90 కిలో మీట‌ర్ల వేగంతో న‌దిలో దూసుకెళ్లిన బ‌స్సు
x

90 కిలో మీట‌ర్ల వేగంతో న‌దిలో దూసుకెళ్లిన బ‌స్సు

నేపాల్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం, 18 మంది మృతి


Click the Play button to hear this message in audio format


నేపాల్ లో జరిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో 18 మంది మృత్యువాత‌ప‌డ్డారు. 26 మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ఓవర్ స్పీడ్ తో వచ్చిన బస్సు అదే వేగంతో త్రిశూల్ నదీలోకి దూసుకెళ్లడంతో ఈ విపత్తు సంభవించింది.
పోఖరా నుంచి కాఠ్మాండు వెళ్తున్నబ‌స్సు గజూరి సమీపంలోని త్రిశూలి నదిలో పడిపోవడంతో 18 మంది మరణించారు. ప్రస్తుతం సహాయ‌క‌ చర్యలు కొనసాగుతున్నాయి.
సుమారు 90 కి.మీ వేగంతో రాత్రి 1.30 గంటల సమయంలో త్రిశూలి నదిలోకి దూసుకెళ్లిందని ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ప్రతినిధి బిష్ణు ప్రసాద్ భట్ట తెలిపారు. ఈ ప్రమాదంలో గాయ‌ప‌డ్డ ప్ర‌యాణికుల‌కు చికిత్స కొన‌సాగ‌గుతుంద‌ని ఆయ‌న తెలిపారు. భట్ట తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాద స్థలంలో నుంచి 17 మృతదేహాలు వెలికితీశారు. గాయపడిన 28 మంది క్ష‌త‌గాత్రుల‌ను ర‌క్షించారు..
గాయపడిన వారిని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రక్షణ చర్యల కోసం నేపాల్ ఆర్మీ, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, నేపాల్ పోలీసు స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.
మరణించిన వారిలో ఒకరు న్యూజీలాండ్‌కు చెందిన వ్య‌క్తి ఉన్నాడు. గాయపడిన వారిలో జపాన్‌కు చెందిన ఒక మహిళ, నెదర్లాండ్స్‌కు చెందిన మ‌రో మహిళ ఉన్నారు.
Read More
Next Story