
ఇన్వెస్టర్ల లక్షల కోట్ల సంపద ఆవిరి
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు, చమురు ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడులు తరలిపోవడమే కారణం
ముడి చమురు ధరల పెరుగుదల, అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు, దేశీయ, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్య పరిస్థితులు మరింత కఠినంగా మారే సూచనల నేపథ్యంలో సెన్సెక్స్ లు కుప్పకూలాయి. ఒక్కరోజులోనే మదుపరుల లక్షల కోట్ల సంపద ఆవిరయింది. బెంచ్ మార్క్ స్టాక్ సూచీ సెన్సెక్స్ 1045 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 21 నెలల కనిష్టానికి పడిపోయింది.
వరుసగా రెండో రోజు కూడా 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 1,045 పాయింట్లు(1.44) పడిపోయాయి. రెండున్నర సంవత్సరాల కనిష్టానికి చేరుకుని 71,593.24 వద్ద స్థిరపడింది. ఒక స్థాయిలో ఇది 1,310.95 పాయింట్లకు చేరి అంటే 1.80 స్థాయికి పడిపోయింది. చివరగా 71,327.75 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సూచీ గతంలో అంటే ఫిబ్రవరి 24, 2024 స్థాయికి తగ్గింది. 50 షేర్ల ఎన్ఎస్ఈ నిఫ్టీ 371. 25 పాయింట్లు లేదా 1.64 శాతం పడిపోయి 21 నెలల కనిష్ట స్థాయికి చేరింది.
30 సెన్సెక్స్ కంపెనీలలో ఐటీసీ 4.24 శాతం నష్టంతో అతిపెద్ద నష్టపోయిన కంపెనీగా నిలిచింది. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ 3.36 శాతం పవర్ గ్రిడ్ 3.16 శాతం భారత్ ఎలక్ట్రానిక్స్ 3.1 శాతం, అదానీ పోర్ట్స్ 2.59 శాతం, ఎన్టీపీసీ 2.43 శాతం నష్టపోయాయి. టేక్ మహీంద్రా, యాక్సెస్ బ్యాంక్ ఇన్ఫోసిస్ లాభపడ్డాయి.
ఎక్స్ ఛేంజ్ డేటా ప్రకారం...విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్ఐఐ) బుధవారం రూ. 6,121.37 కోట్లు విలువైన ఈక్విటీలను విక్రయించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, బలహీన రూపాయి, అధిక ముడి చమురు ధరల నేపథ్యంలో సమీప భవిష్యత్ లో వడ్డీ రేట్ల కోతలు ఉండవని, తదుపరి పెంపులు ఉండవచ్చని సంకేతాలు ఇస్తూనే ఆర్బీఐ బుధవారం తన బెంచ్ మార్క్ రెపో రేటును 25 బేసీస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చింది. ఇది గత నాలుగేళ్లలో మొదటి పెంపుదల.
‘‘ఆర్బీఐ కఠిన విధానం పర్యవసానాలు రేటు సున్నితమైన రంగాలపై పడటంతో స్వల్పకాలిక వాల్యూయేషన్ మల్టిపుల్స్ ను సమర్థవంతంగా రీసెట్ చేస్తూ, దేశీయ మార్కెట్ తన తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని కొనసాగించింది. నిరంతరాయంగా జరుగుతున్న ఎఫ్ఐఐల నిష్క్రమణలు, కఠినమైన బాండ్ దిగుబడులు, క్షీణిస్తున్న భారత రూపాయి కారణంగా ఈ ప్రతికూలత మరింత తీవ్రమైంది’’ అని జియోజిత్ ఇన్వెస్టెంట్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు.
అంతేకాకుండా 100 డాలర్ల మార్క్ కు పైనే మొండిగా కొనసాగుతున్న అస్థిరమైన ముడి చమురు ధరలు జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఆటంకంగా కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. బీఎస్ఈలో మొత్తం 3,426 స్టాక్ లు క్షీణించగా, 1003 స్టాక్ లో లాభాలు పొందాయి. 225 స్థాక్ లలో ఎటువంటి మార్పులేదు.
మార్కెట్ అంతటా రిస్క్ ఎవర్షన్ తీవ్రతరం కావడంతో గురువారం భారత ఈక్విటీ బెంచ్ మార్క్ లు భారీగా నష్టాలతో ముగిశాయి. ఆర్బీఐ తన విధాన వైఖరిని క్రమబద్ధమైన కఠినతరం వైపు మార్చుకున్న ఒక రోజు తరువాత పెరుగుతున్న ఇంధన ధరలు మరింత దీర్ఘకాలిక ద్రవ్యోల్బణం ఆందోళనలు పునరుద్ధరించడంతో ముడి చమురు ఒత్తిడికి ప్రధాన కారణంగా నిలిచింది’’ అని ఆన్ లైన్ ట్రేడింగ్ వెల్త్ టెక్ సంస్థ అయిన ఎన్రిచ్ మనీ సీఈసీ పొన్ముడి ఆర్ అన్నారు.
ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పీ, జపాన్ నిక్కీ 225 సూచీ, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ సూచీ, హాంగ్ సెంగ్ సూచీ గణనీయంగా నష్టాలతో ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బుధవారం యూఎస్ స్టాక్ మార్కెట్లో నష్టాలతో ముగిశాయి.
బుధవారం సెన్సెక్స్ 429.11 పాయింట్లు పడిపోయి, 72,638 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 173.05 పాయింట్లు లేదా 0.76 శాతం క్షీణించి 22,603.05 వద్ద ముగిసింది.
Next Story
