ఐదు శాతం దాటిన చైనా వృద్దిరేటు
x

ఐదు శాతం దాటిన చైనా వృద్దిరేటు

రెండో త్రైమాసికంలో ఫుంజుకున్నకమ్యూనిస్టు ఆర్థిక వ్యవస్థ, కొట్టిపారేస్తున్న స్వతంత్య్ర పరిశీలకులు


అమెరికా- చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమవుతున్న తరుణంలో చైనా బలమైన వృద్దిరేటు నమోదు చేసిందని ఆ దేశ ప్రభుత్వం మంగళవారం తెలిపింది. గత త్రైమాసికం మొత్తం ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ 5.2 శాతం వేగంతో వృద్ది సాధించిందని వెల్లడించింది.

జనవరి - మార్చి లో ఇది 5.4 శాతం వార్షిక వృద్ది సాధిస్తుందని, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన కమ్యూనిస్టు దేశం 1.1 శాతం విస్తరించిందని ప్రభుత్వం తెలిపింది.
ఈ సంవత్సరం మొదటి అర్థభాగంలో చైనా ఆర్థిక వ్యవస్థ 5.3 శాతం వార్షిక వేగంతో వృద్ది చెందిందని అధికారిక డేటా చూపిస్తుంది. అయితే కొంతమంది విశ్లేషకులు మాత్రం దీనిని కొట్టిపడేశారు. వాస్తవ వృద్దిరేటు ఇంకా తక్కువగా ఉండి ఉంటుందని అంచనా వేస్తున్నారు. చైనాకు అంకెలను మానిపులేడ్ చేసే స్వభావం ఉందని చాలామంది విశ్లేషకుల అభిప్రాయం.
ఫ్యాక్టరీ పరికరాలు వంటి స్థిర ఆస్తులలో పెట్టుబడులు సంవత్సరం మొదటి అర్థభాగంలో కేవలం 2.8 శాతం మాత్రమే పెరిగాయని, ఇది మే నెలలో 2.9 శాతం వార్షిక వృద్దిని, జూన్ నెలలో కేవలం 0.5 శాతం పెరుగుదల సూచిస్తుందని క్యాపిటల్ ఎకనామిక్స్ చెందిన జిచున్ హువాంగ్ పేర్కొన్నారు.
క్యాపిటల్ ఎకనామిక్స్ కార్యకలాపాల ప్రాక్సీ ఏప్రిల్, మే నెలల్లో చైనా స్థూల దేశీయోత్పత్తి లేదా జీడీపీలో వృద్దిని సంవత్సరానికి నాలుగు శాతం కంటే తక్కువగా చూపిస్తుందని 2025 పూర్తి సంవత్సరానికి వార్షిక వృద్ది 3.5 శాతం అంచనా వేస్తుందని ఆమె చెప్పారు.
కానీ మిగిలిన కాలం మాత్రం ఆర్థిక వృద్ది సవాల్ గా ఉంటుందని తన నివేదికలో పేర్కొన్నారు. వార్షిక వృద్ది లక్ష్యాలను చేరుకోవడానికి రాజకీయ ఒత్తిడులు ఉన్నాయని తన నివేదికలో చెప్పినప్పటికీ జీడీపీ వృద్దిరేటు చాలా ఎక్కువగా ఉంటుందని ఆమె చెప్పారు.
వృద్దిరేటు పెరగడానికి బలమైన ఎగుమతులు ఒక ముఖ్యమైన అంశమని అన్నారు. చైనా నుంచి ఎగుమతులు జూన్ లో వేగవంతం అయ్యాయని, గత సంవత్సరం కంటే 5.8శాతం పెరిగాయని, మే నెలలో ఇది 4.8 శాతం పెరిగాయని తెలిపింది.
చైనా ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాలు ఉపశమనం లభించడంతో రెండు దేశాల మధ్య తిరిగి చర్చలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో కంపెనీలు, వినియోగదారుల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి.
ట్రంప్ పరిపాలన విధించిన అధిక సుంకాల ప్రభావాన్ని అధిగమించడానికి సహయపడుతూ చైనా కంపెనీలు ఇతర దేశాలకు ఎగుమతులను ఆష్ షోర్ తయారీని కూడా విస్తరించాయి.
‘‘చైనాలో చురుకైన ప్రభావవంతమైన విధానాలు రావడంతో జాతీయ ఆర్థిక వ్యవస్థ మంచి ఊపుతో స్థిరమైన వృద్దిని కొనసాగించి బలమైన శక్తిని ప్రదర్శించింది’’ అని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక పేర్కొంది.
ఎగుమతులు పెరుగుతున్నప్పటికి చైనాలో అంతర్గత వినియోగం మాత్రం తగ్గుతోందని నివేదిక బయటపెట్టింది. వినియోగదారుల ధరలలో 0.1 శాతం తగ్గుదల దేశీయ డిమాండ్ లో నిరంతర బలహీనతను చూపించింది. ఇది చైనా జనాభా తగ్గుతూ వృద్దాప్యం చెందుతున్నందున పాలక కమ్యూనిస్టు పార్టీకి దీర్ఘకాలిక సవాల్ గా మారింది. కోవిడ్ తరువాత ఈ సమస్యలు తీవ్రం అయ్యాయి.
గత సంవత్సరం వృద్దికి అనుగుణంగా ఈ సంవత్సరం చైనా నాయకులు 5 శాతం వృద్ది లక్ష్యాన్ని నిర్దేశించారు. వాషింగ్టన్, బీజింగ్ మధ్య ఆగష్టు 12 నాటికి కొత్త వాణిజ్య ఒప్పందం కుదరకపోతే యూఎస్ తిరిగి 245 శాతం సుంకాలు విధించే అవకాశం ఉంది. ఇది తిరిగి ఎగుమతులను దెబ్బతీసే అవకాశం ఉంది.


Read More
Next Story