ఏపీఆర్‌సెట్‌ ఇంటర్వ్యూలు ఎప్పుడెప్పుడంటే...
x

ఏపీఆర్‌సెట్‌ ఇంటర్వ్యూలు ఎప్పుడెప్పుడంటే...

ఏపీఆర్‌సెట్‌ 2024–25 ఇంటర్వ్యూ తేదీలు ఖరారు అయ్యాయి


ఆంధ్రప్రదేశ్‌లో పీహెచ్‌డీ అర్హత పరీక్ష (Andhra Pradesh Research Eligibility Test)- ఏపీఆర్‌సెట్‌ 2024–25 ఇంటర్వ్యూ తేదీలు ఖరారు అయ్యాయి. అర్హులైన అభ్యర్థులకు ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఉన్నత విద్యామండలి కార్యదర్శి తిరుపతిరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పీహెచ్‌డీ ప్రవేశాల కోసం గతేడాది నవంబరులో శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్షలు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 65 సబ్జెక్టుల్లో ఏపీఆర్‌సెట్‌ పరీక్ష నిర్వహించారు.
ఈ పరీక్షకు మొత్తం 5,167 మంది అభ్యర్థులు హాజరుకాగా, 2,859 మంది అర్హత సాధించారు. అర్హత పొందిన అభ్యర్థులకు ఆంధ్రా, శ్రీ వెంకటేశ్వర, ఆచార్య నాగార్జున, శ్రీపద్మావతి మహిళా, కాకినాడ, అనంతపురం జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయాల పరిధిలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు మహిళా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌, ఏపీఆర్‌సెట్‌ కన్వీనర్‌ ఆర్‌. ఉష తెలిపారు.
ఇంటర్వ్యూలకు సంబంధించిన సబ్జెక్టుల వారీ తేదీల వివరాలను మంగళవారం ఏపీఆర్‌సెట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
Read More
Next Story