హుక్కా నిషేధం కాగితాలకే పరిమితమా?
x

హుక్కా నిషేధం కాగితాలకే పరిమితమా?

తమిళనాడులో కేఫ్‌లు, లాంజ్‌‌ల్లో యథేచ్ఛగా కొనసాగుతున్న దందా..


Click the Play button to hear this message in audio format

తమిళనాడు(Tamil Nadu)లో 2023 ఆగస్టు నుంచే హుక్కా(Hookah) బార్లపై నిషేధం అమలులో ఉంది. అయినప్పటికీ, రాష్ట్రంలో హుక్కా వినియోగం యథేచ్ఛగా సాగుతోంది. కొన్ని కేఫ్‌లు, లాంజ్‌లు, ప్రైవేట్ పార్లర్లు గుట్టుగా హుక్కా వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. యువకులను అలవాటు చేస్తున్నాయి. రెస్టారెంట్లు, కేఫ్‌లు, పబ్లిక్ ప్రదేశాల్లో హుక్కా వినియోగిస్తే మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 వేల వరకు జరిమానా విధిస్తారు. చెన్నై వంటి నగరాల్లో కొన్ని బార్‌లు, కేఫ్‌లు రహస్య గదుల్లో హుక్కాను అందిస్తున్నట్లు సమాచారం.

అది కూడా ప్రమాదమే..

మరోవైపు సోషల్ మీడియాలో “హెర్బల్ హుక్కా” సురక్షితమని పోస్టింగులు పెట్టి యువతను హుక్కా వినియోగానికి అలవాటుచేస్తున్నారు. అయితే ఇది కూడా హానికరమేనని పొగాకు వ్యతిరేక సంస్థలు చెబుతున్నాయి. చెన్నైలో ఇలాంటి పార్లర్లు 20కిపైగా ఉన్నాయని కొన్ని స్వచ్ఛంద సంస్థలు గుర్తించినా, అధికారుల చర్యలు మాత్రం తక్కువగానే ఉన్నాయని విమర్శలున్నాయి.


ఆన్‌లైన్‌లో విరివిగా..

హుక్కా పరికరాలను ఆన్‌లైన్‌లో దొరకడం ఆందోళన కలిగించే మరో అంశం. కొంతమంది యువకులు వీటిని ఆర్డర్ చేసి ఇంటికే తెప్పించుకుంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా వాడుతున్నారు.


హుక్కా ఎంత ప్రమాదకరం..

ఒక హుక్కా సెషన్ వంద సిగరెట్లు తాగడంతో సమానమని వైద్యులు చెబుతున్నారు. హుక్కాలో నికోటిన్, టార్, కార్బన్ మోనాక్సైడ్ లాంటి హానికారక పదార్థాలుంటాయి. దీర్ఘకాలిక హక్కు వినియోగం, క్యాన్సర్(Cancer), గుండె జబ్బులు, శ్వాసకోశ ఇబ్బందులకు దారి తీస్తుందని చెబుతున్నారు.

చర్యలేవి?

హుక్కా నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని, ఆన్‌లైన్ అమ్మకాలపై గట్టి పర్యవేక్షణ అవసరమని ఆరోగ్య కార్యకర్తలు కోరుతున్నారు. హుక్కా ట్రెండ్ కంటే యువత ఆరోగ్యం ముఖ్యమని వారు హెచ్చరిస్తున్నారు.

Read More
Next Story