
ప్రతీకాత్మక చిత్రం
ఒకే రోజు... రెండు కోర్టులు... రెండు తీర్పులు...
ఒకే దేశం, ఒకే దర్యాప్తు సంస్థ, ఒకే న్యాయవ్యవస్థ.. రెండు సంచలనాలు...
ఆయేషా మీరా హత్య కేసు, అరవింద్ కేజ్రీవాల్ లీగల్ కేసు భారతీయ న్యాయ వ్యవస్థలోని కీలక వైరుధ్యాన్ని బయటపెడుతున్నాయి.
రెండూ సీబీఐ దర్యాప్తు చేసినవే. భిన్నమైన సందర్భాలకు చెందినవే.
అయేషా మీరా అస్థికలతో విజయవాడలో శుక్రవారం జరిగిన నిరసన ప్రదర్శన
మొదటిది హింసాత్మక నేరంలో న్యాయం కోసం జరిగిన పోరాటాన్ని హైలైట్ చేస్తుంది, రెండవది అత్యధిక ప్రొఫైల్ రాజకీయ అవినీతి ఆరోపణల చుట్టూ తిరుగుతుంది.
ఫిబ్రవరి 2026 నాటికి, రెండు కేసుల్లోనూ ముఖ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆయేషా మీరా కేసులో దోషులెవరికీ శిక్ష లేకుండా మూతబడింది. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఊరట పొందారు.
దేశ రాజధాని ఢిల్లీ..
ఫిబ్రవరి 27, 2026... ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఒక పెద్ద రాజకీయ నాయకుడికి భారీ ఊరట ఇచ్చింది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు మరో 20 మందికి లిక్కర్ పాలసీ అవినీతి కేసులో పూర్తి విముక్తి.
“కుట్ర లేదు, నేరపూరిత ఉద్దేశ్యం లేదు, సాక్ష్యాలు లేవు” అని కోర్టు స్పష్టం చేసింది. సీబీఐ చార్జ్‌షీట్‌లో తప్పుదారి పట్టించే వ్యాఖ్యానాలు, లోపాలు ఉన్నాయని, దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన విచారణ జరపాలని కూడా ఆదేశించింది.
కోర్టు బయట కేజ్రీవాల్ కళ్లు తుడుచుకుంటూ “సత్యం చివరికి గెలుస్తుందని ఎప్పుడో చెప్పాం. సత్యం మావైపే ఉంది. సిట్టింగ్ ముఖ్యమంత్రిని ఇంటి నుంచి లాగి జైలులో పడేశారు. మాపై బురద జల్లారు.”
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి...
ఫిబ్రవరి 27, 2026...ఇదే రోజు... విజయవాడలోని సీబీఐ కోర్టు మరో 19 ఏళ్ల పోరాటానికి తెరపడింది. 2007లో 18 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరాను హత్య చేసి, బాత్‌రూమ్‌లో పడేసిన కేసు. సీబీఐ ఫైనల్ రిపోర్ట్‌ను కోర్టు అంగీకరించింది.. “న్యాయపరంగా స్థిరమైన సాక్ష్యాలు లేవు” అని కేసును మూసివేసింది. ఆయేషా తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు, దర్యాప్తుపై అసంతృప్తి కారణంగా మరిన్ని చట్టపరమైన పోరాటాలు చేయలేకపోయారు.
ఆయేషా అవశేషాలు తల్లిదండ్రులకు అప్పగించారు. తెనాలిలో ఖననం ఏర్పాట్లు జరిగాయి. ఆమె తల్లి షంషాద్ బేగం ఆవేదనతో “19 ఏళ్లుగా పోరాటం చేశాం... న్యాయం జరగలేదు. ఆ దేవుడే దోషులను కఠినంగా శిక్షించాలి.”
తులనాత్మక చిత్రం ఏమిటి?
రెండూ సీబీఐ దర్యాప్తు కేసులు.
రెండు కోర్టులూ “సాక్ష్యాలు లేవు, దర్యాప్తులో లోపాలు” అని స్పష్టం చేశాయి.
రెండూ దేశవ్యాప్త సంచలనం కలిగించినవి.
అనుకోకుండా వచ్చినవే అయినా ఈ రెండు కేసుల తీర్పులు ఒకే రోజు వచ్చాయి.
ఒకటి రాజధానిలో, మరొకటి ఆంధ్రప్రదేశ్ అనధికార రాజధాని విజయవాడలో.
ఒక వైపు శక్తి గలవారికి న్యాయం వేగంగా, త్వరగా, పూర్తిగా దొరికింది. మరో వైపు సామాన్యులకు, ముఖ్యంగా బలహీనులకు- దశాబ్దాల పోరాటం, ఆర్థిక భారం, చివరికి న్యాయం దక్కని నిరాశ.
