
అజిత్ ధోవల్ తో కెనడా ఎన్ఎస్ఏ నథాలి డ్రౌయిన్
అజిత్ ధోవల్ తో భేటీ అయిన కెనడా ఎన్ఎస్ఏ
ఇరు దేశాల ఎన్ఎస్ఏల చర్చలు సఫలం అయినట్లు విదేశాంగ ప్రకటన
భారత్- కెనడా సంబంధాలను తిరిగి గాడినపడుతున్నాయి. రెండు దేశాలకు సంబంధించిన జాతీయ భద్రతాా సలహదారులు ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఉగ్రవాదం, అంతర్జాతీయ నేరాలను ఎదుర్కోవడంలో కలిసి పనిచేయడం వంటి సహకార విధానాన్ని అవలంబించడం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి భారత్, కెనడా అంగీకరించాయని విదేశాంగమంత్రిత్వశాఖ శనివారం తెలిపింది.
సిక్కు వేర్పాటువాద పార్టీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందని 2023 లో అప్పటి ప్రధాని ట్రూడ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తెగిపోయాయి.
కెనడియన్ కౌంటర్ తో..
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, కెనడా భద్రతా సలహదారు నథాలి డ్రౌయిన్ మధ్య ఢిల్లీలో ఈ సమావేశం జరిగింది. జస్టిస్ ట్రూడో ప్రధానమంత్రిగా ఉన్నకాలంలో తీవ్ర ఇబ్బందుల్లో పడిన ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్దరించడం ఈ చర్చల లక్ష్యం.
‘‘ద్వైపాక్షిక సంబంధాలలో కొత్త అధ్యాయం వైపు ముందుకు సాగడానికి, సహకార విధానాన్ని అవలంబించడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి’’ అని ఎంఈఏ పేర్కొంది.
జూన్ లో కెనడాలో కననాస్కిస్ లో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీతో చర్చలు జరిపారు. భారత్- కెనడా సంబంధాలలో స్థిరత్వాన్ని పునరుద్దరించడానికి నిర్మాణాత్మక చర్యలను అనుసరించడానికి ఇరువురు నాయకులు అంగీకరించారు.
ప్రధానమంత్రి మోదీ, కెనడా ప్రధాని కార్నీ మధ్య జరిగిన చర్చలను అనుసరించడానికి ఇది ఒక అవకాశం అని దోవల్- డ్రౌయిన్ చర్చలపై ఎంఈఏ తెలిపింది.
విశ్వాసం పునర్నిర్మాణం..
‘‘రాజకీయ నాయకత్వంలోని అత్యున్నత స్థాయిలలో విశ్వాసాన్ని పునర్నిర్మించడం, సహకారాన్ని విస్తరించడం కోసం స్పష్టమైన కోసం స్పష్టమైన వేగాన్ని రెండు వైపులా అంగీకరించాయి’’ అని సంయుక్త ప్రకటనలో తెలిపింది.
రెండు దేశాల ఎన్ఎస్ఏల మధ్య జరిగిన చర్చలు ఫలవంతమైనవి అని రెండు దేశాలు ప్రకటించాయి. ఎంఈఏ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడం, నిఘా మార్పిడి వంటి కీలకమైన ద్వైపాక్షిక అంశాలను ఈ చర్చలు కవర్ చేశాయని పేర్కొంది.
రెండు దేశాల మధ్య ఇప్పుడున్న సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం, భద్రత, సహకారం పెంపొందించుకోవడం ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై అభిప్రాయాలను మార్పిడి చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి.
దౌత్య సంబంధాలలో క్షీణత..
భారత్, కెనడా లు పరస్పరం వారి రాజధానులలో రాయబారులను నియమించుకున్నాయి. ఇది జరిగిన మూడు వారాల తరువాత రెండు ఎన్ఎస్ఏల మధ్య చర్చలు జరిగాయి.
గత అక్టోబర్ లో ఒట్టావా, నిజ్జార్ కేసుతో తమ హైకమిషనర్, మరో ఐదుగురు దౌత్యవేత్తలపై ఆరోపణలు చేసిన తరువాత భారత్ వారిని వెంటనే వెనక్కి పిలిపించింది. భారత్ కూడా కెనడియన్ దౌత్యవేత్తలను బహిష్కరించింది.
అయితే ఏప్రిలో లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికలలో లిబరల్ పార్టీ నాయకుడు కార్నీ భారీ మెజారిటీతో విజయం సాధించాడు. ఈ విజయంతో ఆయన భారత్-కెనడా సంబంధాలను పునరుద్దరించే ప్రక్రియను అది నాంది పలికింది.
Next Story