ఈ వారం OTTలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు
x

ఈ వారం OTTలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు

ఐదు భాషల బ్లాక్ బస్టర్ హిట్ ఈ వారమే!


ఇది సాధారణ OTT వీకెండ్ కాదు. “ఏం చూడాలి?” అన్న ప్రశ్న కాదు ఇప్పుడు… “ముందు ఏది ముందు చూడాలి?” అన్న టెన్షన్ మొదలైంది. Netflix, Prime Video, Jio Hotstar అన్నీ ఒక్కసారిగా భారీ కంటెంట్ దింపడంతో… ఈ వీకెండ్ సోఫా మీదే సినిమా ఫెస్టివల్ మొదలవుతోంది. ముఖ్యంగా థియేటర్లలో కోట్ల వసూళ్లు కొట్టిన సినిమా ఇప్పుడు మొబైల్‌లోకి దిగుతోంది.

బాక్సాఫీస్ ‘ధురంధర’డు వచ్చేస్తున్నాడు!

ఈ వీకెండ్ నెట్‌ఫ్లిక్స్‌లో బిగ్గెస్ట్ బాంబ్ పేలబోతోంది. 2026లో అతిపెద్ద హిట్‌గా నిలిచిన ‘ధురంధర్: ది రివెంజ్’ మే 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానున్న ఈ రివెంజ్ డ్రామా కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

ఒక్క “ధురంధర్” కోసం మిగతా రిలీజ్‌లు పక్కకు జరిగాయా?

స్ట్రీమింగ్ కి వస్తున్న Dhurandhar: The Revenge మీద ప్రస్తుతం ఉన్న హైప్ చూస్తే… మిగతా సినిమాలన్నీ కేవలం “లిస్ట్ నింపడానికి ఉన్నాయా?” అన్న డౌట్ కూడా వస్తోంది. 2026లో ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ఈ సినిమా OTTలోకి రావడం ఇప్పుడు హాట్ టాపిక్. థియేటర్స్‌లో మిస్ అయిన వాళ్లు ఇప్పటికే వీకెండ్ ప్లాన్ ఫిక్స్ చేసేశారు. అయితే ఇదే సమయంలో తెలుగు నుంచి మాత్రం Thimmarajupalli TV ఒక్కటే రావడం కూడా ఇప్పుడు చర్చగా మారింది. “తెలుగు OTT మార్కెట్ స్లో అయిందా?” అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

టాలీవుడ్ నుంచి ఒక్కటే.. కానీ పక్కా లోకల్!

ఈ వారం తెలుగు సినిమాల సందడి కాస్త తక్కువే ఉన్నప్పటికీ, ఉన్న ఒక్క సినిమా మాత్రం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ ఇస్తోంది. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే వెరైటీ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా ఆహా (Aha) వీడియోలో మే 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

థ్రిల్లింగ్ ఆప్షన్లతో ప్రైమ్ వీడియో హల్చల్!

మే 12 నుంచే OTT జాతర మొదలైంది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో హారర్, థ్రిల్లర్ సినిమాల జాతర కనిపిస్తోంది.

మే 12: కాళిదాస్ 2 (తమిళం), ది బుచర్స్ బ్లేడ్, ది క్రిస్టోఫర్స్, ఫేసెస్ ఆఫ్ డెత్, హ్యామ్లెట్ వంటి సినిమాలు క్యూ కట్టాయి.

మే 13: ఆఫ్‌ క్యాంపస్ (తెలుగు సహా మల్టీ లాంగ్వేజ్) స్ట్రీమింగ్ కానుంది.

మే 15: ఎగ్జామ్: ది సిస్టమ్ ఎక్స్‌పోజ్డ్ (తెలుగులో కూడా) ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది.

నెట్‌ఫ్లిక్స్ లో వరల్డ్ సినిమా రచ్చ!

కేవలం ధురంధర్ మాత్రమే కాదు, నెట్‌ఫ్లిక్స్ లో మరిన్ని వెరైటీ మూవీస్ సిద్ధంగా ఉన్నాయి. మే 13న ‘బిట్వీన్ ఫాదర్ అండ్ సన్’, మే 14న ‘సోల్ మేట్’ (హిందీలో కూడా), మే 15న హిందీ చిత్రం ‘కర్తవ్య’ , ‘ఇట్స్ నాట్ లైక్ దట్’ వంటి సినిమాలు మీ వీకెండ్‌ని మరింత కలర్‌ఫుల్‌గా మార్చేయనున్నాయి.

జియో హాట్‌స్టార్ లో పవర్ ఫుల్ యాక్షన్!

యాక్షన్ ప్రియుల కోసం జియో హాట్‌స్టార్ పవర్ ఫుల్ కంటెంట్‌ని తీసుకొస్తోంది. మే 12న ‘ది పనిషర్: వన్ లాస్ట్ కిల్’, మే 15న సంచలన సిరీస్ ‘ఇన్‌స్పెక్టర్ అవినాష్ సీజన్ 2’ (తెలుగుతో సహా) స్ట్రీమింగ్ కి రెడీగా ఉన్నాయి.

ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి లేదా ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేయడానికి ఇంతకంటే బెస్ట్ ఆప్షన్స్ ఉండవు. ఇన్ని సినిమాలు మీ ముందుకు వస్తుంటే, ఇక మొబైల్ ఫోన్లు , టీవీలకే అతుక్కుపోవడం గ్యారెంటీ! మీకు నచ్చిన సినిమాను ఇప్పుడే నోట్ చేసి పెట్టుకోండి.

Read More
Next Story