
గల్ఫ్ గోల్డెన్ వీసా వార్తలన్నీ ఉత్త పుకార్లే
లక్ష దిర్హామ్స్ కు వీసా పొందవచ్చని వార్తలు
విదేశీయులు ఎవరైన గల్ప్ లో నివసించాలంటే లక్ష దిర్హామ్ లు( రూ. 23 లక్షలు) చెల్లించి గోల్డెన్ వీసా కొనుగోలు చేయవచ్చనే వార్తలను యూఏఈ తోసిపుచ్చింది. ఇవన్నీ తప్పుడు పుకార్లని ప్రకటించింది.
యూఏఈలోని స్థానిక ఈ మీడియా ఈ అంశానికి సంబంధించిన వార్తలను ప్రసారం చేసింది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్ షిప్ కస్టమ్స్, పోర్ట్ సెక్యూరిటీ ఈ వార్తలు తప్పుడు సమాచారంగా అభివర్ణించాయి.
చట్టపరమైన ఆధారాలు లేవు..
స్థానిక, అంతర్జాతీయ వెబ్ సైట్ లలో వ్యాపిస్తున్న ఈ వాదలకు ఎలాంటి చట్టపరమైన ఆధారం లేదు. యూఏఈలోని ఈ అధికారుల కోట్ లేకుండానే ప్రసారం చేశారని ఐసీపీ ఓ ప్రకటనలో తెలిపింది.
గోల్డెన్ వీసా పొందే వర్గాలు, షరతులు, నిబంధనలు అధికారిక చట్టాలు, మంత్రిత్వ నిర్ణయాలకు అనుగుణంగా స్పష్టంగా నిర్వచించబడ్డాయని ఐసీపీ స్పష్టం చేసింది.
ఆసక్తి గల వ్యక్తులు అథారిటీ వెబ్ సైట్ లేదా స్మార్ట్ అప్లికేషన్ లో అధికారిక సమాచారాన్ని పొందవచ్చని ఎమిరేట్స్ న్యూ ఏజెన్సీ బుధవారం తెలిపింది.
జూలై 6న యూఏఈ ప్రభుత్వం కొత్తరకం గోల్డెన్ వీసాను ప్రారంభించిందని వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. ఇది నామినేషన్ ఆధారంగా ఉంటుందని పేర్కొంది. అయితే కొన్ని షరతులతో ఆస్తి లేదా వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ప్రస్తుత పద్దతికి భిన్నంగా ఉంటుంది.
ఏ నివేదిక..
‘‘కొత్త నామినేషన్ ఆధారిత వీసా విధానం’’ కింద భారతీయులు ఇప్పుడు ఏఈడీ లక్ష దిర్హామ్ లు, రూ. 23 లక్షలు రుసుము చెల్లించడం ద్వారా యూఏఈ జీవితాంతం గోల్డెన్ వీసాను ఆస్వాదించవచ్చని లబ్దిదారులు ఈ ప్రక్రియలో పాల్గొన్న వ్యక్తులు వార్తా సంస్థకు తెలిపారు.
మూడు నెలల్లో 5 వేల మంది పైగా భారతీయుల ఈ నామినేషన్ ఆధారిత వీసా కోసం దరఖాస్తు చేసుకుంటారని వారు తెలిపారు.
నివేదిక ప్రకారం.. ఈ వీసాను తొలి దశలో భారత్, బంగ్లాదేశ్ ను ఎంపిక చేశారు. రాయద్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ రాయద్ కమల్ అయుబ్ మాట్లాడుతూ.. భారతీయులు యూఏఈ గోల్డెన్ వీసా పొందడానికి ఇది ఒక సువర్ణకాశమని అన్నారు.
‘‘ఈ గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడల్లా మేము ముందుగా వారి నేపథ్యాన్ని తనిఖీ చేస్తాము. ఇందులో యాంటీ మనీలాండరింగ్, క్రిమినల్ రికార్డ్ తనిఖీలు అలాగే వారి సోషల్ మీడియా కూడా ఉంటాయి’’ అని రాయద్ కమల్ అన్నారు.
Next Story