వారణాసి ఎనౌన్సమెంట్ ...అల్లు అర్జున్ కి బిగ్ షాక్!
x

'వారణాసి' ఎనౌన్సమెంట్ ...అల్లు అర్జున్ కి బిగ్ షాక్!

రిలీజ్ డేట్ వాయిదా వెయ్యాలా?


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో రాబోయే 'AA22' ప్రాజెక్ట్ పై గ్లోబల్ వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. మల్టీవర్స్ (Multiverse) కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ ని 2027 సమ్మర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు బన్నీకి ఇద్దరు పెద్ద స్టార్స్ నుంచి ఊహించని షాక్ తగిలింది.

బన్నీని టెన్షన్ పెడుతున్న ఆ ఇద్దరు: 2027 సమ్మర్ రేస్ లో అల్లు అర్జున్ కంటే ముందే ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ తమ బెర్త్ లను కన్ఫర్మ్ చేసేసుకున్నారు.

రెబల్ స్టార్ ప్రభాస్: సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'స్పిరిట్' (Spirit) ని మార్చి 5న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు: దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న 'వారణాసి' (Varanasi) సినిమా ఏప్రిల్ 7న థియేటర్లలోకి దిగబోతోంది.

అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి?

సాధారణంగా ఇలాంటి భారీ సినిమాల మధ్య కనీసం ఒక నెల గ్యాప్ ఉండాలి. స్పిరిట్, వారణాసి మధ్య ఆ గ్యాప్ ఉంది. దీంతో మార్చి, ఏప్రిల్ నెలలు పూర్తిగా బ్లాక్ అయిపోయాయి. ఇప్పుడు అల్లు అర్జున్ కి మిగిలింది కేవలం మే (May) నెల మాత్రమే.

లేట్ చేస్తే డేంజర్!

ఇక్కడే బన్నీ టీమ్ కి అసలు చిక్కు వచ్చి పడింది. ఒకవేళ 'మే' నెలలో రిలీజ్ చేద్దామన్నా.. వెంటనే డేట్ అనౌన్స్ చేయకపోతే కష్టం. ఎందుకంటే వేరే ఏదైనా పాన్ ఇండియా సినిమా ఆ స్లాట్ ని బుక్ చేసుకుంటే అల్లు అర్జున్ కి సమ్మర్ విండో పూర్తిగా చేజారిపోతుంది. దీంతో AA22 టీమ్ డైలమాలో పడింది. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read More
Next Story