
అవార్డ్ బాయ్‌కాట్: ‘దురంధర్’ టీమ్ ఇచ్చిన షాక్!
ఇది కదా కౌంటర్ అంటే
బాక్సాఫీస్ దగ్గర రూ. 1200 కోట్లు కొల్లగొట్టి ‘దురంధర్’ సినిమా ఏ స్దాయిలో ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. థియేటర్లలో ఎనభై రోజులైనా రచ్చ చేస్తున్న ఈ స్పై థ్రిల్లర్ టీమ్, తాజాగా ఒక నేషనల్ అవార్డ్ ఈవెంట్‌కు ఇచ్చిన ‘ఝలక్’ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. అది సాదాసీదా ఝలక్ కాదు.. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఇలాగే ఉంటుందని చూపించిన పక్కా ప్లాన్డ్ స్ట్రోక్!
విషయంలోకి వెళ్తే.. ఇటీవలే ఒక పేరున్న ఇంటర్నేషనల్ మ్యాగజైన్ (THR) ఇండియా ఎడిషన్ గ్రాండ్‌గా అవార్డుల వేడుకను నిర్వహించింది. బాలీవుడ్ బడా స్టార్లు అందరూ అక్కడ వాలిపోయారు. దురంధర్ బ్లాక్ బస్టర్ హిట్ కాబట్టి, ఆ సినిమాకు అవార్డు అనౌన్స్ చేశారు. స్టేజి మీద యాంకర్ గొంతు చించుకుని ప్రశంసిస్తూ టీమ్‌ను పిలిచారు. కట్ చేస్తే.. అక్కడ సీన్ రివర్స్! హీరో లేడు, డైరెక్టర్ లేడు, కనీసం ప్రొడక్షన్ బాయ్ కూడా లేడు. పన్నెండు వందల కోట్ల వసూళ్ల సాక్షిగా ఆ స్టేజి వెలవెలబోయింది.
అసలు సెగ ఎక్కడ మొదలైంది?:
ఈ గైర్హాజరు వెనుక ఒక బలమైన కారణం ఉంది. సదరు మ్యాగజైన్ ఎడిటర్, పాపులర్ రివ్యూయర్ గతంలో ఈ సినిమాపై విషం చిమ్మారు. దురంధర్‌ను "యాంటీ పాకిస్తాన్ కంటెంట్" అని, చూడటం చాలా కష్టమని (A Tough Sit) విమర్శించారు. దేశభక్తిని తక్కువ చేసి చూపిస్తూ ఆమె చేసిన కామెంట్స్ అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. జనాల ఆగ్రహం తట్టుకోలేక ఆ రివ్యూ వీడియోను యూట్యూబ్ నుంచి డిలీట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అదే రివ్యూయర్ అవార్డు ఇస్తానంటే.. "నీ అవార్డు నీ దగ్గరే ఉంచుకో.. మాకు ఆడియన్స్ ప్రేమే ముఖ్యం" అన్నట్టుగా దురంధర్ బృందం గట్టి కౌంటర్ ఇచ్చింది.
మార్కెట్ హీట్.. టాక్సిక్‌తో వార్?:
మరోవైపు దురంధర్ పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మార్చి 19న రిలీజ్ ఫిక్స్ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్పీడందుకున్నాయి. అయితే ఇదే సమయంలో యశ్ ‘టాక్సిక్’ సినిమా కూడా రేసులో ఉండటం, థియేటర్ల బ్లాకింగ్‌లో అడ్వాన్స్‌గా ఉండటంతో ఇండస్ట్రీలో టెన్షన్ పెరిగింది. ఎమ్రాన్ హష్మీ ‘బడే సాబ్’గా రాబోతున్న ఈ సీక్వెల్‌లో పోటీ మామూలుగా ఉండదు. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి దురంధర్ 2 గట్టిగానే ప్లాన్ చేస్తోంది.
ఏదైమైనా...
సినిమా నచ్చలేదని చెప్పడం వేరు, కానీ దేశభక్తిని రాజకీయం చేస్తూ విమర్శించడం వేరు. దురంధర్ టీమ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు నేషనల్ వైడ్‌గా చర్చనీయాంశమైంది. అహంకారంతో రివ్యూలు ఇచ్చే వారికి ఈ ఇన్సిడెంట్ ఒక లెసన్ లాంటిదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి మార్చి 19న రాబోతున్న దురంధర్ 2, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలి!

