ఆరు సంవత్సరాల తరువాత అమెరికా మళ్లీ షట్ డౌన్
x
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

ఆరు సంవత్సరాల తరువాత అమెరికా మళ్లీ షట్ డౌన్

కీలక బిల్లుల విషయంలో రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య కుదరని ఏకాభిప్రాయం


అమెరికా ప్రభుత్వం మరోసారి షట్ డౌన్ అయింది. రిపబ్లికన్ల మద్దతుతో కూడిన స్టాప్ గ్యాప్ ఫండింగ్ బిల్లును డెమోక్రాట్లు తిరస్కరించడంతో అమెరికా ప్రభుత్వం అధికారికంగా షట్ డౌన్ అయింది.

అర్థరాత్రితో నిధుల గడువు ముగియడంతో ప్రభుత్వ కార్యకలాపాలు ఆగిపోయాయి. చట్టసభ సభ్యులు ఎవరూ పట్టు వీడకపోవడంతో కాపిటల్ హిల్ లో అనిశ్చితి నెలకొంది.

గడచిన ఆరు సంవత్సరాలలో మొదటి సారిగా ప్రభుత్వం షట్ డౌన్ అయింది. కాంగ్రెస్ లో చివరి నిమిషంలో జరిగిన చర్చలలో కూడా రిపబ్లికన్లు, డెమోక్రాట్ల పై ఏకాభిప్రాయం రాలేదు.

వంద మంది సభ్యుల సెనెట్ లో నిధుల చట్టాన్ని ఆమోదించడానికి 60 ఓట్లు అవసరం. బిల్లును ఆమోదించడానికి రిపబ్లికన్లకు ఏడు ఓట్లు తక్కువ అయ్యాయి.

షట్ డౌన్ అంటే ఏంటీ?
అమెరికా ప్రభుత్వం తమ ఉద్యోగాలను మూసివేస్తే సైనిక సేవలతో సహ అవసరమైన సిబ్బంది జీతం లేకుండా పనిచేయాల్సి ఉంటుంది. అంతగా ముఖ్యం కానీ విభాగాలు మాత్రం సెలవులను ప్రకటిస్తారు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాశ్వత తొలగింపులను కొనసాగించకూడదని ఎంచుకున్నప్పటికీ కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం ప్రకారం 7,50,000 మంది కార్మికులు తాత్కాలికంగా ప్రభావితమవుతారు.
అయితే షట్ డౌన్ పై ఉద్రిక్తతలు పెంచే విధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే ఫెడరల్ ఉద్యోగులను శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించారు. సాంప్రదాయకంగా ప్రభుత్వం షట్ డౌన్ అయితే ఉద్యగులకు సెలవులు లభిస్తాయి. తిరిగి కార్యకలాపాలు ప్రారంభం కాగానే వారికి జీతాలు ఇస్తారు.
అమెరికా అంతటా షట్ డౌన్ ప్రభావితం కనిపిస్తోంది. డెమోక్రాట్లు, రిపబ్లికన్లూ ఇద్దరు సాధారణంగా వాటిని నివారించడానికి ప్రయత్నిస్తారు. మూసివేతలు జరిగినప్పడూ ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటారు. చరిత్రలో అతిపెద్ద షట్ డౌన్ ట్రంప్ పదవీకాలంలోనే జరిగింది. ఆయన మొదటిసారిగా అధ్యక్షుడిగా ఉన్న 2018 లో 35 రోజుల పాటు ప్రభుత్వ కార్యకలాపాలు ఆగిపోయాయి.
ఏమేమీ పనిచేస్తాయి..
ప్రభుత్వం షట్ డౌన్ అయినప్పటికీ అనేక కీలకమైన విధులు అంతరాయం లేకుండా కొనసాగుతాయి. వీటిలో నాసా అంతరిక్ష కార్యకలాపాలు, ట్రంప్ ఇమ్మిగ్రేషన్ అమలు చొరవలు, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, యూఎస్ వ్యవసాయ శాఖ నిర్వహించే ప్రజారోగ్య కార్యకలాపాలు జరుగుతాయి.
ఆసుపత్రి సంరక్షణ, సరిహద్దు భద్రత, ఎయిర్ ట్రాఫిక్ వంటి సేవలు నిరాటంకంగా నడుస్తాయి. సామాజిక భద్రరత, మెడికేర్ చెల్లింపులు ఇప్పటికే పంపిణీ చేయబడతాయి. అయితే కొత్త కార్డులు మాత్రం తాత్కాలికంగా నిలిపివేస్తారు.
షట్ డౌన్ వైపు..
సాయంత్రం ఓటింగ్ 55 నుంచి 45 వరకూ ఉంది. ఇది సమాఖ్య నిధుల గడువు సమీపిస్తున్నప్పటికీ రెండు పార్టీలు వెనక్కి తగ్గే అవకాశం లేదని చూపించింది. సెనెట్ ముందుకు వెళ్లి సమాఖ్య వ్యయాన్ని ఏడు వారాల పాటు పొడిగించే చర్యను ఆమోదించకపోతే, వార్షిక బడ్జెట్ బిల్లులను ఖరారు చేయడానికి శాసన సభ్యులకు అదనపు సమయం ఇవ్వకపోతే ప్రభుత్వ నిధులు ఉదయం 12.01 గంటలకు ముగియనున్నాయి.
షట్ డౌన్ కావడానికి కొన్ని గంటల ముందు సెనెట్ రిపబ్లికన్లు హౌజ్ ఆమోదించిన తాత్కాలిక నిధుల బిల్లును ఆమోదించడానికి ప్రయత్నించారు. అయితే అధ్యక్షుడు ట్రంప్ కు బిల్లు పంపడానికి అవసరమైన మెజారిటీ మాత్రం సాధించలేదు. దీనిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయో తొలగింపుల వల్ల ప్రభావితమయ్యే వారిలో చాలామంది డెమోక్రాట్లు ఉంటారని హెచ్చరించారు.
చీలిక..
అమెరికా షట్ డౌన్ అయినప్పటికీ ఇరుపక్షాలు రాజీ కుదుర్చుకోవడానికి మాత్రం అంగీకరించడం లేదని బ్లూమ్ బెర్గ్ నివేదించింది. బదులుగా షట్ డౌన్ కొనసాగితే తన పరిపాలన విభాగం చాలామంది ఉద్యోగులను తొలగిస్తుందని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.
సంక్షేమ పథకాలు కొనసాగించాలని, ఆరోగ్య సంరక్షణ ఖర్చులో వందల బిలియన్ డాలర్లను పునరుద్దరించాలని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రతిపాదనకు రిపబ్లికన్లు ఒప్పుకోవడం లేదు.


Read More
Next Story