
'ఇన్సెప్షన్' కాపీ అని అంటారని 'PK' కథనే మార్చేశారా?
ఆమిర్ ఖాన్ లీక్ చేసిన షాకింగ్ మ్యాటర్!
ఆమిర్ ఖాన్ బ్లాక్ బస్టర్ హిట్ 'PK' వెనుక ఉన్న పెద్ద రహస్యాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. 'Inception' సినిమా భయంతో PK కథను ఎలా మార్చాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు!
బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన సినిమా PK. ఆమిర్ ఖాన్ నటన, రాజ్ కుమార్ హిరాని మేకింగ్ ఈ సినిమాను ఒక క్లాసిక్ గా నిలబెట్టాయి. అయితే ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో ఆమిర్ ఖాన్, డైరెక్టర్ అసలు సంతోషంగా లేరనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
'Inception' సినిమా చూసి థియేటర్లోనే ఉండిపోయారు!
అమీర్ ఖాన్ మాట్లాడుతూ...ఒక్కోసారి సినిమాలు బాగా ఆడుతుంటాయి కానీ మనం మాత్రం సంతృప్తిగా ఉండం. ఉదాహరణకు PK సినిమా ఉంది. అది చాలా బాగా ఆడింది, పెద్ద హిట్ అయ్యింది. కానీ నేను, రాజు (రాజ్ కుమార్ హిరాని) ఆ సినిమా చివర్లో ఇచ్చిన పరిష్కారం (Resolution) పట్ల అంత సంతోషంగా లేము. ఎందుకంటే, ఆయన మనసులో అసలు వేరే ఆలోచన ఉండేది. సినిమా రాయడం మొదలుపెట్టినప్పుడు అది వేరే దిశలో వెళ్లేది.
కానీ ఆ తర్వాత ఆయనకు ఏమనిపించిందంటే.. అప్పటికే 'ఇన్సెప్షన్' (Inception) సినిమా వచ్చేసింది. అందులోనూ సరిగ్గా అదే పాయింట్ ఉంది. దీంతో జనం నేను 'ఇన్సెప్షన్' సినిమాను కాపీ కొట్టానని అంటారని ఆయన భయపడ్డారు. నిజానికి అది ఆయన సొంత ఆలోచనే. అదేంటంటే.. మీరు ఒక విషయం గురించి ఎలా ఆలోచిస్తారు అనే దాన్ని ఎలా మార్చవచ్చు? అంటే, ప్రస్తుతం మీకు ఎరుపు రంగు ఇష్టం లేదు అనుకోండి, నేను మీ చిన్నతనంలోకి వెళ్లి అక్కడ ఏదైనా మార్పు చేస్తే, ఈరోజు మీకు ఎరుపు రంగు నచ్చుతుంది.
అలా ఒక వ్యక్తి మనసులోకి వెళ్లి, గతంలో ఏదైనా మార్చడం ద్వారా వారి దృక్పథాన్ని (Vision) ఎలా మార్చవచ్చనేది ఆ పాయింట్. కానీ సరిగ్గా అదే సమయంలో హాలీవుడ్ సెన్సేషన్ Inception రిలీజ్ అయ్యింది. ఆ సినిమా చూశాక హిరాని, రైటర్ అభిజాత్ షాక్ కు గురయ్యారు. ఎందుకంటే వారు రాసుకున్న పాయింట్ సరిగ్గా ఆ సినిమాలోనే ఉంది.
కాపీ కొట్టారంటారని కథ మార్చేశారు!
హాలీవుడ్ సినిమా 'ఇన్సెప్షన్' ను కాపీ కొట్టారని జనం అంటారనే భయంతో, హిరాని తన ఒరిజినల్ థాట్ ను పక్కన పెట్టేసి PK కథను మార్చాల్సి వచ్చింది. సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ, తాము అనుకున్న అసలు పరిష్కారం (Resolution) ఇవ్వలేకపోయామనే బాధ ఆమిర్ ఖాన్ లో ఇప్పటికీ ఉందట. ఒకవేళ ఆ ఒరిజినల్ పాయింట్ తోనే సినిమా వచ్చి ఉంటే ఫలితం ఎలా ఉండేదో కదా!