ఒక కేసులో “రాజకీయ ప్రతీకారం” అని ఆరోపణలు వచ్చాయి.
మరొక కేసులో “రాజకీయ ప్రభావితులను కాపాడుకోవడానికి సామాన్యుడిని ఫ్రేమ్ చేశారు” అని ఆరోపణలు వచ్చాయి.
రెండు కేసుల్లోనూ సీబీఐ దర్యాప్తు ప్రశ్నార్థకం అయింది.
రెండు కేసుల్లోనూ కోర్టు “సాక్ష్యాలు సరిపోలేదు” అని చెప్పింది.
కానీ ఫలితం ఏమిటీ?
ఒకరికి స్వేచ్ఛ, గెలుపు, భవిష్యత్.
మరొకరికి శాశ్వత గాయం, దుఖం, అన్యాయం.
ఇది కేవలం రెండు కేసుల కథ కాదు.
ఇది భారతీయ న్యాయవ్యవస్థలోని ఒక కఠిన సత్యం- శక్తి ఉన్నవారికి తీర్పు త్వరగా, సామాన్యులకు తీర్పు ఆలస్యంగా లేదా అసంపూర్తిగా.
సత్యం గెలుస్తుందా?
కొందరికి అవును.
కొందరికి... ఆ దేవుడే శిక్షించాలి.
ఒకే రోజు వచ్చిన ఈ రెండు తీర్పులు, దేశానికి ఒక ప్రశ్న మిగిల్చాయి:
న్యాయం అందరికీ సమానంగా ఉందా? లేదా కేవలం శక్తి మీద ఆధారపడి ఉందా?
ఈ తీర్పులపై భిన్నాభిప్రాయాలు..
ఆయేషా మీరా కేసు మూసివేతపై న్యాయ నిపుణులు, ప్రముఖ లాయర్ల నుంచి స్పష్టమైన, వివరణాత్మక వ్యాఖ్యలు పెద్దగా రాలేదు. కొన్ని మీడియా రిపోర్టులు, సోషల్ మీడియా, సివిల్ రైట్స్ గ్రూపుల నుంచి విమర్శలు వచ్చాయి.
"ఘనత వహించిన మన ప్రజాస్వామ్య వ్యవస్థల గొప్పదనానికి మరో గీటురాయి ఈ కేసు" అని విజయవాడకు చెందిన సివిల్ రైట్స్ యాక్టివిస్ట్ అక్బర్ వ్యాఖ్యానించారు.
"అధికారం వ్యవస్థల్ని ప్రభావితం చేయడం గురించిన తాజా ఉదాహరణ" అని వామపక్షవాది శరత్ అన్నారు.
ఆయేషా మీరా హత్య కేసులో నిందితులను తేల్చలేక 19 ఏళ్ల తర్వాత న్యాయవ్యవస్థ చేతులెత్తేయడంతో సిబిఐ ఆమె అస్తికలను ఈరోజు విజయవాడ కోర్టు వద్ద ఆ బాలిక అస్థికలను తల్లిదండ్రులకు అంద చేసింది. న్యాయవాదులు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు అస్థికలను ఊరేగింపుగా అంబేద్కర్ విగ్రహం వద్దకు తీసుకువెళ్లి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల కోసం తెనాలి తీసుకువెళ్లారు. పది రోజుల్లో అస్థికలను తిరిగి ఇస్తామని చెప్పిన సిబిఐ అనేక ఏళ్ల న్యాయ పోరాటాల తర్వాత ఎట్టకేలకు అస్తికలను అందజేసింది.. న్యాయ , దర్యాప్తు సంస్థల వైఫల్యాన్ని ప్రజా సంఘాలు, ఆయేషా మీరా తల్లిదండ్రులు, మహిళా సంఘాలు తీవ్రంగా నిరసించాయి.
కొందరు లీగల్ అబ్జర్వర్లు, సివిల్ రైట్స్ గ్రూపులు ఈ తీర్పును "న్యాయ వ్యవస్థలోని సిస్టమిక్ లోపాలు"గా, "జస్టిస్ డెలివరీపై పబ్లిక్ ఫెయిత్ దెబ్బతినడం"గా వ్యాఖ్యానించారు.
ఉదాహరణకు, కొన్ని రిపోర్టుల్లో "wrongful conviction, systemic lapses" అని పేర్కొన్నారు. సత్యం బాబు విషయంలో గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, రికార్డుల ధ్వంసం వంటివి ఇంకా చర్చనీయాంశాలుగా ఉన్నాయి.
