బీజేపీని ఇరాకటంలో పడేసిన సొంత పార్టీ మంత్రి వ్యాఖ్యలు


మధ్యప్రదేశ్ గిరిజన వ్యవహారాల మంత్రి కున్వర్ విజయ్ షా.. కల్నల్ సోఫియా ఖురేషిని పహల్గామ్‌లో "హిందూ పౌరులను" చంపిన ఉగ్రవాదుల సోదరిగా అభివర్ణించారు. ఇది బీజేపీని తీవ్ర ఇరాకటంలో పడేసింది. ఇండోర్ సమీపంలోని MHOW అసెంబ్లీ నియోజకవర్గంలోని మాన్పూర్ బ్లాక్‌లోని ఒక బహిరంగ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "మన తల్లులు, కుమార్తెల సిందూరాన్ని తీసివేసిన వారికి, వారికి గుణపాఠం చెప్పడానికి మోడీ వారి సొంత సోదరిని పంపారు (sic)" అని షా అన్నారు.

మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేస్తూ, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితు పట్వారీ ఆయనను రాష్ట్ర మంత్రివర్గం నుండి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలకు బీజేపీ వివరణ ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.

Read More
Next Story