పెరిగిన విమాన చార్జీలు
x

పెరిగిన విమాన చార్జీలు

ఇంధన సర్‌ఛార్జీలను వసూలు చేస్తున్న ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్


Click the Play button to hear this message in audio format

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతోన్న యుద్ధం కారణంగా విమాన టిక్కెట్ ధరలు పెరిగాయి. ఇంధన కొరత, ధరల పెరుగుదలే అందుకు కారణం. గమ్యస్థానాలను బట్టి ఛార్జీలు రూ.425 నుండి రూ.2,300 వరకు ఉంటాయి. ఇండిగో విమానయాన సంస్థ మార్చి 14 నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన టిక్కెట్లపై రూ.425 నుంచి రూ.2,300 వరకు చార్జీలను పెంచింది. యూరప్, వెస్ట్ ఏషియా, సౌత్‌ ఈస్ట్ ఏషియా వెళ్లే ప్రయాణికులపై ఈ భారం పడనుంది.

"ఇంధన ధరల పెరుగుదలతో ఛార్జీల్లో సర్దుబాటు తప్పనిసరి. అయితే ప్రయాణికులపై అధిక భారం పడకుండా, చాలా తక్కువ మొత్తాన్ని ఇంధన ఛార్జీగా ప్రవేశపెట్టింది," అని ఎయిర్‌లైన్ తెలిపింది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మార్చి 10న టిక్కెట్లపై ఇంధన సర్‌ఛార్జీలను ప్రకటించిన విషయం తెలిసిందే.

Read More
Next Story