జమ్మూలో ఏడుగురు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్‌లో బీఎస్ఎఫ్ బలగాలు ఏడుగురు ఉగ్రవాదులను హతం చేసింది. సరిహద్దు దాటి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా బలగాలు దాడులు చేశాయి. వీటిలో ఏడుగురు చొరబాటుదారులు మరణించారు. ఈ ఘటన సంబ సెక్టార్‌లో జరిగింది. ఆ ప్రాంతంలో పెద్ద ఉగ్రవాద గ్రూప్.. ఇండియాలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నానికి పాకిస్థాన్ ఆర్మీ మరోవైపు కాల్పులు జరుపుతూ మద్దతు ఇస్తందుని బీఎస్‌ఎఫ్ ప్రతినిధి వ్యాఖ్యానించారు.
‘‘చొరబాటుదారులను అడ్డుకునే క్రమంలో ఏడుగురు ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. ఈ కాల్పుల్లో ధాందర్ పోస్ట్‌కు తీవ్ర డ్యామేజ్ అయింది’’ అని అధికారి పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ థర్మల్‌ను ధ్వంసం చేసిన క్లిప్‌ను కూడా బీఎస్ఎఫ్ షేర్ చేసుకుంది.
Next Story