బ్రిక్స్ సమ్మిట్: ఎజెండాను భారత్ నిర్ణయించే స్థాయికి చేరిందా?
x
బ్రిక్స్ సమ్మిట్

బ్రిక్స్ సమ్మిట్: ఎజెండాను భారత్ నిర్ణయించే స్థాయికి చేరిందా?

సమావేశానికి హాజరుకానీ షీ జిన్ పింగ్, వ్లాదిమిర్ పుతిన్


బ్రిక్స్ నాయకులు బ్రెజిల్ లో జరుగుతున్న శిఖరాగ్ర సమావేశానికి హజరయ్యారు. ఈ సమావేశాలకు చైనా, రష్యా అధినేతలు హాజరుకాలేదు. ఇది దాని బలం, భవిష్యత్ పై చర్చను రేకెత్తించింది.

ఫెడరల్ కన్సల్టింగ్ ఎడిటర్ కే ఎస్ దక్షిణామూర్తి బ్రిక్స్ ప్రాధాన్యం, భారత్ నాయకత్వం, గ్లోబల్ సౌత్ కోసం ముందుకు సాగే మార్గం గురించి వివరించారు.


బ్రిక్స్ గ్రూపు నేడు సందర్బోచితంగా ఉందా?
బ్రిక్స్ ప్రభావం ఎంతమేరకు ఉందనేది చర్చనీయాంశమైనప్పటికీ, ఇది ఇప్పటి కాలానికి అనుగుణంగానే ఉంది. ఈ గ్రూపు గ్లోబల్ సౌత్ స్వరాన్ని బలంగా వినిపించే ప్రయత్నం చేస్తోంది. లేకపోతే పక్కన పెట్టబడుతున్న అనేక సమస్యలను లేవనెత్తే వ్యవస్థ లేకుండా పోతుంది.
ఇటీవల ప్రపంచ సంక్షోభాలు అయిన గాజా వివాదం, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధాలు వంటివి బ్రిక్స్ పరిమితులను బయటపెట్టాయి. వీటిని పరిష్కరించడంలో బ్రిక్స్ ఎలాంటి పాత్రను పోషించలేకపోయింది. ఈ వేదికకు సామర్థ్యం ఉన్నప్పటికీ దానిని మరింత ప్రభావవంతంగా చేయడం అనేది సభ్యదేశాలు పనిచేయడం పై ఆధారపడి ఉంటుంది.
బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ ఉగ్రవాద వ్యతిరేక ప్రభావం ఏమిటీ? పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులపై ఐరాస ఆంక్షలను అడ్డుకున్న చైనా వంటి దేశాలను ఇది ప్రభావితం చేస్తుందా?
పహల్గామ్ దాడి తరువాత బ్రిక్స్ ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అది సమూహం సమష్టితత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం ముఖ్యంగా పాకిస్తాన్ తో ముడిపడి ఉన్న సీమాంతర ఉగ్రవాదంపై మోదీ దృష్టి భారత్ దీర్ఘకాలిక ఆందోళనలు ప్రతిబింబిస్తుంది.
ఏ దేశము ఉగ్రవాదాన్ని బహిరంగంగా సమర్థించనప్పటికీ రాజకీయ సంక్లిష్టతలు, ప్రతిస్పందనలు రూపొందిస్తుంటాయి. ఉగ్రవాదం ఇప్పుడు ఒక సమస్యగా మిగిలిపోయింది. బ్రిక్స్ దానిని ఖండించినప్పటికీ, అన్ని సభ్యదేశాలను భారత్ ఏకతాటిపై తీసుకురాగలిగింది.
జిన్ పింగ్, పుతిన్ లేకపోవడంతో బ్రిక్స్ ఎజెండాను రూపొందించడంలో భారత్ ప్రభావంగా వ్యవహరించిందా?
షీ జిన్ పింగ్, పుతిన్ లేకపోవడం సాంకేతికంగా బాగుంది. యుద్ధ నేరాల ఆరోపణల కారణంగా పుతిన్ ఈ సమ్మిట్ కు దూరంగా ఉన్నారు. షీ తన ప్రతినిధి పంపాడు. చైనా, రష్యా రెండు ప్రాతినిధ్యం వహించాయి, పాల్గొన్నాయి. పుతిన్ వీడియో ద్వారా ప్రసంగించారు. వారు లేకపోవడం వలన బ్రిక్స్ ప్రాధాన్యం తగ్గలేదు. భారత్ అందరి దృష్టిని ఆకర్షించింది.
ప్రపంచ సంస్థలలో గ్లోబల్ సౌత్ ప్రాతినిధ్యం ఉండాలని మోదీ వాదించారు. ఇది బ్రిక్స్ కు ఎలా ఉపయోగం?
ప్రపంచ సంస్థలలో దక్షిణ దేశాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించే ఆందోళనలకు బ్రిక్స్ ఒక వేదికగా నిలుస్తోంది. అలాగే బ్రిక్స్ విస్తరణకు కొత్త స్వరాలను అందిస్తోంది.
అయితే ఎక్కువ మంది సభ్యులు ఉంటే అది ప్రభావవంతంగా ఉండదు. సమూహం చీలిపోయే ప్రమాదం ఉంది. బ్రిక్స్ ను ప్రభావవంతంగా ఉంచడానికి నాయకులు స్పష్టమైన వ్యూహాన్ని నిర్వహించడం చాలా ముఖ్యం.
బ్రిక్స్ అభివృద్ది చెందుతోంది.. అదే స్థాయిలో దాని ప్రభావం పెరుగుతోందా?
బ్రిక్స్ ను విస్తరించే అవకాశం ఉంది. ట్రంప్ అనుసరిస్తున్న రక్షణాత్మక వాదం, బ్రిక్స్ దేశాలపై అదనపు టారిఫ్ ల విధిస్తామనే బెదిరింపు వీటికి కారణం. బ్రిక్స్ విస్తరిస్తే ఇటువంటి బెదిరింపులను ఎదుర్కొనే అవకాశం ఉంది.
కానీ దాని విస్తరణ దాని వేగాన్ని ప్రభావితం చేయరాదు. ప్రపంచ నాయకులు పెద్ద సవాళ్లు, నాయకుల స్పష్టత, ఉద్దేశం తో బ్రిక్స్ నడిపిస్తేనే ఈ కూటమి విజయవంతం అవుతుంది.
Read More
Next Story