నాలుగు నెలల్లో 85 వేల వీసాలు అందజేసిన చైనా
x

నాలుగు నెలల్లో 85 వేల వీసాలు అందజేసిన చైనా

భారత పర్యాటకులు, విద్యార్థులకు అనేక ఆఫర్లు ప్రకటించిన బీజింగ్


భారత్ లోని చైనా రాయబార కార్యాలయం జనవరి 1 నుంచి ఏప్రిల్ 9 మధ్య భారతీయ పౌరులకు 85 వేలకు పైగా వీసాలు జారీ చేసినట్లు వెల్లడించింది. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను పెంచే ముఖ్యమైన అడుగుగా ఆ కార్యాలయం అధికారులు చెప్పారు.

చైనా రాయబారీ ‘జు ఫీహాంగ్’, ఒక సోషల్ మీడియా పోస్ట్ లో చైనా సంస్కృతిని అన్వేషించడానికి ఎక్కువమంది భారతీయులు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారని తెలిపారు. చైనాకు ఎక్కువ మంది భారతీయులు వెళ్లడం ‘‘ సురక్షితమైన, నిజాయితీ, స్నేహపూర్వక’’ గమ్యస్థానంగా తమ దేశం మారిందని అభివర్ణించారు.
చైనాలో పర్యటకాన్ని ప్రొత్సహించడానికి, రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడేందుకు ప్రయాణీకులకు ప్రధాన వీసా సడలింపులను ప్రకటించింది. అవి ఈవిధంగా ఉన్నాయి.
1. వీసా కేంద్రాలలో దరఖాస్తులను సమర్పించడానికి ముందస్తు అపాయింట్ మెంట్ అవసరం లేదు.
2. స్వల్పకాలిక సందర్శకులకు బయోమెట్రిక్ మినహాయింపు
3. వీసా రుసుముల తగ్గింపు, ప్రయాణాన్ని మరింత సరమైనదిగా మార్పు
4. వేగవంతమైన ప్రాసెసింగ్ సమయాలు, వ్యాపార, విశ్రాంతి ప్రయాణీకులకు మేలు
వూహాన్ వైరస్ విజృంభణ తరువాత చైనాలో విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. ఇప్పుడు వాటిని క్రమంగా తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ముఖ్యంగా భారతీయ విద్యార్థులు, పర్యాటకులు, నిపుణులకు చైనాను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. చైనా తన సాంస్కృతిక గొప్పతనాన్ని, కాలానుగుణ వైభవాలు, ఆకర్షణలు, ప్రసిద్ద పండుగలు, గమ్యస్థానాలను ప్రదర్శించడం ద్వారా భారతీయ పర్యాటకులను ఆకర్షించే లక్ష్యం నిర్దేశించుకుంది.
ఆర్థిక సంఘీభావం..
అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో చైనా, భారత్ తో సహకారం పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ట్రంప్ చేస్తున్న సుంకాల యుద్దం తీవ్రతకు బీజింగ్ ఎకానమీ కుప్పకూలే స్థితికి చేరుకునేలా ఉంది.
చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యు జింగ్ మాట్లాడుతూ.. భారత్- చైనా ఆర్థిక, వాణిజ్య సంబంధాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఏకపక్షవాదం, రక్షణవాదాన్ని ప్రతిఘటించాలని, తమతో ఢిల్లీ చేతులు కలపాలని కోరుతున్నారు.
‘‘వాణిజ్య సుంకాల యుద్దాలలో విజేతలు ఉండరు’’ అని ఆమె చెప్పారు. అమెరికా విధించిన సుంకాలకు ఉమ్మడి ప్రతిఘటన అనే ఆలోచనను ప్రొత్సహించారు.
విశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నాలు..
వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి(ఎల్ఏసీ) లో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ అధికారులు సరిహద్దు, వాణిజ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో పూర్తి విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవడం ఓ మృదువైన వ్యూహంగా భావిస్తున్నారు. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు చైనా విశ్వవిద్యాలయాలకు తిరిగి వచ్చినప్పుడూ సాంస్కృతిక, విద్యా సంబంధాలను బలోపేతం చేయడం ఈ విస్తృత వ్యూహంలో ఒక భాగం.
మనదేశంలో సరైన మెడికల్ ర్యాంకు లభించక విదేశాలలో ఎంబీబీఎస్ చేయాలనుకునే వారికి చైనా ప్రధాన గమ్యస్థానంగా ఉంది. ఇక్కడ భారత్ కు చెందిన వేలాది మంది మెడిసిన్స్ చదువుతున్నారు. అయితే కరోనా వైరస్ విజృంభణ తరువాత విధించిన ప్రయాణ ఆంక్షలు అక్కడ మెడిసిన్ చదవడానికి ప్రధాన అడ్డంకిగా మారాయి.
ఇప్పుడు బీజింగ్ వాటిని తొలగించి వేగంగా వీసాలు జారీ చేస్తుండటంతో తిరిగి చదువుకోవడానికి భారతీయ విద్యార్థులు అక్కడికి తిరిగి వెళ్లడానికి మార్గం సుగమం అయింది.


Read More
Next Story