ఆర్థిక అసమానతల మధ్య P4 సమసమాజానికి మార్గమా?
x
విలేకరులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు నాయుడు

ఆర్థిక అసమానతల మధ్య P4 సమసమాజానికి మార్గమా?

ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక అసమానతల గురించి ఇటీవల ఎక్కవ సార్లు మాట్లాడుతున్నారు. పి4 కార్యక్రమం అందుకు విరుగుడు అనటంపై చర్చ మొదలైంది.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామమైన నారావారిపల్లెలో విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. "బిలియనీర్స్ పెరుగుతున్నారు... ఆర్థిక అసమానతలు కూడా పెరుగుతున్నాయి. అసమానతలు తగ్గకుంటే సంతృప్తి ఉండదు. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తేనే నిజమైన సమసమాజం అవుతుంది" అని సీఎం పేర్కొన్నారు. అందుకే పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (P4) ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చి, 10 లక్షల కుటుంబాలను దత్తత తీసుకున్నామని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఆర్థిక అసమానతలు పెరుగుతున్న నేపథ్యంలో P4 ద్వారా సమసమాజం స్థాపన సాధ్యమా అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఈ కథనంలో ఆ వ్యాఖ్యలను విశ్లేషణాత్మకంగా పరిశీలిద్దాం.

P4 ప్రోగ్రామ్ లక్ష్యాలు, నేపథ్యం

2025లో సీఎం చంద్రబాబు నాయుడు లాంచ్ చేసిన P4 పేదరిక నిర్మూలనకు ఒక నూతన మోడల్. ఇందులో సమాజంలోని టాప్ 10 శాతం ధనవంతులు బాటమ్ 20 శాతం పేద కుటుంబాలను దత్తత తీసుకుని విద్య, ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబనలో సహాయం చేయాలనేది ముఖ్య ఉద్దేశం. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను పేదరిక రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం. ఇప్పటికే 1.3 మిలియన్ 'గోల్డెన్ ఫ్యామిలీస్'ను గుర్తించి ప్రైవేట్ సంస్థలు, ధనవంతుల సహకారంతో మెంటర్‌షిప్ ప్రారంభమైంది. సీఎం వ్యాఖ్యలు ఈ ప్రోగ్రామ్‌ను ఆర్థిక అసమానతలకు విరుగుడుగా చూపుతున్నాయి. కానీ వాస్తవంలో ఇది సమసమాజానికి ఎంతవరకు దోహదపడుతుంది?


ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న చంద్రబాబు నాయుడు

భారత్‌లో ఆర్థిక అసమానతల యథాతథం

వరల్డ్ ఇన్‌ఇక్వాలిటీ రిపోర్ట్ 2026 ప్రకారం భారత్ ప్రపంచంలో అత్యంత అసమానతలు కలిగిన దేశాల్లో ఒకటి. టాప్ 10 శాతం వ్యక్తులు 58 శాతం జాతీయ ఆదాయాన్ని సంపాదిస్తుండగా, బాటమ్ 50 శాతం కు కేవలం 15 శాతం మాత్రమే లభిస్తోంది. సంపదలో కూడా టాప్ 1 శాతం 40 శాతం సంపదను కలిగి ఉండగా, బాటమ్ 50 శాతం కు 6 శాతం మాత్రమే. బిలీయనర్ల సంఖ్య 1991లో 1 నుంచి 2023లో 271కి పెరిగింది. వారి సంపద జాతీయ ఆదాయంలో 25 శాతం కి చేరింది. ఈ అసమానతలు GDP గ్రోత్ ఉన్నప్పటికీ పెరుగుతున్నాయి. ఎందుకంటే గ్రోత్ ప్రయోజనాలు టాప్ లేయర్‌కే చేరుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తుంది. ఇక్కడ పేదరిక రేటు ఇంకా 10-15 శాతం మధ్య ఉంది.

P4 సానుకూల అంశాలు

ఈ ప్రోగ్రామ్ ప్రైవేట్ సెక్టర్ సహకారంతో పేదలకు నేరుగా సహాయం చేస్తుంది. ఉదాహరణకు MEIL గ్రూప్ వంటి సంస్థలు 1,500 కుటుంబాలను అడాప్ట్ చేశాయి. ఇది విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు సృష్టించి, స్థానిక స్థాయిలో అసమానతలను తగ్గించవచ్చు. సీఎం చెప్పినట్లు ఇది 'గాడ్-గివెన్ రెస్పాన్స్ బిలిటీ'గా ధనవంతులను ప్రోత్సహిస్తుంది. ఇది సామాజిక బాధ్యతను పెంచుతుంది. గ్లోబల్ మోడల్‌గా మారవచ్చు. ఎందుకంటే ఇలాంటి పబ్లిక్-ప్రైవేట్ మోడల్స్ ఇతర దేశాల్లో విజయవంతమయ్యాయి.


విమర్శలు, సవాళ్లు

P4 ద్వారా సమసమాజం స్థాపన సాధ్యమా అనేది ప్రశ్నార్థకం. ఇది ఛారిటీ ఆధారిత మోడల్, ఇది లాంగ్-టర్మ్ స్ట్రక్చరల్ మార్పులు తీసుకురాదు. అసమానతలు పెరగడానికి కారణాలు ట్యాక్స్ పాలసీలు. వేజ్ గ్యాప్, కార్పొరేట్ పవర్ ఇవి అడ్రస్ చేయకుండా కేవలం అడాప్షన్ సరిపోదు. వరల్డ్ ఇన్‌ఇక్వాలిటీ రిపోర్ట్ ప్రకారం భారత్ గ్రోత్ టాప్ 1 శాతం కే ప్రయోజనం చేకూర్చుతోంది. బిలియనీర్ల సంపద 8 శాతం రేటుతో పెరుగుతుండగా, బాటమ్ హాఫ్ 4 శాతం మాత్రమే. P4లో 10-20 లక్షల కుటుంబాలు (సుమారు 5-10 శాతం పాపులేషన్) మాత్రమే కవర్ అవుతాయి. మిగిలినవారికి ఏమిటి? ఇది పాలసీ ఫెయిల్యూర్‌లను కవర్ చేసే ప్రయత్నంగా కనిపిస్తుంది.

ఎక్స్‌పెరిమెంట్‌గా మిగిలిపోతుందా...

సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు ఆర్థిక అసమానతలపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్నాయి. P4 ఒక మంచి ప్రారంభం కావచ్చు. కానీ నిజమైన సమసమాజం కోసం ప్రగతిశీల ట్యాక్స్ సిస్టమ్, ఉపాధి సృష్టి, సామాజిక వెల్ఫేర్ ప్రోగ్రామ్‌లు అవసరం. P4 విజయం దాని ఇంప్లిమెంటేషన్, మానిటరింగ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది సమసమాజానికి మార్గమవుతుందా లేదా మరో పాలసీ ఎక్స్‌పెరిమెంట్‌గా మిగిలిపోతుందా అనేది సమయమే చెప్పాలి.

Read More
Next Story