ఆంధ్రప్రదేశ్‌కు క్వాంటమ్ వ్యాలీ అంటే ఏమిటి?
x
క్వాంటమ్ వ్యాలీ భవనానికి శంకుస్థాపన చేసిన దృశ్యం

ఆంధ్రప్రదేశ్‌కు క్వాంటమ్ వ్యాలీ అంటే ఏమిటి?

భవిష్యత్తు పెట్టుబడా? ఉద్యోగాల పంటా!


దేశ భవిష్యత్తు సాంకేతిక రంగాన్ని మలుపు తిప్పే అడుగు అమరావతిలో పడింది. ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో రూపొందించిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 50 ఎకరాల్లో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో ‘క్వాంటమ్‌ వ్యాలీ’ భవన నిర్మాణానికి ఫిబ్రవరి 7న శంకుస్థాపన చేశారు. అయితే ఇప్పుడు అందరినోట వినిపిస్తున్న ప్రశ్న-ఇది నిజంగా ఉపయోగపడుతుందా? ఉద్యోగాలు వస్తాయా? లేక ఇది కూడా మరో హైప్ ప్రాజెక్టేనా?

క్వాంటమ్ వ్యాలీ అంటే భవనం కాదు..

క్వాంటమ్ వ్యాలీ అనేది ఒక భవనం కాదు. అది ఒక పూర్తి సాంకేతిక ఎకోసిస్టం. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ సెన్సర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి భవిష్యత్తు టెక్నాలజీలపై పరిశోధనలు, పరిశ్రమలు, స్టార్టప్‌లు, నైపుణ్య శిక్షణ అన్నీ ఒకేచోట జరిగే కేంద్రం.
ఈ ప్రాజెక్టు ద్వారా భారతదేశపు తొలి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి రానుంది. ఐబీఎం, TCS, L&T లాంటి గ్లోబల్ సంస్థలు ఇందులో భాగస్వాములవడం వల్ల ఇది కేవలం రాష్ట్ర స్థాయి ప్రాజెక్టు కాదు- జాతీయ స్థాయి సాంకేతిక మైలురాయి.

యూత్‌కు తక్షణ లాభం ఏమిటి?

క్వాంటమ్ వ్యాలీ వల్ల ఉద్యోగాలు ఒక్కరోజులో లక్షల్లో రావు. కానీ తక్షణంగా యూత్‌కు మూడు మార్గాలు మాత్రం ఉన్నాయి.
మొదటిది- తక్షణ ఉద్యోగాలు.
క్వాంటమ్ వ్యాలీ క్యాంపస్‌లో IT support, data analysis, cyber security, network management, lab technicians, project coordination లాంటి ఉద్యోగాలు వెంటనే అవసరం అవుతాయి. ఇవి PhD స్థాయి ఉద్యోగాలు కాదు. ఇప్పటికే BE, BTech, MCA, MSc చదివిన యువతకు ఇవి అందుబాటులో ఉండే అవకాశాలు.
రెండోది- నైపుణ్యాల మెరుగుదల
IBM, TCS లాంటి సంస్థలతో నేరుగా శిక్షణ, internships, paid research assistant అవకాశాలు రావడం వల్ల యువత రెజ్యూమే విలువ ఒక్కసారిగా పెరుగుతుంది. అమరావతిలో శిక్షణ పొంది, ప్రపంచ ప్రాజెక్టులపై పని చేసే అవకాశం ఇదే తొలిసారి.
మూడోది- భవిష్యత్తు ఉద్యోగాలకు ముందస్తు ప్రవేశం
క్వాంటమ్ టెక్నాలజీ ఇప్పుడే ప్రారంభ దశలో ఉంది. ఈ దశలో అడుగు పెట్టిన యువతే రేపటి క్వాంటమ్ ఇంజినీర్లు, రీసెర్చ్ లీడర్లు అవుతారు.

ఐటీ ప్రపంచం ఈ రంగాన్ని ఎలా చూస్తోంది?

ఇప్పటివరకు అమరావతి క్వాంటమ్ వ్యాలీని ప్రశంసించిన వ్యాఖ్యలు లేవు. కానీ క్వాంటమ్ టెక్నాలజీపై ఐటీ ప్రముఖులు చేసిన వ్యాఖ్యలే ఈ ప్రాజెక్టుకు నేపథ్యం.
UIDAI మాజీ ఛైర్మన్ నందన్ నిలేకణి గతంలో, “Quantum computing will fundamentally change how governments handle data and security. India must invest early.” అని వ్యాఖ్యానించారు. అంటే- ఆలస్యం చేస్తే నాయకత్వం చేజారిపోతుంది.
Google CEO సుందర్ పిచాయ్ కూడా, “Countries that invest now will lead the next technology cycle.” అని స్పష్టం చేశారు. ఇది తదుపరి టెక్నాలజీ దశ — ఇప్పుడే పెట్టుబడి పెట్టాలి.
Microsoft CEO సత్య నాదెళ్ల, “Quantum computing will solve problems classical computers cannot.” అని అన్నారు.
హెల్త్‌కేర్, డిఫెన్స్, ఫైనాన్స్ వంటి రంగాల్లో అమరావతి లక్ష్యంగా పెట్టుకున్నదే ఇదే.
TCS అధికారికంగా కూడా, “Academia, industry, government కలిసి పనిచేస్తే భారత్ గ్లోబల్ క్వాంటమ్ హబ్ అవుతుంది.” అని పేర్కొంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఇదే మోడల్‌ను అనుసరిస్తోంది.

అమరావతి ఎందుకు కీలకం?

ఈ ప్రాజెక్టు అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగా కాకుండా సాంకేతిక రాజధానిగా మార్చే ప్రయత్నం. ప్రపంచంలో బోస్టన్, సింగపూర్, షాంఘై లాంటి క్వాంటమ్ హబ్‌ల సరసన అమరావతిని నిలబెట్టాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
దీని నుంచి ఏమేమీ రావొచ్చునంటే..
గ్లోబల్ పెట్టుబడులు
స్టార్టప్ ఎకోసిస్టం
పరిశోధన సంస్థలు
ఉపాధి అవకాశాలు
క్వాంటమ్ వ్యాలీ రేపటికి ఉద్యోగాల వర్షం కురిపించదు. కానీ ఇది రేపటి ఉద్యోగాలకు పునాది. ఈరోజు అడుగు పెట్టిన యువతే రేపటి సాంకేతిక నాయకత్వానికి ముఖచిత్రం. క్వాంటమ్ వ్యాలీ ఒక భవనం కాదు.
అది- ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై వేసిన దీర్ఘకాల పెట్టుబడిగా భావించాలని ఐటీ సెక్టార్ లో నిపుణుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు.
Read More
Next Story