ఉస్తాద్ డ్రాప్: ₹50 కోట్ల నుంచి ₹12 కోట్లకు
x

'ఉస్తాద్' డ్రాప్: ₹50 కోట్ల నుంచి ₹12 కోట్లకు

హైప్ వర్సెస్ రియాలిటీ


ఉగాది సెలవులు. పవర్ స్టార్ క్రేజ్. భారీ హైప్. ఈ మూడు కలిస్తే సాధారణంగా బాక్సాఫీస్ వద్ద సునామీ రావాలి. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ భారీ ఓపెనింగ్స్ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. మొదటి రోజు వరల్డ్‌వైడ్ ₹50 కోట్ల గ్రాస్‌తో అదిరిపోయే ప్రారంభం ఇచ్చిన సినిమా… రెండో రోజుకి వచ్చేసరికి కేవలం ₹12 కోట్లకు పడిపోయిందని ట్రేడ్ అంటోంది. అంటే ఏకంగా 76% డ్రాప్.

ఇది సాధారణ పడిపోవడం కాదు… ట్రేడ్ వర్గాల మాటల్లో చెప్పాలంటే, “అలార్మింగ్ క్రాష్.”

వివరాల్లోకి వెళితే...

ఉగాది పండుగ నాడు భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, ఓపెనింగ్స్ విషయంలో పవన్ మార్క్ మ్యాజిక్ చూపించింది. ఈ క్రమంలో మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ₹50 కోట్ల గ్రాస్ సాధించినప్పటికీ, రెండో రోజుకు వచ్చేసరికి వసూళ్లు దారుణంగా పడిపోయాయి. శుక్రవారం కేవలం ₹12 కోట్లు మాత్రమే వసూలు చేయడంతో, రెండు రోజుల మొత్తం గ్రాస్ ₹62 కోట్లకు పరిమితమైంది.ఈ భారీ పతనం చూసి ట్రేడ్ వర్గాల మైండ్ బ్లాక్ అవుతోంది.

సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు ₹200 కోట్లు సాధించాల్సి ఉంది, కానీ రెండు రోజుల్లో కేవలం 31 శాతం మాత్రమే రికవరీ అయింది. రంజాన్ సెలవు ఉన్నప్పటికీ, అడ్వాన్స్ బుకింగ్స్ రెండో రోజు కంటే తక్కువగా ఉండటం పంపిణీదారులను కలవరపెడుతోంది. దీనికి తోడు, ఈ రోజు విడుదలైన ‘ధురందర్ 2’ తెలుగు వెర్షన్ మెజారిటీ సెంటర్లలో నంబర్ వన్ ఆప్షన్‌గా మారి ఉస్తాద్‌కు గట్టి పోటీనిస్తోంది.ఓవర్సీస్ ప్రీమియర్స్ నుంచే నెగటివ్ టాక్ రావడం, తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి కొనసాగడం సినిమాకు పెద్ద దెబ్బగా మారింది.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాపై భారీగా ఖర్చు చేసినా, ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే ఇది డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను మిగిల్చే లాస్ ప్రాజెక్ట్‌గా మిగిలిపోతుందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ వీకెండ్ ముగిసేలోపే సినిమా థియేట్రికల్ రన్ 90 శాతం పూర్తయ్యేలా కనిపిస్తోంది.

అసలు డ్రాప్ ఎందుకు మొదలైంది?

“టాక్”నే గేమ్ మార్చేసింది. సినిమా రిలీజ్ కి ముందే US ప్రీమియర్స్ నుండి మిక్స్డ్ కాకుండా నేరుగా నెగటివ్ టాక్ బయటకు వచ్చింది.

జస్ట్ ఓకే,…కొంత బోర్ అనిపించింది”, “ఎక్స్‌పెక్టేషన్ కి మ్యాచ్ కాలేదు”. ఇవన్నీ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయి… మొదటి రోజు చూసే ఆడియన్స్ మీద ప్రభావం చూపింది.

కంటెంట్ కనెక్ట్ కాలేకపోవడం

పవన్ కళ్యాణ్ సినిమాలకి ఓ ప్రత్యేక ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. కానీ ఈసారి… కథలో కొత్తదనం లేకపోవడం జరిగింది. ఉత్సాహంగా థియేటర్ కి వెళ్లి చూసిన తర్వాత “ఇది ఎక్కడో చూసినట్టుంది”, “మాస్ సీన్స్ ఉన్నా… హై లేదు”, “ఎమోషన్ కిక్కు లేదు” అనే కామెంట్స్ వినిపించాయి. మరీ ముఖ్యంగా మాస్ ఎలిమెంట్స్ రిపీటివ్ అనిపించడం. ఎమోషనల్ హుక్ వీక్‌గా ఉండటం. ఈ మూడు కలిసి వర్డ్ ఆఫ్ మౌత్‌ను పూర్తిగా దెబ్బతీశాయి. సింపుల్‌గా చెప్పాలంటే వైబ్ మిస్ అయింది.

హైప్ vs రియాలిటీ గ్యాప్

మరీ ముఖ్యంగా టీజర్స్, పోస్టర్స్, ప్రమోషన్స్ చూసి ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్ పెరిగిపోయింది. కానీ థియేటర్‌లో చూసింది అదే లెవెల్ కాకపోవడంతో… “అంత హైప్ కి ఇది సరిపోదు” అనే ఫీల్ స్ట్రాంగ్‌గా వచ్చింది.

సెలవులు ఉన్నా ఉపయోగం కాలేదు

ఉగాది, రంజాన్ హాలిడేస్ ఉండటం పెద్ద ప్లస్ అనిపించింది. కానీ సెలవులు ఉన్నా పీపుల్ రిపీట్ ఆడియన్స్‌గా మారలేదు. మొదటి రోజు చూసినవాళ్లే రెండో రోజు వెళ్లమని రికమెండ్ చేయకపోవడం వల్లే భారీ డ్రాప్.

రివ్యూస్ + రీల్స్ + ట్వీట్స్ ఫైనల్ డెసిషన్ గా మారిన రోజులు ఇవి. మొదటి రోజు చూసిన వాళ్లు చెప్పింది: “వెయిట్ ఫర్ OTT” అని అంతే…రెండో రోజు ఆడియన్స్ కట్.

ఈ కేసు ఒక్క సినిమాకి మాత్రమే కాదు… మొత్తం ఇండస్ట్రీకి ఒక క్లియర్ సిగ్నల్ ఇస్తోంది. “స్టార్ పవర్ ఓపెనింగ్ ఇస్తుంది… కానీ కంటెంట్ మాత్రమే సస్టైన్ చేస్తుంది.” ఈ జనరేషన్‌లో ఫ్యాన్స్ కూడా బ్లైండ్‌గా సపోర్ట్ చేయరు. వాళ్లు ఎమోషన్, న్యూ ఫీలింగ్, జెన్యూయిన్ కిక్ కోరుకుంటారు.

అందుకే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కథ మనకు చెప్పేది సింపుల్: హైప్ ఎంత ఉన్నా… వైబ్ మిస్ అయితే, బాక్సాఫీస్ వెంటనే స్కిప్ కొడుతుంది.

ఏదైమైనా సెలవుల సీజన్ లో కూడా పవర్ స్టార్ సినిమా ఇంతలా చతికిలపడటం ఫ్యాన్స్‌ను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి వీకెండ్ లో ఏమైనా మ్యాజిక్ జరిగి సినిమా కోలుకుంటుందా లేక బాక్సాఫీస్ వద్ద ఉస్తాద్ పని అయిపోయినట్లేనా అనేది చూడాలి

Read More
Next Story