
హనుమాన్ విగ్రహం
‘‘హిందు దేవుళ్లంతా తప్పుడు దేవతలే’’
రిపబ్లికన్ పార్టీ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు
ఉత్తర అమెరికాను ఆక్రమించి, అక్కడి స్థానిక రెడ్ ఇండియన్లను పొట్టన పెట్టుకుని, ఇప్పుడు శాంతి వచనాలు, సెక్యూలర్ నీతులు వల్లిస్తూ, రిలిజియన్ ఇన్ టాలరెన్స్ పేరుతో అమెరికా నివేదికలు విడుదల చేస్తుంది.
కానీ అప్పుడప్పుడు దాని నిజం స్వరూపం కొంతమంది నాయకుల రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. తాజాగా టెక్సాస్ లోని రిపబ్లికన్ పార్టీకి చెందిన ఓ నాయకుడు రామదూత ‘హనుమాన్’ విగ్రహ స్థాపనపై విషం చిమ్మే వ్యాఖ్యలు చేశారు.
టెక్సాస్ లోని ఒక తప్పుడు హిందూ దేవుడి విగ్రహాన్ని ఎందుకు పెడుతున్నారని రిపబ్లికన్ పార్టీ నాయకుడు అలెగ్జాండర్ డంకన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మనది క్రైస్తవ దేశంమని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
టెక్సాస్ కు ప్రాతినిధ్యం వహించడానికి సెనెట్ కు ఎన్నికల ఎన్నికలకు పోటీ చేస్తున్న రాజకీయ నాయకుడు.. బైబిల్ లోని కొన్ని వాక్యాలను ఉదహరించాడు. ‘‘నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. నీవు ఏ రకమైన విగ్రహాన్ని లేదా ఆకాశంలో లేదా భూమిపై లేదా సముద్రంలో ఉన్న దేని ప్రతిమను తయారు చేయకూడదు’’: నిర్గమకాండము 20:3-4 అంటూ పోస్ట్ చేశాడు.
తీవ్ర ప్రతిఘటన..
ఎక్స్ లో డంకన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను హిందూ అమెరికన్, హిందూ అమెరికన్ ఫౌండేషన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. వారు ఆయన వ్యాఖ్యలను ‘‘హిందూ వ్యతిరేకం, దెయ్యం పట్టిన వ్యాఖ్యలు’’ అని కామెంట్ వ్యాఖ్యలు చేశారు.
‘‘హలో టెక్సాస్ జీఓపీ, వివక్షకు వ్యతిరేకంగా మీ స్వంత మార్గదర్శకాలను బహిరంగంగా ఉల్లంఘించే, అసహ్యకరమైన హిందూ వ్యతిరేక ద్వేషాన్ని ప్రదర్శించే మీ పార్టీ సిద్దాంతాన్ని ఎస్టాబ్లిష్ మెంట్ క్లాజును అగౌరవపరిచేలా కామెంట్ చేసిన మీ పార్టీ సెనెట్ అభ్యర్థిని మీరు క్రమశిక్షణలో పెడతారా?’’ అని హిందూ అమెరికన్ ఫౌండేషన్ రిపబ్లికన్ పార్టీని ఉద్దేశించి ఎక్స్ లో ప్రశ్నించింది.
అమెరికా రాజ్యాంగం తమకు ఏ మతాన్ని అయినా ఆచరించే స్వేచ్ఛను ఇస్తుందని చాలామంది డంకన్ కు చాలామంది నెటిజన్లు గుర్తు చేశారు. ‘‘మనది విభిన్న మత విశ్వాసాలను కలిగి ఉన్నప్రజలతో నిండిన దేశం. దీనిని మత స్వేచ్ఛ అంటారు. ఒక మతాన్ని అనుసరించేవారు ఇతరులకు హనీ కలిగించపోతే లేదా అణచివేయకపోతే వారి మతం మన యూఎస్ రాజ్యాంగం ప్రకారం రక్షించబడుతుంది’’ అని పేర్కొంది.
‘‘ఎల్లప్పుడూ రిపబ్లిక్ కు ఓటు వేసే పౌరుడిగా, డంకన్ టెక్సాస్ జీఓపీ స్వేచ్ఛా, అందరికి అవకాశం సంప్రదాయవాద సూత్రాలను ఉల్లంఘిస్తున్నట్లు చూడటం బాధాకరం’’ అని యూఎస్ ఆధారిత వ్యవస్థాపకుడు తపేష్ యాదవ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
యూనియన్ విగ్రహం..
టెక్సాస్ లోన షుగర్ ల్యాండ్లోని శ్రీ అష్టలక్ష్మీ ఆలయంలో స్టాట్యూ ఆఫ్ యూనియన్ ఉత్తర అమెరికాలో ఎత్తైన హనుమాన్ విగ్రహాంగా చెప్పబడుతోంది. స్టాట్యూ ఆఫ్ యూనియన్ ఆలోచనను శ్రీ చిన్నజీయర్ స్వామిజీ అందించారు. ఆ విగ్రహాన్ని ఆగష్టు 18, 2024న ఆవిష్కరించారు. దీని పేరు రాముడిని సీతతో ఏకం చేయడంతో హనుమంతుడి పాత్రను సూచిస్తుంది. ఈ విగ్రహం భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా పనిచేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
Next Story