తల్లిదండ్రులు (షంషాద్ బేగం, సయ్యద్ ఇక్బాల్) భావోద్వేగంతో మాట్లాడారు — "19 ఏళ్ల పోరాటం వ్యర్థం, దేవుడే శిక్షించాలి" అని. ఇది మీడియాలో ఎక్కువగా కవర్ అయింది.
అరవింద్ కేజ్రీవాల్ కేసు తీర్పుపై..
ఇక్కడ నిపుణుల వ్యాఖ్యలు ఎక్కువగా వచ్చాయి. కోర్టు తీర్పులో "no overarching conspiracy or criminal intent", "no cogent evidence", "prosecution failed to substantiate" అని స్పష్టంగా పేర్కొంది. CBI దర్యాప్తుపై కోర్టు గట్టిగానే విమర్శించింది.
కోర్టు డిశ్చార్జ్ (ఛార్జెస్ ఫ్రేమ్ చేయకుండానే విడుదల) అనేది "ప్రాథమిక ఆధారాలు కూడా లేవు" అని అర్థం. ట్రయల్ కూడా జరగకుండా కేసు ముగిసింది. ఇది అక్విటల్ కంటే బలమైన రిలీఫ్ అని కొందరు లాయర్లు చెప్పారు.
కొందరు లీగల్ ఎక్స్‌పర్ట్స్ ఇది "ప్రాసిక్యూషన్ కేసు conjecture (ఊహాగానాలు) మీద ఆధారపడింది" అని, CBI లోపాలను హైలైట్ చేశారు.
కొందరు విమర్శకులు మాత్రం ఇది "anti-corruption framework బలహీనపడుతుంది", "high-profile casesలో తప్పుడు సందేశం" ఇస్తుందని అన్నారు.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్: "ఇది పూర్తిగా పొలిటికల్ కేసు, బేసిస్ లేదు. AAP ఎప్పుడూ ఇమాందార్."
కేజ్రీవాల్ స్వయంగా: "సత్యం గెలిచింది, దేశంలో అతిపెద్ద పొలిటికల్ కాన్స్పిరసీ."
మీడియా (ఇండియా టుడే, ఎకనామిక్ టైమ్స్, హిందుస్తాన్ టైమ్స్ వంటివి)లో ఈ తీర్పును "CBIపై షార్ప్ రిబ్యూక్", "conspiracy theory కూలిపోయింది" అని విశ్లేషించారు.
అసలేమిటీ కేసులు
ఆయేషా మీరా కేసు (2007–2026)
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఒక హాస్టల్‌లో 17 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని బలాత్కారం చేసి హత్య చేసిన హింసాత్మక నేరం.
దర్యాప్తులో లోపాలు, సాక్ష్యాల ధ్వంసం, హై-ప్రొఫైల్ నిందితులను కాపాడే ఆరోపణలతో 19 ఏళ్ల చట్టపరమైన పోరాటం.
తీర్పు: ఫిబ్రవరి 21, 2026న సీబీఐ కోర్టు సీబీఐ ఫైనల్ రిపోర్ట్‌ను అంగీకరించింది. “న్యాయపరంగా స్థిరమైన సాక్ష్యాలు లేవు, ముందుకు వెళ్లే ఆధారాలు లేవు” అని పేర్కొంది. దీంతో దీర్ఘకాల పోరాటం ముగిసింది. బాధితురాలి తల్లిదండ్రులు దర్యాప్తు లోపభూయిష్టమని ఆరోపించినప్పటికీ, ఆర్థిక ఇబ్బందులు, అసంతృప్తి కారణంగా మరిన్ని చట్టపరమైన చర్యలు తీసుకోలేకపోయారు.
నిందితులు: మొదటి నిందితుడు సత్యం బాబు జీవిత ఖైదు శిక్ష పొందాడు కానీ 2017లో హైకోర్టు “దర్యాప్తు నాసిరకంగా ఉంది” అని బెయిల్ ఇచ్చి విడుదల చేసింది.
అరవింద్ కేజ్రీవాల్ కేసు (2023–2026)
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (మద్యం విధానం) రూపొందించడంలో అవినీతి, మనీ లాండరింగ్ ఆరోపణలు.
రాజకీయ ప్రతీకారం ఆరోపణలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సీబీఐ దర్యాప్తులు.
తీర్పు: ఫిబ్రవరి 27, 2026న రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఇతరులను క్లీన్ చిట్ ఇచ్చింది. “నేరపూరిత ఉద్దేశ్యం లేదు, అవినీతి జరగలేదు, దర్యాప్తు ఫలితాల్లో తీవ్ర లోపాలు ఉన్నాయి” అని తీర్పు ఇచ్చింది. కేజ్రీవాల్ 2024 సెప్టెంబర్‌లో బెయిల్‌పై విడుదలయ్యారు, ఇప్పుడు విముక్తి పొందారు.
Next Story

