగాలను మెహరించినట్లు రాయిటర్స్ నివేదించింది.
డిసెంబర్ 30 వరకూ సైనిక విన్యాసాలు..
చైనా మారిటైమ్ సేప్టీ అడ్మినిస్ట్రేషన్ నియమించిన ఏడు జోన్లలో మంగళవారం లైవ్ ఫైరింగ్ విన్యాసాలు కొనసాగనున్నాయి. అయితే మునుపటి విన్యాసాలతో పోలిస్తే ఇవి తైవాన్ ప్రధాన భూభాగానికి చాలా దగ్గర జరిగాయి. ఈ విన్యాసాలు ఇంతకుముందు కంటే పెద్దవి. ప్రారంభంలో చైనా సైన్యం ఫిరంగి కాల్పులు ప్రారంభించింది.
‘‘తైవాన్ స్వాతంత్య్రం’’ వేర్పాటువాద కార్యకలాపాలు, బాహ్య జోక్యాన్ని లక్ష్యంగా చేసుకుని సైనిక విన్యాసాలు జరిగాయని చైనా ప్రభుత్వ ప్రతినిధి సోమవారం చెప్పారని ఆ దేశ అధికార ప్రతినిధి రాష్ట్ర వార్తా సంస్థ జిన్హువా నివేదించింది.
అమెరికా, జపాన్ లకు హెచ్చరికలు..
చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ.. పేరు తెలియని బాహ్య శక్తులు ఈ ప్రాంతాన్ని యుద్దం అంచుకు తీసుకెళ్లాయని ఆరోపించారు.
గత మూడు సంవత్సరాలలో తైవాన్ చుట్టూ చైనా నిర్వహిస్తున్న ఆరవ ప్రధాన యుద్ధ విన్యాసం అయిన ప్రస్తుత విన్యాసాలు, డొనాల్డ్ ట్రంప్ పరిపాలన తైవాన్ తో 11 బిలియన్ డాలర్ల విలువైన రికార్డు ఆయుధ అమ్మకపు ఒప్పందాన్ని ఆమెదించిన కొద్దిరోజులకే ఈ చర్య ప్రారంభం అయింది. అమెరికా ఆయుధాలు అమ్మిన కొద్ది రోజులకే చైనా బోయింగ్ తో సహ అమెరికన్ రక్షణ సంస్థలపై ప్రతీకారంగా ఆంక్షలు విధించింది.
తైవాన్, జపాన్ నాయకులు కూడా చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. చైనా దాడులను ఎదుర్కోవడానికి ద్వీపదేశం రక్షణను బలోపేతం చేయడానికి తైవాన్ అధ్యక్షుడు లీ చింగ్ టే ఇటీవల చేసిన ప్రకటన బీజింగ్ ను చికాకుపడింది.
చైనా తైవాన్ పై దాడి ప్రారంభిస్తే తన దేశం సైనికపరంగా పాల్గొనవచ్చని జపాన్ ప్రధానమంత్రి సనే తకైచీ ప్రకటించారు. దీనిపై కూడా చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది.
తీవ్రంగా స్పందించిన తైవాన్..
చైనా సైనిక విన్యాసాలపై తైవాన్ కూడా స్పందించింది. బీజింగ్ చర్యలను అస్థిరపరిచేవిగా అభివర్ణించింది. ద్వీప దేశంలోని ఒక సీనియర్ భద్రతా అధికారి రాయిటర్స్ తో మాట్లాడుతూ... అనేక చైనా సైనిక పడవలు, విమానాలు తైవాన్ చుట్టూ తిరుగుతున్నాయి.
వాటిలో కొన్ని తీరప్రాంతాల నుంచి 24 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న తైవాన్ సమీప ప్రాంతంలో ఉద్దేశపూర్వకంగా చొరబడినట్లు ఆరోపించారు. మంగళవారం జరిగే విన్యసాల వల్ల అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించే లక్ష మందికి పైగా ప్రయాణికులు ప్రభావితమవుతున్నారని, దాదాపు 80 దేశీయ విమానాలు రద్దు చేసినట్లు తైవాన్ రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.
తైవాన్ అధ్యక్ష కార్యాలయ ప్రతినిధి కరెన్ కువో, బీజింగ్ హేతుబద్దత పాటించాలని కోరారు. జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతిస్పందన కేంద్రాన్నిఏర్పాటు చేసిందని, చైనా విన్యాసాలకు ప్రతిస్పందనగా దళాలను పంపినట్లు తెలిపింది.
Next Story

